News


ఎస్‌బీఐ చేతికి యస్‌ బ్యాంక్‌??

Friday 6th March 2020
news_main1583465579.png-32311

  • ఎల్‌ఐసీతో కలిసి టేకోవర్‌ వార్తలు

రిజర్వ్ బ్యాంక్ మారటోరియం విధిస్తున్నట్లు ప్రకటించడానికి ముందు.. యస్‌ బ్యాంక్‌ను ఎల్‌ఐసీతో కలిసి ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) సారథ్యంలోని కన్సార్షియం టేకోవర్ చేయనుందంటూ వార్తలు వచ్చాయి. దీనికి కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కన్సార్షియం మొత్తం 49 శాతం వాటాలు కొనేలా ప్రతిపాదనలు ఉన్నట్లు సమాచారం. నియంత్రణాధికారాలు దక్కే స్థాయిలో వాటాలు కొనుగోలు చేసేందుకు సంబంధించి త్వరలోనే అధికారికంగా ప్రకటన కూడా రావొచ్చని అధికార వర్గాలు పేర్కొన్నాయి. గురువారం ముంబైలో ఎస్‌బీఐ బోర్డు సమావేశం కావడం ఈ వార్తలకు ఊతమిచ్చింది. యస్ బ్యాంక్ మూతబడే పరిస్థితి ఉండబోదంటూ ఎస్‌బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ వ్యాఖ్యలు చేసిన కొన్నాళ్లకే ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. కొటక్ మహీం‍‍ద్రా వంటి ప్రైవేట్ దిగ్గజ బ్యాంకులు.. యస్ బ్యాంక్‌ను టేకోవర్ చేసేందుకు అనువైనవంటూ గతంలో ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు ఈ వార్తలపై వివరణనివ్వాలంటూ ఎస్‌బీఐ, యస్ బ్యాంకులకు స్టాక్ ఎక్స్చేంజీలు సూచించాయి. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిబంధనల ప్రకారం అలాంటి పరిణామాలేమైనా ఉన్న పక్షంలో వెల్లడిస్తామంటూ ఎస్‌బీఐ తెలియజేసింది. అటు యస్ బ్యాంక్ కూడా .. ఇప్పటిదాకా తమకు దీనిపై ఆర్‌బీఐ లేదా ప్రభుత్వం లేదా ఇతరత్రా నియంత్రణ సంస్థలు, ఎస్‌బీఐ నుంచి ఏ విధమైన సమాచారమూ రాలేదని తెలిపింది. అటు, బ్రోకరేజీ సంస్థలు మాత్రం యస్‌ బ్యాంక్ పరిస్థితి ఆశావహంగా లేదంటూ వ్యాఖ్యానించాయి. ఒకవేళ ఇన్వెస్టర్లకు బలవంతంగా అంటగట్టినా .. మొండిబాకీల రిస్కులు భారీగా ఉన్నందున బ్యాంకు విలువను సున్నా కింద లెక్కగట్టి తీసుకోవడమే జరగవచ్చని జేపీ మోర్గాన్ వర్గాలు వ్యాఖ్యానించాయి. 



You may be interested

‘‘యస్‌’’ నుంచి ‘‘నో’’ వరకు: యస్‌బ్యాంక్‌ ప్రస్థానం

Friday 6th March 2020

యస్‌ బ్యాంక్‌ ప్రస్థానం ఇలా... జూన్‌ 12, 2018: యస్‌ బ్యాంక్‌  ఎమ్‌డీ, సీఈఓగా రాణా కపూర్‌ పునర్నియామాకానికి వాటాదారుల ఆమోదం  ఆగస్టు 30, 2018: యస్‌ బ్యాంక్‌కు ఎమ్‌డీగా, సీఈఓగా రాణా కపూర్‌ కొనసాగడానికి ఆర్‌బీఐ ఆమోదం  సెప్టెంబర్‌ 19, 2018: రాణా కపూర్‌ పదవీ కాలాన్ని జనవరి 31,2019 వరకే తగ్గించిన ఆర్బీఐ  సెప్టెంబర్‌ 21, 2018: యస్‌ బ్యాంక్‌ షేర్‌ 30 శాతం పతనం, రూ.21,951 కోట్ల మార్కెట్‌ క్యాప్‌ ఆవిరి  సెప్టెంబర్‌

యస్ బ్యాంక్‌పై ఆర్‌బీఐ కొరడా!!

Friday 6th March 2020

విత్‌డ్రాయల్స్‌పై పరిమితులు ఏప్రిల్ 3 దాకా మారటోరియం అప్పటిదాకా రూ. 50వేల విత్‌డ్రాయల్‌కే అనుమతి బ్యాంక్ బోర్డు రద్దు అడ్మినిస్ట్రేటర్ నియామకం న్యూఢిల్లీ: కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలు, మొండిబాకీల భారం, నిధుల కొరత కష్టాలతో సతమతమవుతున్న ప్రైవేట్ రంగ యస్ బ్యాంకుపై రిజర్వ్ బ్యాంక్ కొరడా ఝుళిపించింది. బ్యాంక్ బోర్డును రద్దు చేయడంతో పాటు ఖాతాదారులకు షాక్‌నిచ్చేలా విత్‌డ్రాయల్స్‌పై పరిమితులు విధించింది. ఖాతాదారులకు రూ. 50,000కు మించి చెల్లింపులు జరపకుండా 30 రోజుల మారటోరియం విధిస్తూ ఆర్‌బీఐ

Most from this category