News


ఎస్‌బీఐలో యస్‌బ్యాంక్‌ విలీనం ప్రసక్తే లేదు: ఎస్‌బీఐ ఛైర్మన్‌ రజనీష్‌

Saturday 7th March 2020
news_main1583572345.png-32352

ఎస్‌బీఐలో యస్‌బ్యాంక్‌ విలీనం ప్రసక్తే లేదని, కేవలం వాటాను మాత్రమే కొనుగోలు చేస్తున్నట్లు  ఎస్‌బీఐ ఛైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ స్పష్టతనిచ్చారు. యస్‌బ్యాంక్‌ లో నియంత్రణ వాటాను ఎస్‌బీఐ కొనుగోలు చేసే అంశంపై రజనీష్‌ శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఆర్‌బీఐ ప్రతిపాదించిన డ్రాఫ్ట్‌ స్కీంపై స్పందించేందుకు తమకు సోమవారం వరకు గడువు ఉందని రజనీష్‌ తెలిపారు. మెండిబకాయిలతో ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన యస్‌బ్యాంక్‌ను గట్టెక్కించేందుకు ఆర్‌బీఐ ప్రతిపాదించిన డ్రాప్ట్‌ స్కీంపై తమ బ్యాంక్‌ న్యాయబృందం తగిన శ్రద్ధ చూపొందన్నారు. ఆర్‌బీఐ గడువు ముందే తీర్మాన ప్రణాళికను అమలు చేయడానికి ఎస్‌బీఐ ప్రయత్నిస్తుందని, ఎస్‌బీఐలో యస్‌బ్యాంక్‌ విలీనం ఎట్టిపరిస్థితుల్లో ఉండదని రజనీష్‌ తెలిపారు. 

యస్‌బ్యాంక్‌లో 49శాతం వాటాను ఎస్‌బీఐ మాత్రమే కొనుగోలు చేస్తే రూ.2400కోట్ల పెట్టుబడి అవసరం అవుతోంది. పెట్టుబడి పథకాన్ని చూసిన తరువాత మొత్తం 23 మంది ఇన్వెస్టర్లు ఎస్‌బీఐని సంప్రదించారని రజనీష్‌ చెప్పారు. యస్‌బ్యాంక్‌లో ఎస్‌బీఐ 49శాతం లేదా 26శాతం వాటాను కొనుగోలు చేస్తుందా అనేది ఇన్వెస్ట్‌మెంట్‌పై ఆధారపడి ఉంటుంది. మరికొందరు ఇన్వెస్టర్ల నుండి వచ్చిన ఆసక్తి ని కూడా పరిశీలిస్తున్నాము. దీనిపై ఎస్‌బీఐ బోర్డు తుది నిర్ణయాన్ని తీసుకుంటుందని కుమార్ చెప్పారు.

కార్పోరేట్‌ గవర్నెన్స్‌ లోపాలు, మొండిబకాయిల భారం, నిధుల కొరత కష్టాల్లో సతమవుతున్న తరుణంలో గురువారం ఆర్‌బీఐ యస్‌బ్యాంక్‌ బోర్డును రద్దు చేసింది. అలాగే విత్‌డ్రాయిల్‌ రూ.50వేలకు మించకుండా పరిమితులు విధించింది. ఈ నేపథ్యంలో యస్‌ బ్యాంకులో ఇన్వెస్ట్‌ చేయడానికి ఎస్‌బీఐ ఆసక్తి చూపుతున్నట్లు యస్‌బ్యాంక్‌ ఆర్‌బీఐను సంప్రదించింది. ఆర్‌బీఐ యస్‌ బ్యాంకు పునర్నిర్మాణ స్కీమ్‌ 2020 ముసాయిదాను రూపొందించింది.  దీని ప్రకారం.. వ్యూహాత్మక ఇన్వెస్టర్లు యస్‌ బ్యాంక్‌లో 49 శాతం వాటాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 



You may be interested

వాడని కార్డులు 16 తర్వాత.. ఆన్‌లైన్‌లో పనిచేయవు!

Saturday 7th March 2020

 ఇప్పటిదాక ఒక్కసారికూడా ఆన్‌లైన్‌ లావాదేవీల్లో ఉపయోగించని క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు,​ కాంటాక్ట్‌లెస్‌ కార్డులు మార్చి 16 తర్వాత పనిచేయవు. ప్రస్తుత కాలంలో లావాదేవీలన్నీ డిజిటల్‌ కావడంతో వేగంగా పనులు జరిగిపోతున్నాయి. దాదాపు 70 శాతం మంది  ఆన్‌లైన్‌లో క్రయవిక్రయాలు జరుపుతూ తమపనులను ఇట్టే పూర్తిచేసుకుంటున్నారు. డిజిటల్‌ పేమెంట్స్‌ పెరుగుతున్న కొద్దీ సైబర్‌ ఆర్థిక మోసాలు అంతే స్థాయిలో నమోదవుతున్నాయి. దీన్ని కట్టడి చేసేందుకు రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ) 2020 మార్చి

రూపాయ్‌@ 74- 17 నెలల కనిష్టం

Saturday 7th March 2020

గత వారం 4 రోజులపాటు పతనమే వారాంతాన సైతం 54 పైసలు మైనస్‌ 74 చేరువలో ముగింపు ఇం‍ట్రాడేలో 74.08కు రూపాయి డాలరుతో మారకంలో ఇటీవల నేలచూపులకే పరిమితమవుతూ వస్తున్న దేశీ కరెన్సీ శుక్రవారం మరింత నీరసించింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి 54 పైసలు పతనమైంది. 73.87 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో కనిష్టంగా 74.08ను తాకింది. గురువారం ఒక్క రోజు మినహాయిస్తే గత వారమంతా దేశీ కరెన్సీ క్షీణ పథంలోనే సాగింది. వెరసి శుక్రవారం(6)తో

Most from this category