News


ఎస్‌బీఐ ఎగవేతదారులు వీరే...

Saturday 29th June 2019
news_main1561781026.png-26674

  • పది బడా ఉద్దేశపూర్వక డిఫాల్టర్ల వివరాల వెల్లడి

ముంబై: ప్రభుత్వరంగంలోని అతిపెద్ద బ్యాంకు ఎస్‌బీఐ, ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగ్గొట్టిన పది పెద్ద ఖాతాదారుల వివరాలను వెల్లడించింది. ఇందులో ఫార్మా కంపెనీలు, జెమ్స్‌, జ్యుయలరీ సంస్థలు, విద్యుత్‌ రంగ కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలతోపాటు, వీటికి సంబంధించి కొంత మంది డైరెక్టర్లను ఉద్దేశపూర్వక ఎగవేతదారులుగా ప్రకటించింది. ఈ పది ఖాతాల నుంచి ఎస్‌బీఐకి రూ.1,500 కోట్ల మేర రుణాలు వసూలు కావాల్సి ఉంది. తీసుకున్న రుణాలను వడ్డీతోపాటు 15 రోజుల్లోపు తిరిగి చెల్లించకపోతే చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటామని ఎస్‌బీఐ హెచ్చరించింది.



You may be interested

ట్రావెల్‌ టికెట్ల కోసం జియోబస్‌ (స్టార్టప్‌ డైరీ)

Saturday 29th June 2019

బస్, విమాన టికెట్లతో పాటు హోటల్స్, క్యాబ్స్‌  నెలకు 8 వేల టికెట్లు; రూ.5 లక్షల ఆదాయం  ఏడాదిలో యుటిలిటీ బిల్స్, నగదు బదిలీ సేవల్లోకి ‘స్టార్టప్‌ డైరీ’తో ఫౌండర్‌ మురళీ కృష్ణ హైదరాబాద్, బిజినెస్‌బ్యూరో: బస్, రైలు, విమాన టికెట్ల బుకింగ్‌ సేవల్లోకి మరో తెలుగు కంపెనీ ఎంట్రీ ఇచ్చింది. హైదరాబాద్‌కు చెందిన ‘జియోబస్‌.ఇన్‌’ ప్రయాణ టికెట్లతో పాటు హోటల్స్, క్యాబ్స్‌ బుకింగ్స్, హాలిడే ప్యాకేజెస్, రీచార్జ్‌ వంటి ఇతర సేవలను కూడా అందిస్తుంది.

చిన్న పొదుపు పథకాలపై తగ్గిన వడ్డీ

Saturday 29th June 2019

10 బేసిస్‌ పాయింట్లు కుదింపు ఆర్‌బీఐ సరళతర విధానమే కారణం న్యూఢిల్లీ: చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్లను ప్రభుత్వం 10 బేసిస్‌ పాయింట్లు (0.1 శాతం) తగ్గించింది. జూలై- సెప్టెంబర్‌ మధ్య కాలానికి సవరించిన తాజా రేట్లు వర్తిస్తాయని ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. 2019- 20 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికానికి తాజా రేట్లను నోటిఫై చేసింది. ద్రవ్య, పరపతి విధాన ప్రాతిపదికన ప్రతి మూడు నెలలకు ఒకసారి చిన్న పథకాలపై

Most from this category