News


బ్యాంకుల వడ్డీ రేట్ల తగ్గింపు

Wednesday 1st January 2020
news_main1577849145.png-30573

  • ఈబీఆర్‌ ఆధారిత రేటును పావు శాతం తగ్గించిన ఎస్‌బీఐ
  • ఎంసీఎల్‌ఆర్ను సవరిస్తున్న ఇండియన్ బ్యాంక్‌

ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ).. రుణాలకు సంబంధించి ఎక్స్‌టర్నల్ బెంచ్‌ మార్క్ ఆధారిత వడ్డీ రేట్లను (ఈబీఆర్‌) 25 బేసిస్‌ పాయింట్ల (పావు శాతం) మేర తగ్గించింది. ఇది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని ఎస్‌బీఐ తెలిపింది.  కొత్త కస్టమర్లకు గృహ రుణాలపై వడ్డీ రేటు 7.90 శాతం నుంచి ఉంటుంది. ఇప్పటిదాకా ఇది 8.15 శాతంగా ఉంది. మరోవైపు, మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ (ఎంసీఎల్‌ఆర్) విధానం ఆధారిత రుణాలపై వడ్డీ రేట్లను జనవరి 3 నుంచి సవరిస్తున్నట్లు ఇండియన్ బ్యాంక్ వెల్లడించింది. వివిధ కాలావధులకు సంబంధించి వడ్డీ రేటు 0.05 శాతం మేర తగ్గనుంది. 



You may be interested

కార్వీ వ్యాపార పునర్‌వ్యవస్థీకరణ

Wednesday 1st January 2020

ఆర్థిక, ఆర్థికేతర సర్వీసుల విభాగాల కింద విభజన ఆర్థిక సేవల విభాగానికి గ్రూప్ సీఈవోగా అమితాబ్ చతుర్వేది హైదదరాబాద్‌, బిజినెస్ బ్యూరో: క్లయింట్ల షేర్లను సొంతానికి వాడుకుందన్న ఆరోపణలపై కఠిన చర్యలు ఎదుర్కొంటున్న కార్వీ గ్రూప్ .. తాజాగా వ్యాపార పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియ చేపట్టింది. ఆర్థిక సర్వీసులు, ఆర్థికేతర సర్వీసుల కింద రెండు విభాగాలుగా వ్యాపారాన్ని విభజించే ప్రక్రియ ప్రారంభించినట్లు సంస్థ వెల్లడించింది. తద్వారా గవర్నెన్స్‌ను, వ్యాపార నిర్వహణను మెరుగుపర్చుకోనున్నట్లు తెలిపింది. పునర్‌వ్యవస్థీకరణ

రూ.102 లక్షల కోట్ల మౌలిక ప్రాజెక్టుల గుర్తింపు

Wednesday 1st January 2020

(అప్‌డేటెడ్‌...) ఐదేళ్లలో అమలు 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ న్యూఢిల్లీ: మౌలిక రంగంలో వచ్చే ఐదేళ్లలో రూ.102 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ప్రాజెక్టులను ‘నేషనల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పైప్‌లైన్‌’లో భాగంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఇందులో ముంబై-అహ్మదాబాద్‌ హైస్పీడ్‌ రైలు ప్రాజెక్టు కూడా ఉండడం గమనార్హం. ప్రధాని మోదీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంలో రానున్న ఐదేళ్లలో మౌలిక రంగంలో రూ.100 లక్షల కోట్లను ఇన్వెస్ట్‌

Most from this category