News


రూ.8,800 కోట్లు సమీకరించిన ఎస్‌బీఐ

Friday 18th January 2019
news_main1547791317.png-23661

న్యూఢిల్లీ: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) విదేశీ మార్కెట్ల నుంచి భారీగా నిధులు సమీకరించింది. విదేశీ మార్కెట్లో బాం‍డ్ల జారీ ద్వారా రూ.8,800 కోట్లు (125 కోట్ల డాలర్లు) సమీకరించామని ఎస్‌బీఐ తెలిపింది. వ్యాపార విస్తరణ కోసం ఈ నిధులు వినియోగిస్తామని పేర్కొంది. 85 కోట్ల డాలర్ల విలువైన ఐదేళ్ల కాలపరిమితి గల ఫిక్స్‌డ్‌ రేట్‌ అన్‌సెక్యూర్డ్‌ బాండ్లను రెండు దఫాలుగా జారీ చేశామని, వీటి కూపన్‌ రేట్‌ 4.37 శాతమని తెలిపింది. అలాగే 40 కోట్ల డాలర్ల విలువైన మూడేళ్ల కాలపరిమితి గల బాండ్ల జారీ చేశామని, వీటి కూపన్‌ రేటు​4 శాతమని వివరించింది. ఈ రెండు రకాల కాలపరిమితి గల బాండ్లకు వడ్డీని ఆరు నెలలకొకసారి చెల్లిస్తామని పేర్కొంది. ఈ బాండ్లను సింగపూర్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌, ఇండియా ఇంటర్నేషనల్‌ ఎక్స్చేంజ్‌ల్లో లిస్టింగ్‌ చేస్తామని ఎస్‌బీఐ తెలిపింది.



You may be interested

సైయంట్‌ లాభం రూ.92 కోట్లు

Friday 18th January 2019

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఇంజనీరింగ్‌ టెక్నాలజీ కంపెనీ సైయంట్‌ డిసెంబరు త్రైమాసికానికి కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.92 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 5 శాతం అధికం. ఆదాయం 20.8 శాతం పెరిగి రూ.1,187 కోట్లకు చేరింది. కంపెనీ చేతిలో నగదు నిల్వలు రూ.1,230 కోట్లు ఉన్నట్టు ప్రకటించింది.

ఫ్లిప్‌కార్ట్ ఇండియాలోకి రూ.1,431 కోట్లు

Friday 18th January 2019

న్యూఢిల్లీ: ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఇండియా తాజాగా రూ. 1,431 కోట్లు సమీకరించింది. సింగపూర్‌కి చెందిన మాతృ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ నుంచి ఈ నిధులు సమీకరించినట్లు సంస్థ తెలియజేసింది. ఈ నిధులకు ప్రతిగా మాతృ సంస్థకు 4.86 లక్షల షేర్లు కేటాయించామని, ఒక్కో షేరు ధరను రూ. 29,400గా నిర్ణయించామని కంపెనీ వెల్లడించింది. గతేడాది డిసెంబర్‌లో కూడా ఫ్లిప్‌కార్ట్ ఇండియాలో ఫ్లిప్‌కార్ట్ రూ.2,190 కోట్లు పెట్టుబడి పెట్టింది. విదేశీ పెట్టుబడులున్న

Most from this category