News


ఎస్‌బీఐ లాభం రూ.6,797 కోట్లు

Saturday 1st February 2020
news_main1580526848.png-31383

(అప్‌డేటెడ్‌...)

  • 41 శాతం వృద్ధి 
  • ఆదాయం రూ.95,384 కోట్లకు 
  • ఈ క్యూ3లోనే అత్యధిక స్టాండ్‌అలోన్‌ నికర లాభం 

న్యూఢిల్లీ: దేశీయ దిగ్గజ బ్యాంక్‌....స్టేట్‌  బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసిక కాలంలో రూ.6,797 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్‌)సాధించింది. గత ఆర్థిక సంవత్సరం(2018-19) ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన నికర లాభం, రూ.4,823 కోట్లుతో పోల్చితే 41 శాతం వృద్ధి సాధించింది. కేటాయింపులు తక్కువగా ఉండటంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగింది. ఎస్సార్‌ స్టీల్‌ బకాయిలు రికవరీ కావడం, ఇతర, నిర్వహణ, నికర వడ్డీ  ఆదాయాలు పెరగడం కూడా కలసివచ్చింది. మొత్తం ఆదాయం రూ.84,390 కోట్ల నుంచి రూ.95,384 కోట్లకు పెరిగింది. మరిన్ని వివరాలు...


రికార్డ్‌ స్థాయి లాభం...
స్టాండ్‌అలోన్‌ పరంగా చూస్తే, నికర లాభం రూ.3,955 కోట్ల నుంచి 41 శాతం వృద్ధితో రూ.5,583 కోట్లకు పెరిగింది. ఈ బ్యాంక్‌ సాధించిన అత్యధిక త్రైమాసిక లాభం ఇదే. రూ.1,333 కోట్ల పన్ను సంబంధిత వ్యయాలు లేకుంటే నికర లాభం రూ.6,916 కోట్లకు పెరిగి ఉండేది. ఆదాయం రూ.70,312 కోట్ల నుంచి రూ.76,798 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం 22 శాతం ఎగసి రూ.27,779 కోట్లకు పెరిగింది. ఎస్సార్‌ స్టీల్‌ నుంచి రూ.11,000 కోట్లు రికవరీ కావడం కలసివచ్చింది. రుణ వృద్ధి 7.4 శాతంగా ఉంది. డిపాజిట్లు 10 శాతం పెరిగాయి. దేశీయ నికర వడ్డీ మార్జిన్‌ 3.59 శాతానికి మెరుగుపడింది. 

మెరుగుపడిన రుణ నాణ్యత...
ఎస్‌బీఐ రుణ నాణ్యత మెరుగుపడింది. గత క్యూ3లో 8.71 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ3లో 6.94 శాతానికి తగ్గాయి. నికర మొండి బకాయిలు 3.95 శాతం నుంచి 2.65 శాతానికి చేరాయి. మొండి బకాయిలకు కేటాయింపులు తగ్గాయి. గత క్యూ3లో రూ.13,971 కోట్లుగా ఉన్న మొండి బకాయిలకు కేటాయింపులు ఈ క్యూ3లో రూ.8,193 కోట్లకు తగ్గాయి. స్థూల మొండి బకాయిలు రూ.1.59 లక్షల కోట్లకు, నికర మొండి బకాయిలు రూ.58,249 కోట్లకు తగ్గాయి. తాజా మొండి బకాయిలు మాత్రం రూ.8,805 కోట్ల నుంచి రూ.16,525 కోట్లకు పెరిగాయి. దీంట్లో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు సంబంధించిన రుణాలు రూ.7,000 కోట్ల మేర ఉన్నాయి. ​‍ప్రొవిజన్‌ కవరేజ్‌ రేషియో 81.73 శాతానికి చేరింది. 


 మొండి బకాయిలు తగ్గుతాయ్‌...
ఈ క్వార్టర్‌లో నిర్వహణ పరంగా పటిష్టమైన పనితీరు సాధించాం. లాభదాయతక, రుణ నాణ్యత, ప్రొవిజన్‌ కవరేజ్‌ రేషియో, క్యాపిటల్‌ అడెక్వసీ  అంశాల్లో చాలా మెరుగుపడ్డాం. ఈ క్యూ4లో కార్పొరేట్‌ రుణాలకు సంబంధించి రూ.1,200 కోట్లకు మించి తాజా మొండి బకాయిలు ఉండకపోవచ్చు. మొత్తం మీద మొత్తం తాజా మొండి బకాయిలు రూ.5,000-6,000 కోట్ల రేంజ్‌లోనే ఉంటాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రుణ వృద్ధి 8-10 శాతం రేంజ్‌లో ఉంటుందని అంచనా. 

  • - రజనీశ్‌ కుమార్‌, చైర్మన్‌, ఎస్‌బీఐ

 



You may be interested

అదుపుతప్పిన 2019-20 ద్రవ్యలోటు

Saturday 1st February 2020

బడ్జెట్‌ అంచనాల్లో 132 శాతానికి అప్‌ న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు- వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు అదుపు తప్పింది. 2019-20 బడ్జెట్‌ అంచనాల్లో 132.4 శాతంగా నమోదయ్యింది. శుక్రవారం ఈ గణాంకాలు వెల్లడయ్యాయి. వివరాల్లోకి వెళితే... 2020 మార్చి నాటికి ద్రవ్యలోటు రూ. 7,03,760 కోట్లు ఉండాలన్నది 2019-20 బడ్జెట్‌ లక్ష్యం. ఇది 2019-20 జీడీపీ అంచనాల్లో 3.3 శాతం. అయితే 2019 డిసెంబర్‌ ముగిసే నాటికే రూ.9,31,725 కోట్లుగా

‘‘అరవింద్‌’’ సమేత..

Saturday 1st February 2020

(అప్‌డేటెడ్‌...) తెలుగు వ్యక్తికి ఐబీఎం పగ్గాలు సీఈవోగా అరవింద్ కృష్ణ నియామకం బోర్డులోనూ చోటు; ఏప్రిల్‌ 6 నుంచి అమల్లోకి న్యూయార్క్‌: మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల తరవాత... మరో అమెరికన్‌ ఐటీ దిగ్గజానికి సారథ్యం వహించే అవకాశం ఇంకో తెలుగు వ్యక్తికి దక్కింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అరవింద్‌ కృష్ణ (57)... ఐటీ దిగ్గజం ఐబీఎం చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా (సీఈవో) నియమితులయ్యారర్లీ 200 బిలియన్‌ డాలర్ల సంస్థ డైరెక్టర్ల బోర్డులోనూ ఆయనకు చోటు దక్కింది.

Most from this category