News


ఎన్‌ఎస్‌ఈలో 1 శాతం వాటా విక్రయం: ఎస్‌బీఐ

Saturday 4th January 2020
news_main1578112513.png-30667

న్యూఢిల్లీ: నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌(ఎన్‌ఎస్‌ఈ)లో 1.01 శాతం వాటాను ఎస్‌బీఐ (స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా)విక్రయించనున్నది. మూలధన నిధుల సమీకరణలో భాగంగా 1.01 శాతం వాటాకు సమానమైన 50 లక్షల షేర్లను విక్రయించనున్నామని ఎస్‌బీఐ వెల్లడించింది. కాంపిటేటివ్‌ బిడ్డింగ్‌ ప్రక్రియ ద్వారా ఈ షేర్లను విక్రయిస్తామని తెలిపింది. నిర్దేశిత ఫార్మాట్‌లో కనీసం పది లక్షల షేర్లకు బిడ్‌ చేయాల్సి ఉంటుందని, ఆసక్తి గల సంస్థలు ఈ నెల 15 వ తేదీలోగా దరఖాస్తు  చేయాలని పేర్కొంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఎస్‌బీఐకు 5.19 శాతం వాటా ఉంది. 2016లో ఎన్‌ఎస్‌ఈలో 5 శాతం వాటాను మారిషస్‌కు చెందిన వెరాసిటి ఇన్వెస్ట్‌మెంట్స్‌కు రూ.911 కోట్లకు ఎస్‌బీఐ విక్రయించింది. 
ఎన్‌ఎస్‌ఈలో వాటా విక్రయంతో పాటు మరో రెండు కంపెనీల్లో కూడా వాటా విక్రయం ద్వారా నిధులు సమీకరించాలని ఎస్‌బీఐ యోచిస్తోంది. యూటీఐ మ్యూచువల్‌ ఫండ్‌, ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్స్‌ సర్వీసెస్‌ల ఐపీఓల్లో కొంత వాటాను ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) ద్వారా విక్రయించనున్నది. 



You may be interested

ఈ నెల 29న ఇండిగో ఈజీఎమ్‌

Saturday 4th January 2020

న్యూఢిల్లీ: విమానయాన సంస్థ, ఇండిగోను నిర్వహిస్తున్న ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ కంపెనీ  ఈజీఎమ్‌(అసాధారణ సమావేశం) ఈ నెల 29న జరగనున్నది. ప్రమోటర్లలో ఒకరైన రాకేశ్‌ గంగ్వాల్‌ అభ్యర్థన మేరకు ఈ ఏజీఎమ్‌ జరుగుతోంది. కంపెనీ షేర్ల బదిలీ, టేకోవర్‌, సంబంధించి ‘రైట్‌ ఆఫ్‌ ఫస్ట్‌ రెఫ్యూజల్‌’, ‘ట్యాగ్‌ ఎలాంగ్‌ రైట్‌’ తదితర  అంశాలను తొలగించడానికి  ఆర్టికల్స్‌ ఆఫ్‌ అసోసియేషన్‌(ఏఓఏ)లో సవరణ కోసం ఈ ఈజీఎమ్‌ను ఉద్దేశించారు.  ఇండిగో కంపెనీలో నిర్వహణ పరంగా అవకతవకలు

సరికొత్త రికార్డులకు విదేశీ మారక నిల్వలు

Saturday 4th January 2020

ముంబై: భారత్‌ విదేశీ మారకపు నిల్వల రికార్డుల జోరు కొనసాగుతోంది. డిసెంబర్‌ 27వ తేదీతో ముగిసిన వారంలో నిల్వలు 2.52 బిలియన్‌ డాలర్లు పెరిగి 457.46 బిలియన్‌ డాలర్లకు ఎగశాయి. ఆర్‌బీఐ శుక్రవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. ముఖ్యాంశాలు చూస్తే... డాలర్ల రూపంలో పేర్కొనే విదేశీ కరెన్సీ అసెట్స్‌ విలువ 2.20 బిలియన్‌ డాలర్లు ఎగసి 424.936 బిలియన్లకు చేరింది.  పసిడి నిల్వల విలువ  27.392 బిలియన్‌ డాలర్లకు చేరాయి.  అంతర్జాతీయ ద్రవ్యనిధి

Most from this category