News


ఎస్‌బీఐ ఫలితాలు ఎలా ఉండొచ్చు?

Friday 25th October 2019
news_main1571980404.png-29134

లాభంలో భారీ పెరుగుదల ఉంటుందని అంచనాలు
దేశీయ అతిపెద్ద బ్యాంకు ఎస్‌బీఐ శుక్రవారం సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాలు ప్రకటించనుంది. ఈ దఫా బ్యాంకు నికరలాభం భారీగా పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎస్‌బీఐలైఫ్‌లో వాటాల విక్రయంతో బ్యాంకుకు వన్‌టైమ్‌ మొత్తం సమకూరడంతో లాభంలో బాగా వృద్ధి ఉండొచ్చని భావిస్తున్నారు. ఫలితాల నేపథ్యంలో ఎస్‌బీఐ షేరు శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌లో దాదాపు 2.7 శాతం లాభంతో రూ. 268.80 వద్ద ట్రేడవుతోంది. 
- ఎస్‌బీఐ లైఫ్‌లో వాటా విక్రయంతో దాదాపు రూ. 3,000- 3,500 కోట్ల మేర విశేషాదాయం రావచ్చని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ అంచనా వేసింది.  వడ్డీ ఆదాయం 10.20 శాతం పెరిగి రూ. 23033 కోట్లకు చేరవచ్చని, లోన్‌గ్రోత్‌ 11 శాతం వృద్ధిని, డిపాజిట్‌ గ్రోత్‌ 7.4 శాతం వృద్ధిని సాధిస్తాయని బ్రోకింగ్‌ సంస్థ భావిస్తోంది. స్లిపేజ్‌లు రూ.10-12వేల కోట్ల రేంజ్‌లో ఉండొచ్చని, అయితే భూషణ్‌ పవర్‌ వివాదం పరిష్కారం కావడంతో స్థూల ఎన్‌పీఏల్లో అనూహ్య తరుగుదల ఉండొచ్చని తెలిపింది. 
- ఎస్‌బీఐ లైఫ్‌ విక్రయంతో బ్యాంకుకు రూ.3వేల కోట్లు మేర అదనపు ఆదాయం రావచ్చని ప్రభుదాస్‌ లీలాధర్‌ అంచనా వేసింది. బ్యాంకు నికరలాభంలో 178 శాతం పెరుగుదల ఉండొచ్చని, ప్రొవిజన్స్‌ 3.10 శాతం మేర తగ్గవచ్చని పేర్కొంది. నికరవడ్డీ ఆదాయంలో 12 శాతం ఉండొచ్చని తెలిపింది. స్లిపేజ్‌ల్లో తరుగుదల ఉంటుందని అంచనా వేసింది.



You may be interested

1500 డాలర్ల పైకి పసిడి

Friday 25th October 2019

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర తిరిగి 1500డాలర్లను అందుకుంది. నేడు ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర అరడాలరు స్వల్ప లాభంతో 1,505 డాలరు వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఈ ధర పసిడికి రెండు వారాల గరిష్ట స్థాయి కావడం విశేషం. అమెరికా విడుదల చేసిన బలహీన ఆర్థిక గణాంకాలు పసిడి బలపడేందుకు తోడ్పడింది. నిన్నరాత్రి అమెరికా సెప్టెంబర్‌ మాసపు డ్యూరబుల్‌ గూడ్స్‌ ఆర్డర్ల గణాంకాలను విడుదల చేసింది. గణాంకాలు

ఐసీఐసీఐ బ్యాంక్‌ ఫలితాల ప్రీవ్యూ..ఆల్‌టైం గరిష్ఠానికి షేరు!

Friday 25th October 2019

  ఐసీఐసీఐ బ్యాంక్‌ సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాలు ఇతర పోటి బ్యాంకుల కంటే బాగుంటాయని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఈ బ్యాంక్‌ రుణ వృద్ధి రెండింతలవుతుందని, ఆస్తి నాణ్యత ఆందోళనలు తగ్గనున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ తైమాసిక ఫలితాలలో ఐసీఐసీఐ బ్యాంక్‌ రుణ వృద్ధి ఏడాది ప్రాతిపదికన 14.2 శాతం పెరిగి రూ. 6.2 లక్షల కోట్లకు చేరుకుంటుం‍దని అంచనావేస్తున్నాం. ఫలితంగా బ్యాంక్‌ ఎన్‌ఐఎం(నికర వడ్డీ మార్జిన్‌)

Most from this category