News


ట్రిపుల్‌ ఐటీలో ఎస్‌బీఐ ఇంక్యుబేటర్‌

Tuesday 2nd July 2019
news_main1562052142.png-26733

  •  ‘ఫెనాన్స్‌ ఎట్‌ ది డోర్‌స్టెప్‌’కు శ్రీకారం
  • దేశంలోనే మొదటిసారిగా ఏర్పాటు

రాయదుర్గం: ట్రిపుల్‌ ఐటీ– హైదరాబాద్‌ ప్రాంగణంలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశంలోనే మొదటిసారిగా స్టార్టప్‌ ఇన్‌క్యుబేటర్‌ సెంటర్‌ను ‘ఫైనాన్స్‌ ఎట్‌ ది డోర్‌స్టెప్‌’ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎస్‌బీఐ 64వ ఫౌండేషన్‌డే సందర్భంగా సోమవారం ఈ స్టార్టప్‌ లాంజ్‌ను ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ పిజే నారాయణన్, ఎస్‌బీఐ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఓంప్రకాశ్‌మిశ్రా ఆరంభించారు.
ఈ సందర్భంగా మిశ్రా మాట్లాడుతూ... హైదరాబాద్‌ నగరం దేశానికి టెక్నాలజీ క్యాపిటల్‌గా మారిందన్నారు. ‘‘స్టార్టప్‌లకు  టీ–హబ్‌ ద్వారా సాంకేతిక సహకారం లభిస్తోంది. ఆర్థిక సహాకారం అందించేందుకు ఎస్‌బీఐ ముందుకొచ్చింది. ఎస్‌బీఐ ద్వారా రూ.200 కోట్ల ఫండింగ్‌ను ఐటీ సంస్థలకు ముఖ్యంగా ఫిన్‌టెక్‌ సెగ్మెంట్‌లలోని స్టార్టప్‌లకు కేటాయిస్తున్నాం’’ అని చెప్పారాయన. ప్రొఫెసర్‌ పిజేనారాయణన్‌ మాట్లాడుతూ ట్రిపుల్‌ ఐటీలోని స్టార్టప్‌లకు ఫండింగ్‌ కోసం ఎస్‌బీఐ ప్రత్యేక ఏర్పాట్లు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఎస్‌బీఐ తరహాలోనే మరిన్ని ఆర్థిక సంస్థలు స్టార్టప్‌లకు ప్రొత్సహించేందుకు ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ట్రిపుల్‌ఐటీ ఆర్‌ అండ్‌ డీ డీన్‌ ప్రొఫెసర్‌ సివి జవహర్, ప్రొఫెసర్‌ రమేష్‌ లోగనాథన్, ఎస్‌బీఐ జనరల్‌ మేనేజర్లు మియా, రమేష్, పలువురు అధికారులు, ట్రిపుల్‌ఐటీ అధ్యాపకులు, స్టార్టప్‌ల వ్యవస్థాపకులు తదితరులు పాల్గొన్నారు.



You may be interested

జీవీకే ఎయిర్‌పోర్ట్స్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురు

Tuesday 2nd July 2019

వాటా విక్రయానికి బిడ్‌వెస్ట్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఈ వాటా కొనుగోలు రేసులో అదానీ హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ముంబై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో వాటాను 74 శాతానికి పెంచుకోవాలనుకున్న జీవీకే ఎయిర్‌పోర్ట్స్‌ హోల్డింగ్స్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. కోర్టు తీర్పుతో దక్షిణాఫ్రికాకు చెందిన బిడ్‌వెస్ట్‌ గ్రూప్‌నకు ఊరట లభించింది. ముంబై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో (ఎంఐఏఎల్‌) ఈ గ్రూప్‌ కంపెనీ అయిన బిడ్‌ సర్వీసెస్‌ డివిజన్‌కు (మారిషస్‌) ఉన్న 13.5 శాతం వాటాను థర్డ్‌ పార్టీకి విక్రయించుకోవచ్చని

లిబర్టీ స్టీల్‌ చేతిక ఆర్సెలర్‌ మిట్టల్‌ స్టీల్‌ ప్లాంట్లు

Tuesday 2nd July 2019

మరో ఐదు సర్వీస్‌ సెంటర్లు కూడా లిబర్టీ పరం  డీల్‌ విలువ రూ.5,782 కోట్లు  న్యూఢిల్లీ: ఆర్సెలర్‌ మిట్టల్‌ కంపెనీకి చెందిన ఏడు స్టీల్‌ ప్లాంట్లను లిబర్టీ స్టీల్‌ కంపెనీ కొనుగోలు చేసింది. ఈ ప్లాంట్లతో పాటు ఆర్సెలర్‌ మిట్టల్‌ కంపెనీకే చెందిన ఇటలీ, ఫ్రాన్స్‌ల్లోని ఐదు సర్వీస్‌ సెంటర్లను కూడా కొనుగోలు చేశామని లిబర్టీ స్టీల్‌ వెల్లడించింది. ఈ మొత్తం డీల్‌ విలువ రూ.5,782 కోట్ల(74 కోట్ల యూరోలు)ని భారత సంతతి

Most from this category