News


ఎంసీఎల్‌ఆర్‌ తగ్గించిన ఎస్‌బీఐ

Wednesday 11th March 2020
news_main1583907959.png-32406

దేశీయ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంసీఎల్‌‌ఆర్‌‌ (మార్జినల్‌‌ కాస్ట్‌‌ బేస్డ్‌‌ లెండింగ్‌‌ రేట్స్‌‌)ను తగ్గించింది. వివిధ కాల వ్యవధి కలిగిన ఎంసీఎల్‌ఆర్‌పై 15 బేసిస్‌ పాయింట్ల వరకు తగ్గిస్తున్నట్లు బ్యాంక్‌ ప్రకటించింది. ఈ మార్చి 10 నుంచే కొత్త రేట్ల అమల్లోకి వస్తాయి. తగ్గించిన ఎంసీఎల్‌ఆర్‌ ప్రకారం.... ఒక ఏడాది కాలపరిమితి గల ఎంసీఎల్ఆర్ రేటు 7.75 శాతానికి తగ్గింది. అంతకు ముందు ఇది 7.85శాతం ఉంది. అంటే 10బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. రెండేళ్ల ఎంసీఎల్‌ఆర్‌ రేటు గతంలో 8.05శాతం ఉండగా ఇప్పుడు 7.95శాతానికి దిగివచ్చింది. అలాగే మూడేళ్ల ఎంసీఎల్‌ఆర్‌ 8.15శాతం నుంచి 8.05శాతానికి చేరుకుంది. ఓవర్‌ నైట్‌, నెల ఎంసీఎఆర్‌ రేట్ల 7.60 శాతం నుంచి 7.45శాతానికి, మూడునెలల ఎంసీఎల్‌ రేటు 8.15శాతం నుంచి 8.05శాతానికి చేరుకుంది. స్టేట్ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ రేటును తగ్గించడం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది వరుసగా 10వ సారి కావడం విశేషం. ఎంసీఎల్ఆర్ తగ్గింపు వల్ల హోమ్ లోన్స్‌పై వడ్డీ రేట్లు కూడా దిగివస్తాయి. దీంతో కస్టమర్లకు ప్రయోజనం కలుగుతుంది. ఆర్‌బీఐ నిర్ణయించిన రెపోరేటు ప్రకారం ప్రతి మూడు నెలకొకసారి బ్యాంక్‌లు ఎంసీఎల్‌ఆర్‌ను సవరిస్తుంటాయి. 

 

 

 మరోవైపు ఎస్‌బీ  సాధారణ కస్టమర్లతో పాటు సీనియర్ సిటిజన్లకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ రేట్లను తగ్గించింది. మార్చి 10 నుండి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయి. సీనియర్ సిటిజన్స్‌కు సాధారణ కస్టమర్లతో పోలిస్త్ ఎఫ్‌డీలపై 50 బేసిస్ పాయింట్ల ఎక్కువ వడ్డీ లభిస్తుంది. ఎస్‌బీ భారతదేశంలో అతిపెద్ద కమర్షియల్‌ బ్యాంకు. గృహ రుణాలు, ఆటో రుణాలలో 25 శాతం మార్కెట్ వాటా కూడా ఉంది. 



You may be interested

భారీగా తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

Wednesday 11th March 2020

వరుసగా మూడో రోజు ధరల కోత 9 నెలల కనిష్టానికి పెట్రోల్‌ లీటర్‌  2019 జనవరి స్థాయికి డీజిల్‌ రేటు అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు పతనంకావడంతో దేశీయంగా పెట్రో ఉత్పత్తుల రేట్లు దిగివస్తున్నాయి. గత రెండు రోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ రేట్లను తగ్గుతూ వస్తున్న ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు తాజాగా మరోసారి ధరల్లో కోత పెట్టాయి. ఢిల్లీ మార్కెట్లో పెట్రోల్‌ లీటర్‌ రూ. 2.69 శాతం తగ్గింది. దీంతో 70.29కు చేరింది. ఇక

ఏడాది కనిష్టానికి 379 షేర్లు

Wednesday 11th March 2020

బుధవారం ఎన్‌ఎస్‌ఈలో 52 వారాల కనిష్టానికి 379 షేర్లు పతనమయ్యాయి. వాటిలో అబాన్‌ ఆఫ్‌షోర్‌, ఏబీబీ ఇండియా, ఏసీసీ, అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌, ఆధునిక్‌ ఇండస్త్రీస్‌, అడోర్‌ వెల్డింగ్‌, ఆగ్రో ఫోస్‌ ఇండియా, అజ్మెరా రియాల్టీ అండ్‌ ఇన్‌ఫ్రా ఇండియా, ఆక్స్‌ ఆఫ్టీఫైబర్‌, అలోక్‌ ఇండస్ట్రీస్‌, అంకిత్‌ మెటల్‌ అండ్‌ పవర్‌, అన్సాల్‌ హౌసింగ్‌, అంటార్కిటికా, అపార్‌ ఇండస్ట్రీస్‌, అపోలో టైర్స్‌, ఆప్‌టెక్‌, ఆర్కీస్‌, ఆర్కోటెక్‌,

Most from this category