News


తగ్గిన ఎస్‌బీఐ రుణ రేటు

Tuesday 10th December 2019
news_main1575949134.png-30138

ముంబై: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)... ఏడాది కాల వ్యవధి ఉండే రుణాలపై వడ్డీ రేటును స్వల్పంగా తగ్గించింది. నిధుల సమీకరణ వ్యయ ఆధారిత (ఎంసీఎల్‌ఆర్‌) రుణ రేటు 10 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) తగ్గించినట్లు ఎస్‌బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. మంగళవారం నుంచీ తాజా రేటు అమల్లోకి వస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బ్యాంక్‌ ఎంసీఎల్‌ఆర్‌ తగ్గడం ఇది వరుసగా ఎనిమిదవసారి. తాజా తగ్గింపుతో ఏడాది కాల ఎంసీఎల్‌ఆర్‌ 8 శాతం నుంచి 7.90 శాతానికి దిగివచ్చింది. తన గత వారం పాలసీ సమీక్షలో ఆర్‌బీఐ ఎటువంటి రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం 5.15 శాతం) తగ్గింపు నిర్ణయం తీసుకోని నేపథ్యంలో ఎస్‌బీఐ తాజా రుణరేటు కోత ప్రాధాన్యత సంతరించుకుంది. 



You may be interested

జనవరి నుంచి హీరో బైక్స్‌ ధరల పెంపు

Tuesday 10th December 2019

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌ జనవరి నుంచి మోటార్‌ సైకిల్స్, స్కూటర్ల ధరలను రూ.2 వేల వరకు పెంచనుంది. ప్రస్తుతం హీరో కార్ప్‌ వాహనాల ధరల శ్రేణి రూ.39 వేల నుంచి రూ.1.05 లక్షల మధ్య ఉన్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఇప్పటికే మారుతీ సుజుకీ ఇండియా, టొయోటా, మహీంద్రా అండ్‌ మహీంద్రా, మెర్సిడెస్‌ బెంజ్‌ కార్ల కంపెనీలు ధరలు పెంచుతున్నట్లు

రియల్టీ కుబేరులు!

Tuesday 10th December 2019

రూ.31,960 కోట్ల సంపదతో అగ్ర స్థానంలో లోధా టాప్‌ -100 మందిలో 8 మంది మహిళలు యువ కుబేరులిద్దరూ హైదరాబాద్‌ నుంచే రూ.740 కోట్లతో మై హోమ్‌ రాము, శ్యామ్‌ రావులకు చోటు ‘హురున్‌- గ్రోహె’ ఇండియా–2019 నివేదికలో వెల్లడి హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశంలోని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల్లో అత్యంత ధనికుడిగా మాక్రోటెక్‌ డెవలపర్స్‌ (గతంలో లోధా డెవలపర్స్‌) అధినేత మంగళ్‌ ప్రభాత్‌ లోధా నిలిచారు. ఈయన సంపద విలువ రూ.31,960 కోట్లు. దేశంలోని రియల్టీ

Most from this category