News


డిపాజిట్లపై ఎస్‌బీఐ వడ్డీరేట్ల తగ్గింపు

Saturday 24th August 2019
news_main1566621993.png-27982

వివిధ కాలపరిమితులపై అరశాతం వరకూ కోత
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం- స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) స్థిర డిపాజిట్లపై వడ్డీరేటును 50 బేసిస్‌ పాయింట్ల వరకూ (100 బేసిస్‌ పాయింట్లు ఒకశాతం) తగ్గించింది. దీనితో డిపాజిట్‌దారులకు తక్కువ రిటర్న్‌ ‍్స మాత్రమే చేతికి అందుతాయన్నమాట. ఆగస్టు 26వ తేదీ నుంచీ తాజా రేట్లు అమల్లోకి వస్తాయని బ్యాంక్‌ ప్రకటన తెలిపింది.

ముఖ్యాంశాలు చూస్తే...
- వివిధ కాలపరిమితుల డిపాజిట్లపై రేట్లు 10 నుంచి 50 బేసిస్‌ పాయింట్లు తగ్గాయి. బల్క్‌ డిపాజిట్ల విషయంలో రేట్లు 30 నుంచి 70 బేసిస్‌ పాయింట్లు తగ్గాయి. 
- 7 నుంచి 47 రోజుల మెచ్యూరిటీలపై ప్రస్తుత రేటు 5 శాతం ఉంటే, ఈ రేటు 4.5 శాతానికి దిగివచ్చింది. 
- 46 నుంచి 179 రోజుల మధ్య రేటు పావుశాతం తగ్గి, 5.5 శాతానికి చేరింది. 
- 180 రోజుల నుంచి ఏడాది మధ్య డిపాజిట్ రేటు కూడా 0.25 బేసిస్‌ పాయింట్లు (పావుశాతం) తగ్గి 6 శాతానికి చేరింది.
- ఏడాది నుంచి రెండేళ్ల మధ్య డిపాజిట్‌ రేటు 0.10 శాతం తగ్గి 6.70 శాతానికి దిగివచ్చింది. 
- ఐదు నుంచి పదేళ్ల మధ్య రేటు 25 బేసిస్‌ పాయింట్లు తగ్గి, 6.25కి చేరింది. 
- రూ.లక్ష పైబడి బ్యాలెన్స్‌ ఉన్న కస్టమర్ల విషయంలో (సేవింగ్స్‌ బ్యాంక్‌ డిపాజిట్‌) 3 శాతం వడ్డీరేటు కొనసాగుతుంది. 
- లక్ష వరకూ సేవింగ్స్‌ బ్యాంక్‌ డిపాజిట్‌పై రేటు 3.50గా ఉంటుంది.

 
లక్ష పైబడితే 2.65 శాతం వడ్డీయేనా?
నిజానికి ఈ ఏడాది మే 1వ తేదీ నుంచే లక్ష పైబడిన బ్యాలన్స్‌కు సంబంధించి సేవింగ్స్‌ బ్యాంక్‌ డిపాజిట్లను ఎస్‌బీఐ రెపో రేటుకు అనుసంధానించింది. ఈ రేటు రెపో రేటు కన్నా 275 బేసిస్‌ పాయింట్లు (2.75 శాతం) తక్కువగా ఉంటుంది దీనిప్రకారం చూస్తే,  ఈ నెల మొదట్లో (ఆగస్టు 7న) రెపో రేటు 35 బేసిస్‌ పాయింట్లు తగ్గి,  5.4 శాతానికి దిగివచ్చింది. దీనిలో 2.75 శాతం తీసివేస్తే, మిగిలేది 2.65 శాతం. అయితే సేవింగ్స్‌ బ్యాంక్‌ డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణ ఉద్దేశంగా ఈ రేటును 3 శాతంగానే కొనసాగించాలని ఎస్‌బీఐ ప్రస్తుతానికి నిర్ణయించింది. రెపోకు అనుసంధానం ఖరారయితే, ఈ రేటు ఎప్పుడైనా... 2.65 శాతానికి (లక్ష పైబడిన సేవింగ్స్‌ బ్యాంక్‌ డిపాజిట్లు) పరిమితయ్యే వీలుంది. 

నేపథ్యం ఇదీ...
ద్రవ్యోల్బణం కట్టడిలో ఉన్న నేపథ్యంలో దేశంలో ఆర్థికవృద్ధి లక్ష్యంగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గడచిన నాలుగు ద్వైమాసికాల్లో  బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను 1.1 శాతం తగ్గించింది. దీనితో ఈ రేటు ప్రస్తుతం 5.4 శాతానికి చేరింది. తమ నిధుల సమీకరణ వ్యయం తగ్గడంతో బ్యాంకులు కూడా రుణ రేట్లను తగ్గిస్తున్నాయి. ఇది బ్యాంకింగ్‌ డిపాజిట్‌ రేట్ల కోతకూ దారితీస్తోంది. ఎస్‌బీఐ తాజా బాటలో ఇతర బ్యాంకులూ పయనించే అవకాశాలు ఉన్నాయి. 



You may be interested

అమెరికా ఉత్పత్తులపై చైనా టారిఫ్‌ల మోత

Saturday 24th August 2019

75 బిలియన్‌ డాలర్ల ఉత్పత్తులపై మరో 10 శాతం బీజింగ్‌: అమెరికాకు దీటుగా చైనా స్పందించింది. అమెరికాకు చెందిన 75 బిలియన్‌ డాలర్ల ఉత్పత్తులపై అదనంగా 10 శాతం టారిఫ్‌లను అమలు చేయనున్నట్టు చైనా శుక్రవారం ప్రకటించింది. చైనాకు చెందిన మరో 300 బిలియన్‌ డాలర్ల ఉత్పత్తులపై టారిఫ్‌లను 10 శాతం మేర అదనంగా పెంచనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన హెచ్చరికకు ప్రతీకారంగా చైనా ఈ నిర్ణయాన్ని వెలువరించింది.

ఎఫ్‌పీఐ, డీఐఐలపై అదనపు సర్‌చార్జీ రద్దు!

Saturday 24th August 2019

ఎఫ్‌పీఐ(విదేశి పోర్టుపోలియో ఇన్వెస్టర్లు)లపై విధించిన అదనపు సర్‌చార్జీలను ఉపసంహరించుకోడంతోపాటు, ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోడానికి ఆటో సెక్టార్‌, మౌలిక రంగ అభివృద్ధి కోసం తీసుకునే చర్యలను శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఎఫ్‌పీఐలకు సర్‌చార్జీ మినహాయింపు ఇవ్వడంతో పాటు, లాంగ్‌, షార్ట్‌ టెర్మ్‌ క్యాపిటల్‌ లాభాలపై విధించే పన్నులను, దేశియ సంస్థాగత ఇన్వెస్టర్ల(డీఐఐ)లపై విధించిన అదనపు సర్‌చార్జీలను కూడా ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.  ‘క్యాపిటల్‌ మార్కెట్లో

Most from this category