News


ఇంటి రుణాలపై ఎస్‌బీఐ వడ్డీరేట్ల తగ్గింపు

Saturday 9th February 2019
news_main1549711136.png-24111

ఆర్‌బీఐ రేట్‌ కట్‌ ప్రకటించిన అనంతరం స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఈ తగ్గింపును కస్టమర్లకు చేరవేసే దిశగా నిర్ణయం తీసుకుంది. 30 లక్షల రూపాయల వరకు తీసుకున్న గృహరుణాలపై వడ్డీరేటును ఐదు బీపీఎస్‌ మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ‘ప్రస్తుత హోమ్‌లోన్‌ మార్కెట్‌లో ఎస్‌బీఐ అగ్రస్థానంలో ఉంది. కస్టమర్లకు, ముఖ్యంగా మధ్యతరగతికి ప్రయోజనం కలిగేందుకు ఆర్‌బీఐ తీసుకున్న చర్యల ఫలితాలు  కస్టమర్లకు చేరవేసేందుకు యత్నిస్తున్నాం.’అని ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ చెప్పారు. ప్రస్తుతం తమ డిపాజిట్‌ రేట్లు ఇతర బ్యాంకుల కన్నా తక్కువగా ఉన్నాయన్నారు. వీటిని ఇంకా తగ్గిస్తేనే రుణ రేట్లను కిందకు తీసుకువచ్చేందుకు అవకాశం ఉంటుందన్నారు. శుక్రవారం నుంచి గృహరుణాలపై వడ్డీరేట్ల తగ్గింపు వర్తిస్తుందని చెప్పారు. ఇప్పటికే బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర ఎంసీఎల్‌ఆర్‌ను ఐదు బీపీఎస్‌ మేర తగ్గించిన సంగతి తెలిసిందే. బ్యాంకర్లంతా రేట్ల తగ్గింపు ప్రయోజనాలను కస్టమర్లకు చేరవేయాలని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ కోరారు. 



You may be interested

స్వల్పంగా పెరిగిన పసిడి ధర

Saturday 9th February 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర వారంతపు రోజైన శుక్రవారం 4.50డాలర్లు లాభపడింది. రాత్రి అమెరికా మార్కెట్లో ఔన్స్‌ పసిడి ధర 1,318.50 డాలర్ల వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ ఆర్థికవృద్ది మందగమనం ఆందోళనలు మరోసారి తెరపైకి రావడంతో పాటు ప్రపంచమార్కెట్లలో నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలు పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ను పెంచాయి. అమెరికాలో ప్రభుత్వ షట్‌డౌన్‌ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ దేశాధ్యక్షుడు ట్రంప్‌ శుక్రవారం ది రోజ్‌ గార్డెన్‌లో మాట్లాడుతూ.. సరిహద్దుల్లో

నష్టంతో ముగిసిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Saturday 9th February 2019

సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ సూచీ శుక్రవారం రాత్రి 10,927.50 వద్ద స్థిరపడింది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు 10957.25 పాయింట్లతో పోలిస్తే 20పాయింట్ల నష్టంతో ఉంది. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ సూచీ నష్టంతో ముగిసిన నేపథ్యంలో సోమవారం నిఫ్టీ ఇండెక్స్‌ నెగిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇక మనమార్కెట్‌ విషయానికొస్తే ...ప్రపంచమార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలకు తోడు, దేశీయ మార్కెట్లలో లాభాల స్వీకరణ కారణంగా శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌ భారీగా

Most from this category