News


డీహెచ్‌ఎఫ్‌ఎల్ బాకీల సత్వర పరిష్కారంపై ఎస్‌బీఐ ఆశలు

Friday 22nd November 2019
news_main1574392884.png-29771

న్యూఢిల్లీ: దివాలా ప్రక్రియ కింద చర్యలు ఎదుర్కోబోతున్న డీహెచ్ఎఫ్ఎల్ కేసు.. నిర్దిష్ట గడువులోగా పరిష్కారం కాగలదని బ్యాంకులు ఆశిస్తున్నట్లు ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) చైర్మన్ రజనీష్ కుమార్ తెలిపారు. "ఇది ఇప్పుడే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)కు చేరింది. ఎన్‌సీఎల్‌టీ అమలు చేసే ప్రక్రియే దీనికీ వర్తిస్తుంది. సాధారణ౾గా పొడిగింపును కూడా పరిగణనలోకి తీసుకుంటే 330 రోజుల గడువు ఉంటుంది. లేకపోతే 180 రోజుల్లోనే పరిష్కార ప్రక్రియ పూర్తి కావాలి. దివాలా స్మృతి (ఐబీసీ) ప్రక్రియ ప్రధాన ఉద్దేశం కూడా ఇదే. నిర్దిష్ట కాలావధులకు లోబడే డీహెచ్‌ఎఫ్‌ఎల్ కేసు సత్వరం పరిష్కారం కాగలదని ఆశిస్తున్నాం" అని ఆయన వివరించారు. బ్యాంకులు మినహా ఇతరత్రా ఆర్థిక సంస్థల దివాలాకు సంబంధించి ఐబీసీలో సెక్షన్ 227ను చేరుస్తూ కేంద్రం గత శుక్రవారమే నిర్ణయం తీసుకుంది. దాని కింద ఎన్‌సీఎల్‌టీకి చేరిన తొలి కేసు డీహెచ్‌ఎఫ్‌ఎల్‌దే. గృహ రుణాల సంస్థ అయిన డీహెచ్‌ఎఫ్‌ఎల్‌.. 2019 జూలై ఆఖరు నాటికి బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, మ్యూచువల్ ఫండ్స్‌, బాండ్‌హోల్డర్లకు ఏకంగా రూ. 83,873 కోట్లు బాకీ పడింది. 



You may be interested

అక్టోబర్‌లో రూ.2.5 లక్షల కోట్ల రుణాల పంపిణీ

Friday 22nd November 2019

ప్రకటించిన కేంద్ర ఆర్థిక శాఖ న్యూఢిల్లీ: పండుగ సీజన్‌లో భాగంగా అక్టోబర్‌లో ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) రూ.2.5 లక్షల కోట్ల రుణాలను పంపిణీ చేసినట్టు కేంద్ర ఆర్థిక శాఖ గురువారం ప్రకటించింది. నిదానించిన ఆర్థిక వ్యవస్థకు, వినియోగానికి ప్రేరణనిచ్చేందుకు కేంద్ర ‍ప్రభుత్వం సూచనల మేరకు.. పీఎస్‌బీలు దసరా, దీపావళి పండుగల సమయంలో 374 జిల్లాల పరిధిలో రుణ మేళాలను నిర్వహించిన విషయం గమనార్హం. ‘‘ఈ సందర్భంగా పీఎస్‌బీలు రూ.2,52,589 కోట్ల రుణాలను

భారత్‌లో డీబీఎస్‌ బ్యాంక్‌ విస్తరణ

Friday 22nd November 2019

బ్యాంకింగ్‌ సేవల్లో ఉన్న సింగపూర్‌కు చెందిన డీబీఎస్‌ భారత్‌లో విస్తరిస్తోంది. ప్రస్తుతం సంస్థకు శాఖలు, కియోస్క్‌లు 70 దాకా ఉన్నాయి. ఏడాదిలోగా ఈ సంఖ్య 100కు చేరుతుందని డీబీఎస్‌ బ్యాంక్‌ ఇండియా బ్రాంచ్‌ బ్యాంకింగ్‌ హెడ్‌ ప్రియాశిష్‌ దాస్‌ తెలిపారు. వైస్‌ ప్రెసిడెంట్‌, బ్రాంచ్‌ హెడ్‌ కె.శ్రీనివాస రావుతో కలిసి గురువారమిక్కడ మీడియాతో మాట్లాడారు. 25 నగరాల్లో సేవలు అందిస్తున్నట్టు చెప్పారు. ఆరవ ఎక్స్‌పీరియెన్స్‌ సెంటర్‌ను త్వరలో హైదరాబాద్‌లోని వేవ్‌రాక్‌లో

Most from this category