News


ఎస్‌బీఐ కార్డ్స్‌ రూ.2,769 కోట్ల సమీకరణ

Saturday 29th February 2020
news_main1582961704.png-32187

ముంబై:- ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్స్‌ సంస్థ యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ.2,769 కోట్లను సమీకరించినట్లు తెలిపింది. ఐపీఓ ఒకరోజు ముందు యాంకర్‌ ఇన్వెస్టర్లకు మొత్తం 3.66 కోట్ల ఈక్విటీ షేర్లను అప్పర్‌ ప్రైజ్‌ బాండ్‌ రూ.1,480ల వద్ద కేటాయించి ఈ మొత్తాన్ని సమీకరించినట్లు ఎస్‌బీఐ కార్డ్స్‌ సంస్థ వెల్లడించింది. సింగపూర్‌ గవర్నమెంట్‌, మానిటరీ ఆథారిటీ ఆఫ్‌ సింగపూర్‌, హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌, గవర్నమెంట్‌ పెన్షన్‌ ఫండ్‌, బిర్లా గ్రూప్‌లతో లాంటి 12 మ్యూచువల్‌ ఫండ్లతో కలిపి 74 మంది యాంకర్లకు ఇన్వెస్టర్లకు నుంచి  ఈ పెట్టుబడులను సమీకరించినట్లు సంస్డ్సెఎక్స్‌ఛేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. 


సోమవారం నుంచి ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐపీఓ:-
ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐపీఓ వచ్చే సోమవారం(మార్చి 2న) ప్రారంభమై గురవారం(మార్చి 5న) ముగిస్తుంది. ఇష్యూలో భాగంగా ఎస్‌బీఐ కార్డ్స్‌ మొత్తం 130.5 మిలియన్‌ షేర్లను ఆఫర్‌ చేయనుంది. ఇందులో 37.29 మిలియన్ల వరకు ఎస్‌బీఐ, 93.23 మిలియన్ల వరకు షేర్లను కార్లైల్‌ గ్రూప్‌ ఆఫర్‌ చేస్తుంది. వీటికి అదనంగా కంపెనీ రూ.500 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. ఈ ఐపీఓకు ధర శ్రేణిని రూ.750-755గా నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది.  ఈ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.9,000 కోట్లు సమీకరణను లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఐపీఓ కోటక్‌ మహీంద్రా క్యాపిటల్‌, యాక్సిస్‌ క్యాపిటల్‌, డీఎస్‌పీ మెర్లించ్‌, నోమురా ఫైనాన్స్‌ అడ్వైజరీ, హెచ్‌ఎస్‌బీసీ సెక్యూరిటీస్‌, ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ ఈ ఇష్యూకు బుక్‌ రన్నింగ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి. 



You may be interested

మరో రూ.8,004 కోట్లు చెల్లించిన ఎయిర్‌టెల్

Saturday 29th February 2020

న్యూఢిల్లీ:- ఏజీఆర్‌ బకాయిల చెల్లింపుల్లో భాగంగా కేంద్ర టెలికాం శాఖకు రూ.8,004 కోట్లను చెల్లించినట్లు భారతీ ఎయిర్‌టెల్ శనివారం తెలిపింది. ఈ నెల ప్రారంభంలో కంపెనీ తన ఏజీఆర్‌ బకాయిల్లో భాగంగా రూ .10,000 కోట్లు ప్రభుత్వానికి చెల్లించింది. ఇప్పటి తాజా చెల్లింపుతో కలిపి మొత్తం రూ.18,004 కోట్లు చెల్లించినట్లైంది. ఏజీఆర్‌కు సంబంధించిన స్వీయ మదింపు కసరత్తు పూర్తైందని భారతీ ఎయిర్‌టెల్‌ తెలిపింది. ఇందులో భారతీ ఎయిర్‌టెల్, భారతీ హెక్సాకోమ్,

అమూల్‌ చేతికి హెరిటేజ్‌ పంజాబ్‌ ప్లాంటు

Saturday 29th February 2020

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: డెయిరీ రంగంలో ఉన్న హైదరాబాద్‌ కంపెనీ హెరిటేజ్‌ ఫుడ్స్‌.. పంజాబ్‌లోని తన ప్లాంటును అమూల్‌కు విక్రయించనుంది. డీల్‌ విలువ రూ.21.2 కోట్లు. వారం రోజుల్లో అమూల్‌తో ఈ మేరకు ఒప్పందం చేసుకోనుంది. అమూల్‌ బ్రాండ్‌ను ప్రమోట్‌ చేస్తున్న గుజరాత్‌ కో-ఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌కు (జీసీఎంఎంఎఫ్‌) చెందిన కైరా డిస్ట్రిక్ట్‌ మిల్క్‌ ప్రొడ్యూసర్స్‌ యూనియన్‌కు ప్లాంటును విక్రయిస్తోంది. ప్లాంటు ద్వారా హెరిటేజ్‌ ఫుడ్స్‌కు 2017-18లో రూ.33.82

Most from this category