News


ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్స్‌ ఐపీఓ ఆఫర్‌ ధర రూ.750-755..?

Friday 21st February 2020
news_main1582273591.png-31985

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్స్‌ తొలి పబ్లిక్‌ ఆఫర్‌(ఐపీఓ)లో ఆఫర్‌ ధరను ఒక్కో షేరుకు రూ.750నుంచి 755గా నిర్ణయించే అవకాశం ఉంది. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.9,500 కోట్లను సమీకరించనుంది. కాగా ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్స్‌ తొలి పబ్లిక్‌ ఆఫర్‌ మార్చి2న ప్రారంభమై మార్చి 5న ముగియనుంది. ఆఫర్‌ ముగిసిన తరువాత నాల్గోరోజు ప్రత్యేకంగా రిటైల్‌ ఇన్వెస్టర్లు, హై నెట్‌వర్క్‌ ఇన్వెస్టర్లు, ఎస్‌బీఐ షేరు హోల్డర్లకు పబ్లిక్‌ ఆఫర్‌లో పాల్గోనే అవకాశం కల్పించనున్నారు. ఇప్పటికే 1.31 కోట్ల విలువైన షేర్లను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా  2020 ఫిబ్రవరి 20 నాటికి నమోదై ఉన్న షేర్‌ హోల్డర్స్‌ కోసం రిజర్వ్‌ చేసింది. నాల్గోరోజు రూ.2 లక్షల విలువ చేసే షేర్లను ఈకోటా కింద దరఖాస్తు చేసుకోవచ్చు.కాగా దేశంలోనే  రెండో అతిపెద్ద క్రెడిట్‌ కార్డ్స్‌ సంస్థ తొలిసారి పబ్లిక్‌ ఆఫర్‌ ద్వారా 13.71 ఈక్విటీ షేర్లను ముఖ విలువ రూ.10 చొప్పున విక్రయించనుంది. దీనిలో ఎస్‌బీఐకు చెందిన  3.73 కోట్ల విలువైన షేర్లు ఉండగా, 9.32 కోట్ల విలువైన షేర్లు కార్లే గ్రూపువి ఉన్నాయి. ఇంకా ఇందులో రూ.500 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. దీనిలో 76 శాతం ఎస్‌బీఐదికాగా మిగతాది కార్లేది. కాగా అనధికార మార్కెట్లో ఎస్‌బీఐ ఐపీఓ ఆఫర్‌ షేరు ధర రూ.1,080 పలుకుతుంది.ఒక్కో షేరుపై రూ.330 ప్రిమియం లాభంతో షేర్లు ట్రేడ్‌ అవుతున్నాయి.



You may be interested

ఇక మిడ్, స్మాల్‌క్యాప్‌ల హవా

Friday 21st February 2020

మెరుగైన కార్పొరేట్‌ లాభాల ఫలితంగా ఇక రానున్న రోజుల్లో మిడ్, స్మాల్‌ క్యాప్‌ షేర్లకు డిమాండ్‌ పెరుగుతుందని యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌ పంకజ్‌ బోబ్డే అంచనావేశారు. ఒక ఆంగ్లఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ కరోనావైరస్‌ ఆందోళనలున్నప్పటికీ, మార్కెట్‌ అనేది కార్పొరేట్లు వెలువరించే మంచి ఫలితాలు, అంతర్జాతీయ కేంద్ర బ్యాంకులు వ్యవస్థలోకి ప్రవేశపెట్టే లిక్విడిటీపై ఆధారపడివుంటుందని అన్నారు. ఇప్పటివరకూ వెల్లడైన కార్పొరేట్‌ ఫలితాలు అంచనాలకంటే బావున్నాయని, దీంతో 2021,

నెలరోజులకు టాప్‌-5 స్టాక్‌ సిఫార్సులు

Friday 21st February 2020

అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిణామాలతో దేశీయ మార్కెట్‌లో గత కొన్ని వారాలుగా అనిశ్చతి వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో కొన్ని ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థలు నెలరోజుల కాలానికి కొన్ని స్టాకులను సిఫార్సు చేస్తున్నాయి. ఇప్పుడు వాటిని చూద్దాం... బ్రోకరేజ్‌ సంస్థ: నిర్మల్‌ బంగ్‌ షేరు పేరు: యూపీఎల్‌ ప్రస్తుత ధర: రూ.584  రేటింగ్‌: కొనవచ్చు టార్గెట్‌ ధర: రూ.704.00 కాలపరిమితి: 1నెల విశ్లేషణ: విదేశాల్లో  సబార్డినేటెడ్ క్యాపిటల్ సెక్యూరిటీల జారీ ఇష్యూ ద్వారా యూపీఎల్‌ తన మొత్తం నికరరుణాన్ని తగ్గించేందుకు

Most from this category