News


ఎస్‌బీఐ కార్డు నుంచి త్వరలో రూపే కార్డులు

Monday 2nd September 2019
news_main1567402398.png-28145

న్యూఢిల్లీ: క్రెడిట్ కార్డుల సంస్థ ఎస్‌బీఐ కార్డ్ త్వరలో రూపే పేమెంట్ నెట్‌వర్క్ ఆధారిత కార్డులను జారీ చేయనుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ)తో కుదుర్చుకోవాల్సిన ఒప్పందం ఒకటి ఉందని, ఇది పూర్తయిన వెంటనే రూపే కార్డులకు సంబంధించి కొన్ని ఉత్పత్తులను ప్రవేశపెడతామని ఎస్‌బీఐ కార్డ్‌ ఎండీ హర్‌దయాళ ప్రసాద్‌ తెలిపారు. జాతీయతా భావం రగులుతున్న నేపథ్యంలో రూపే కార్డులే కావాలని అడుగుతున్న వారి సంఖ్య పెరుగుతోందని ఆయన చెప్పారు. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ జారీ చేసే మూడో వంతు కార్డులు ఇవే ఉంటున్నాయని వివరించారు. దీన్ని బట్టి చూస్తుంటే రూపే కార్డుల వాడకం మరింతగా పెరుగుతుందనడంలో సందేహం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం క్రెడిట్ కార్డుల్లో ఎక్కువ శాతం కార్డులు అమెరికన్ పేమెంట్ గేట్‌వేస్‌ వీసా, మాస్టర్‌కార్డ్‌ ఆధారితమైనవే ఉంటున్నాయి. జూలై ఆఖరు నాటికి ఎస్‌బీఐ కార్డుకు 90 లక్షల ఖాతాదారులు, 17.9 శాతం మార్కెట్ వాటా ఉంది. 2018 డిసెంబర్‌ నుంచి ప్రతి నెలా 3 లక్షల కార్డులు అదనంగా జతవుతున్నాయని ప్రసాద్ చెప్పారు. 



You may be interested

ఆగస్ట్‌లో తగ్గిన జీఎస్‌టీ వసూళ్లు

Monday 2nd September 2019

రూ.98,202 కోట్లుగా నమోదు న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)రూపంలో ఆదాయ వసూళ్లు ఆగస్ట్‌ నెలలో లక్ష కోట్ల మార్క్‌ దిగువకు పడిపోయాయి. అంతక్రితం నెల జూలైలో జీఎస్‌టీ వసూళ్లు రూ.1.02 లక్షల కోట్లుగా ఉంటే, ఆగస్ట్‌లో రూ.98,202 కోట్లు వసూలయ్యాయి. అయితే, 2018 ఆగస్ట్‌ నెలలో వచ్చిన ఆదాయం రూ.93,960 కోట్లతో పోలిస్తే మాత్రం పెరిగినట్టు చెప్పుకోవాలి. జీఎస్‌టీ వసూళ్లు రూ.లక్ష కోట్ల మార్క్‌ దిగువకు రావడం ఈ ఏడాది

ఒక్క ఉద్యోగం కూడా పోదు..

Monday 2nd September 2019

బ్యాంకుల విలీనంపై ఆర్థిక మంత్రి భరోసా బ్యాంకులకు మరింత మూలధనం  రంగాలవారీగా సమస్యల పరిష్కారంపై దృష్టి న్యూఢిల్లీ: బ్యాంకుల విలీనంతో ఉద్యోగాలు పోతాయన్న ఉద్యోగ సంఘాల వ్యాఖ్యలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖండించారు. విలీనాలతో ఏ ఒక్క ఉద్యోగం కూడా పోదని స్పష్టం చేశారు. "ఉద్యోగాలు పోతాయన్నది అపోహ మాత్రమే. గత శుక్రవారం ఏం చెప్పానో బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఏ ఒక్క ఉద్యోగి తొలగింపు ఉండబోదని

Most from this category