News


ఫోన్‌తోనూ ఎన్‌ఎఫ్‌సీ చెల్లింపులు: ఎస్‌బీఐ కార్డ్‌

Thursday 17th October 2019
news_main1571285412.png-28941

న్యూఢిల్లీ: పాయింట్ ఆఫ్ సేల్స్ (పీవోఎస్‌) టెర్మినల్స్‌లో మొబైల్ ఫోన్ ద్వారా సులభతరంగా చెల్లింపులు చేసే సదుపాయాన్ని ఎస్‌బీఐ కార్డ్ అందుబాటులోకి తెచ్చింది. నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్‌ఎఫ్‌సీ) టెక్నాలజీని ఉపయోగించే ఈ విధానంలో.. పీవోఎస్‌ మెషీన్‌పై మొబైల్ ఫోన్‌ను ఒకసారి తాకిస్తే చాలు చెల్లింపు ప్రక్రియ పూర్తి చేయొచ్చని సంస్థ తెలిపింది. ప్రత్యేకంగా క్రెడిట్ కార్డు వెంట ఉండక్కర్లేదని, పిన్‌ నంబరు బాదరబందీ ఉండదని పేర్కొంది. సాధారణంగా ఇలాంటి విధానాల్లో ప్రతీ లావాదేవీకి రూ. 2,000, రోజుకు రూ. 10,000 పరిమితి ఉంటుందని .. కానీ తమ కార్డు యూజర్లు లావాదేవీ విలువ పరిమితులను స్వయంగా సెట్ చేసుకోవచ్చని ఎస్‌బీఐ కార్డ్ ఎండీ హర్‌దయాళ్ ప్రసాద్ తెలిపారు. ఈ సదుపాయం కోసం ఎస్‌బీఐ కార్డ్ మొబైల్ యాప్‌లో వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. చెల్లింపులు చేసేటప్పుడు హోమ్‌స్క్రీన్‌ను అన్‌లాక్‌ చేసి, పీవోఎస్‌ మెషీన్‌ దగ్గరగా ఫోన్‌ను ఉంచితే సరిపోతుంది. 



You may be interested

71.20-71.80 శ్రేణిలో రూపీ

Thursday 17th October 2019

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో గురువారం 5 పైసలు బలపడి 71.38 వద్ద ప్రారంభమైంది. కాగా గత సెషన్‌లో దేశీయ ఈక్విటీ మార్కెట్లు పాజిటివ్‌గా ముగియడంతో పాటు, చమురు ధరలు తగ్గడంతో రూపీ డాలర్‌ మారకంలో కనిష్ఠ స్థాయి నుంచి 11 పైసలు బలపడి 71.43 వద్ద ముగిసింది. రూపీ-డాలర్‌ జంటకు గరిష్ఠ స్థాయిల వద్ద సరఫరా ఒత్తిళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని, దీనిని షార్ట్‌ పొజిషన్‌లు తీసుకోడానికి

పెయింట్స్‌ విభాగంలోకి జేఎస్‌డబ్ల్యు

Thursday 17th October 2019

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- వ్యాపార దిగ్గజం జేఎస్‌డబ్ల్యు గ్రూప్‌ పెయింట్స్‌ విభాగంలోకి ప్రవేశించింది. మహారాష్ట్రలో కాయిల్‌ కోటింగ్స్‌ ప్లాంటు, కర్నాటకలో వాటర్‌ బేస్డ్‌ డెకొరేటివ్‌ పెయింట్స్‌ యూనిట్‌ నెలకొల్పింది. వీటి కోసం రూ.600 కోట్లు ఖర్చు చేస్తోంది. రెండు కేంద్రాల వార్షిక సామర్థ్యం 12.5 కోట్ల లీటర్లు. ముందుగా దక్షిణ, పశ్చిమ భారత్‌లో విస్తరిస్తామని జేఎస్‌డబ్ల్యు పెయింట్స్‌ జేఎండీ ఎ.ఎస్‌.సుందరేశన్‌ బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు. ‘2022 నాటికి దేశవ్యాప్తంగా అడుగు

Most from this category