News


ఎస్‌బీఐ కార్డు మొబైల్‌ యాప్‌లో ఐఎల్‌ఏ

Saturday 31st August 2019
news_main1567230606.png-28126

  • ఎస్‌బీఐ కార్డు మొబైల్‌ యాప్‌లో ఐఎల్‌ఏ

ఎస్‌బీఐ కార్డ్‌ సంస్థ తన మొబైల్‌ యాప్‌లోకి చాట్‌బాట్‌ ఐఎల్‌ఏ (ఇంటరాక్టివ్‌ లైవ్‌ అసిస్టెంట్‌) ను ప్రవేశపెట్టింది. కస్టమర్లకు మరింత సౌలభ్యాన్ని తీసుకురావడమే దీన్ని ఉద్దేశ్యం. 40కు పైగా వినూత్నమైన స్వయం సేవ ఫీచర్లతో ఉన్న ఐఎల్‌ఏను ఆఫర్‌ చేస్తున్న తొలి సంస్థగా ఎస్‌బీఐ కార్డు నిలుస్తుందని ఓ ప్రకటనలో తెలిపింది. ఈఎంఐ కన్వర్షన్‌, బ్యాలన్స్‌ బదిలీ, క్రెడిట్‌ కార్డుపై రుణం, ఇతర అకౌంట్‌ నిర్వహణ ఆప్షన్లు అన్నవి పరిశ్రమలోనే మొబైల్‌ చాట్‌బాట్‌ ద్వారా ఆఫర్‌ చేస్తుండడం మొదటిసారి అని పేర్కొంది. చాట్‌ బాట్‌పై లైవ్‌ చాట్‌ ఆప్షన్‌ కూడా ఉంది. దీని ద్వారా ప్రత్యేకమైన కేసుల్లో పరిష్కారాన్ని నేరుగా కస్టమర్‌ కేర్‌ ప్రతినిధి అందించడం జరుగుతుంది. ఎస్‌బీఐ కార్డ్‌ వెబ్‌సైట్‌పై ఐఎల్‌ఏ సేవను గతేడాది ప్రవేశపెట్టగా, తాజాగా దీన్ని మొబైల్‌ యాప్‌నకూ తీసుకొచ్చినట్టు అయింది. You may be interested

రూ.5.47 లక్షల కోట్లకు ద్రవ్యలోటు

Saturday 31st August 2019

బడ్జెట్‌ అంచనాల్లో ఇప్పటికే 77.8 శాతానికి చేరిక న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయ-వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం- ద్రవ్యలోటు జూలై నాటికి రూ.5,47,605 లక్షల కోట్లకు చేరింది. 2019-20 మొత్తం బడ్జెట్‌ లక్ష్యంలో 77.8 శాతానికి చేరింది. కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ తాజా గణాంకాలను విడుదల చేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే నెలకు ద్రవ్యలోటు అప్పటి బడ్జెట్‌ (2018-19) అంచనాల్లో 86.5 శాతంగా ఉంది. 2019-2020 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు

ఐటీఆర్‌ దాఖలుకు నేటి వరకే గడువు

Saturday 31st August 2019

గడువు పొడగించలేదని స్పష్టీకరణ న్యూఢిల్లీ: ఆదాయపన్ను రిటర్నుల దాఖలు గడువు పొడిగించలేదని, ఈ నెల 31లోపు (శనివారం) కచ్చితంగా దాఖలు చేయాల్సిందేనని ఆదాయపన్ను శాఖ శుక్రవారం ఓ ప్రకటన ద్వారా స్పష్టత ఇచ్చింది. ఐటీఆర్‌ దాఖలుకు గడువును ప్రభుత్వం మరో నెల పాటు పొడిగించిందటూ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలను ఖండించింది. ‘‘సామాజిక మాధ్యమాల్లో సీబీడీటీ గడువు పొడిగించినట్టు ప్రచారమవుతున్న ఆదేశాలు నిజం కాదు. పన్ను చెల్లింపుదారులు పొడిగించిన గడువు ఆగస్ట్‌

Most from this category