News


నిరర్థక ఆస్తులను 2.4-2.5శాతానికి కట్టడి చేస్తాం: ఎస్‌బీఐ కార్డ్స్‌ సీఈవో

Tuesday 25th February 2020
news_main1582626833.png-32085

మొత్తం ఆస్తుల్లో నిరర్థక ఆస్తులను 2.4శాతం నుంచి 2.50శాతానికి పరిమితం చేసే దిశగా లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు ఎస్‌బీఐ కార్డ్స్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ హర్దలాల్‌ ప్రసాద్‌ తెలిపారు. కంపెనీ ఐపీఓ మార్చి 2న ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మార్చి 2018 నాటికి 2.9శాతంగా ఉన్న స్థూల ఎన్‌పీఏలు గడిచిన ఏడాది డిసెంబర్‌ 31 నాటికి 2.47శాతానికి దిగివచ్చినట్లు ఆయన తెలిపారు. కార్డు చెల్లింపుల ప్రాసెసింగ్ కోసం వ్యాపారులు చెల్లించే ఫీజుపై సంస్థ ప్రభుత్వంతో పలు సార్లు చర్చలు జరిపిందని ప్రసాద్ మీడియాతో తెలిపారు.  ఈ వ్యాపార సంస్థల నుంచి రూపే డెబిట్ కార్డు, యూపీఐ క్యూఆర్ కోడ్ ద్వారా జరిపే లావాదేవీలపై ఎలాంటి ఎండీఆర్ ఫీజును వసూలు చేయకూడదని ప్రకటించింది. రూ.50 కోట్లకు పైన టర్నోవర్ ఉన్న వ్యాపార సంస్థలకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ రెవెన్యూ కచ్చితంగా ఈ ఫెసిలిటీని వర్తింపజేయాల్సి ఉంటుందని 2019 చివర్లో నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగబ్యాంక్‌ అనుబంధ సం‍స్థ ఉన్న ఎస్‌బీఐ కార్డ్స్‌ కంపెనీ ఐపీఓ ద్వారా సుమారు రూ.9వేల కోట్లను సమీకరించేందుకు సిద్ధమైంది. ఇష్యూలో భాగంగా ఎస్‌బీఐ కార్డ్స్‌ మొత్తం 130.5 మిలియన్‌ షేర్లను ఆఫర్‌ చేయనున్నారు. ఇందులో 37.29 మిలియన్ల వరకు ఎస్‌బీఐ, 93.23 మిలియన్ల వరకు షేర్లను కార్లైల్‌ గ్రూప్‌ ఆఫర్‌ చేస్తుంది. వీటికి అదనంగా కంపెనీ రూ.500 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. ఐపీఓ ధర శ్రేణి రూ.రూ.750-755లుగా నిర్ణయించింది. కార్డుల సంఖ్య, మార్కెట్ వ్యయంపరంగా కూడా రెండవ అతిపెద్ద మార్కెట్ వాటాను కలిగి ఉంది. 

ఎస్‌బీఐ కార్డ్స్‌ మొత్తం వాటాలో ఎస్‌బీఐ వాటా 74శాతం ఉండగా మిగిలిన 24 శాతం వాటా కార్ల కార్లైల్‌ గ్రూప్‌ చేతిలో ఉంది. కార్లైల్ 2017 లో జనరల్ ఎలక్ట్రిక్ సంస్థ నుంచి 20 బిలియన్ రూపాయలకు ఈ 24శాతం వాటాను కొనుగోలు చేసింది. ఇప్పుడు ఐపీఓ ప్రక్రియలో భాగంగా ఎస్‌బీఐ 4శాతం వాటాను కార్లైల్‌ 10శాతం వాటాను విక్రయించనున్నాయి. You may be interested

ఇండియా సిమెంట్స్‌లో వాటా పెంచుకుంటున్న దమానీలు

Tuesday 25th February 2020

ఇండియా సిమెంట్స్‌ కంపెనీలో ఏదో జరుగుతోందా..? ఈ కంపెనీలో దమానీ సోదరులు వాటాలను పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తుండడం ఆసక్తికరంగా మారింది. చెన్నై క్రికెట్‌ లిమిటెడ్‌ ఐపీవోకు ప్లాన్‌ చేసుకుంటున్న క్రమంలోనే వీరు వాటాలు పెంచుకుంటున్నారా..? అన్న సందేహానికి తావిస్తోంది. సీఎస్‌ఎల్‌కు ప్రమోటర్‌ ఇండియా సిమెంట్స్‌ అని తెలిసిందే. డీమార్ట్‌ అధినేత రాధాకిషన్‌ దమానీ ఇండియా సిమెంట్స్‌లో 4.73 శాతం వాటా కలిగి ఉన్నారు. ముఖ్యంగా గత డిసెంబర్‌ త్రైమాసికంలోనే

వొలాటిలిటీ మధ్య నష్టాల ముగింపు

Tuesday 25th February 2020

సెన్సెక్స్‌ 82 పాయింట్లు డౌన్‌ 31 పాయింట్లు నీరసించిన నిఫ్టీ  ఫార్మా రంగం పతన బాట రోజంతా ఆటుపోట్ల మధ్య కదిలిన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరికి నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 82 పాయింట్లు క్షీణించి 40,281 వద్ద నిలవగా.. 31 పాయింట్లు తగ్గిన నిఫ్టీ 11,798 వద్ద స్థిరపడింది. కరోనా వైరస్‌ ఆందోళనలు, ఫిబ్రవరి డెరివేటివ్‌ సిరీస్‌ ముగింపు మధ్య మార్కెట్లు పలుమార్లు ఒడిదొడుకులను ఎదుర్కొన్నాయి. వెరసి సెన్సెక్స్‌ 40,536 పాయింట్ల వద్ద

Most from this category