News


జనవరి 1 నుంచి పాత ఎస్‌బీఐ కార్డులు పనిచేయవు!

Thursday 19th December 2019
news_main1576729081.png-30300

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: జనవరి 1, 2020 నుంచి మీ పాత స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) డెబిట్, క్రెడిట్‌ కార్డులు పని చేయవు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మార్గదర్శకాల ప్రకారం.. పాత డెబిట్, క్రెడిట్‌ కార్డుల స్థానంలో చిప్‌ ఆధారిత ఈఎంవీ కార్డులను మాత్రమే వినియోగించాలి. ఈ నెల 31 లోపు ఎస్‌బీఐ ఖాతాదారులు తమ హోమ్‌ బ్రాంచీల్లో మ్యాజిస్టిక్‌ స్ట్రిప్‌ డెబిట్‌ కార్డ్, పాత కార్డ్‌ల స్థానంలో ఈఎంవీ చిప్, పిన్‌ ఆధారిత డెబిట్‌ కార్డ్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలి. నెట్‌ బ్యాంకింగ్‌ ఉన్న ఖాతాదారులు ఆన్‌లైన్‌లో కొత్త కార్డ్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని బ్యాంకు తెలియజేసింది. ఇప్పటికే పాన్‌ లేదా ఫామ్‌ 60లను అప్‌డేట్‌ చేయని ఎస్‌బీఐ ఖాతాదారుల కార్డ్‌లను ఎస్‌బీఐ డీయాక్టివేట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. 



You may be interested

మార్కెట్లోకి పియాజియో ‘ఏప్‌ ఈ–సిటీ’

Thursday 19th December 2019

న్యూఢిల్లీ: ఇటలీకి చెందిన దిగ్గజ వాహన తయారీ కంపెనీ పియాజియో.. భారత ఎలక్ట్రిక్‌ వాహన విభాగంలోకి అడుగుపెట్టింది. ‘ఏప్‌ ఈ–సిటీ’ పేరిట ఎలక్ట్రిక్‌ త్రీ–వీలర్‌ను బుధవారం విడుదల చేసింది. లిథియం– అయాన్‌ బ్యాటరీ కలిగిన దీని ధర రూ. 1.97 లక్షలుగా(ఎక్స్‌–షోరూం) ప్రకటించింది. మూడేళ్ల వారెంటీతో వస్తున్న ఈ వాహనాన్ని సన్‌ మొబిలిటీ భాగస్వామ్యంతో మొదటి దశలో చండీగఢ్, మొహాలి, గురుగ్రామ్‌లలో అందుబాటులోకి తెస్తోంది. 

జేఎల్‌ఆర్‌ చేతికి ‘బౌలర్‌’

Thursday 19th December 2019

న్యూఢిల్లీ: ఏ తరహా ప్రాంతంలోనైనా పరుగులు తీసే పెర్ఫామెన్స్‌ కార్లను, విడి భాగాలను, ర్యాలీ రెయిడ్‌ వాహనాల్ని తయారు చేసే బ్రిటన్‌ సంస్థ బౌలర్‌ను టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల విభాగం జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌) కొనుగోలు చేసింది. ఆఫ్‌–రోడ్‌ కాంపిటీషన్‌ కార్లను కూడా తయారు చేసే బౌలర్‌ కంపెనీ ఇకపై జేఎల్‌ఆర్‌కు చెందిన స్పెషల్‌ వెహికల్‌ ఆపరేషన్స్‌ వ్యాపారంలో ఒక భాగం కానుంది.  అయితే ఎంత మొత్తానికి

Most from this category