News


సౌదీ ఆరామ్‌కో ఐపీఓ సైజు 2,560 కోట్ల డాలర్లు !

Monday 18th November 2019
news_main1574048820.png-29657

ప్రైస్‌బ్యాండ్‌ 8-8.5 డాలర్లు
డిసెంబర్‌ రెండో వారంలో లిస్టింగ్‌ ! 

రియాద్‌: సౌదీ అరేబియా చమురు దిగ్గజం, సౌదీ ఆరామ్‌కో ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) ప్రైస్‌బ్యాండ్‌ను నిర్ణయించింది. ఈ ఐపీఓలో భాగంగా 1.5 శాతం వాటా (సుమారుగా 300 కోట్ల షేర్లు)ను విక్రయించనున్నది. ప్రైస్‌బ్యాండ్‌ను 30-32 సౌదీ రియాల్స్‌ (8-8,5 డాలర్లు-సుమారుగా రూ.576-612 రేంజ్‌లో)గా నిర్ణయించింది. ఈ ప్రైస్‌బ్యాండ్‌ పరంగా చూస్తే, సౌదీ ఆరామ్‌కో కంపెనీ విలువ 1.60-1.71  లక్షల కోట్ల డాలర్లుగా ఉంటుందని అంచనా. ప్రైస్‌బ్యాండ్‌ కనిష్ట ధర పరంగా చూస్తే, 2,400 కోట్ల డాలర్లతో ఈ ఐపీఓ ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ఐపీఓ అవుతుంది. గరిష్ట ధర పరంగా చూస్తే, 2,560 కోట్ల డాలర్లతో ఇదే అతి పెద్ద ఐపీఓ అవుతుంది. ఇప్పటిదాకా అతి పెద్ద ఐపీఓ రికార్డ్‌ 2014లో వచ్చిన చైనా ఈ కామర్స్‌ దిగ్గజం ఆలీబాబా పేరిట (2,500 కోట్ల డాలర్లు)గా ఉంది. కాగా ఇష్యూ ధరను వచ్చే నెల 5న నిర్ణయిస్తారు. డిసెంబర్‌ రెండో వారంలో ఈ షేర్లు స్టాక్‌ మార్కెట్లో లిస్టయ్యే అవకాశాలున్నాయి. 


దేశభక్తికి నిదర్శనం ! 
ప్రస్తుతం సౌదీ అరేబియా(తాదవుల్‌) స్టాక్‌ ఎక్స్చేంజ్‌లోనే  సౌదీ ఆరామ్‌కో షేర్లను లిస్ట్‌ చేస్తామని, అంతర్జాతీయ స్టాక్‌ మార్కెట్‌ లిస్టింగ్‌ ఆలోచనేదీ లేదని సౌదీ ఆరామ్‌కో స్పష్టం చేసింది. ఈ ఐపీఓను విజయవంతం చేయడానికి సౌదీ అరేబియా అన్ని చర్యలు తీసుకుంటోంది. సంపన్ను సౌదీ వ్యాపార కుటుంబాలు, ఫండ్స్‌ ఈ ఐపీఓలో ఇన్వెస్ట్‌ చేయాలని ఒత్తిడి తెస్తోంది. ఈ ఐపీఓలో ఇన్వెస్ట్‌ చేయడం దేశభక్తికి నిదర్శనమంటూ సౌదీవాసుల్లో  ప్రచారమవుతోంది. ఈ ఐపీఓలో ఇన్వెస్ట్‌ చేయడానికి పలువురు సౌదీ వాసులు ఇప్పటికే బ్యాంక్‌ల నుంచి రుణాలు తీసకున్నారని, కొందరైతే వ్యక్తిగత ఆస్తులను కూడా అమ్మేశారని సమాచారం. 



You may be interested

కార్వీపై ఇన్వెస్టర్ల ఫిర్యాదులు

Monday 18th November 2019

న్యూఢిల్లీ: ఫైనాన్షియల్‌ సర్వీసుల్లో ఉన్న హైదరాబాద్‌ కంపెనీ కార్వీపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తమకు రావాల్సిన మొత్తాలను కార్వీ చెల్లించడం లేదంటూ సోషల్‌ మీడియా వేదికగా ప్రధాని కార్యాలయంతోపాటు ఆర్థిక శాఖ, సెబీకి దేశవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్ల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. దీనినిబట్టి చూస్తుంటే నగదు కొరతతో కార్వీ ఇబ్బంది పడుతోందని సమాచారం. కాస్టర్‌ సీడ్‌ (ఆముదం) కాంట్రాక్టుల్లో కార్వీ క్లయింట్లు పెద్ద ఎత్తున నష్టపోవడంతో.. వారి నుంచి రావాల్సిన బాకీలు

బీమా పాలసీ కొనసాగించలేకపోతున్నారా?

Monday 18th November 2019

-మీ ముందు రెండు మార్గాలు -పాలసీని సరెండర్‌ చేయడం -పాలసీని పెయిడప్‌గా మార్చుకోవడం -సరెండర్‌ చేస్తే బీమా కవరేజీని నష్టపోతారు -పెయిడప్‌గా మార్చుకుంటే బీమా కొనసాగుతుంది -ప్రీమియం చెల్లించాల్సిన భారం తగ్గుతుంది -చివర్లో మెచ్యూరిటీ కూడా అందుకోవచ్చు కారణాలేవైనా కానీ  మీరు తీసుకున్న బీమా పాలసీని కొనసాగించలేకపోతున్నారా..? ప్రీమియం చెల్లింపును భారంగా భావిస్తున్నారా..? దీంతో పాలసీని రద్దు చేసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే మీ ముందు ఓ చక్కని మార్గం ఉంది. పాలసీ ప్రీమియం చెల్లించకపోతే అది ల్యాప్స్‌ అయిపోతుంది. దీనికంటే

Most from this category