News


సౌదీ ఆరామ్‌కో @ 2 ట్రలియన్‌ డాలర్ల కంపెనీ

Friday 13th December 2019
news_main1576219922.png-30207

  • ప్రపంచంలో అత్యధిక మార్కెట్‌ క్యాప్‌ కంపెనీ ఇదే 

దుబాయ్‌: సౌదీ చమురు దిగ్గజం, సౌదీ ఆరామ్‌కో కంపెనీ మార్కెట్‌ విలువ 2 ట్రిలియన్‌ డాలర్లు(2 లక్షల కోట్ల డాలర్లు-రూ.142 లక్షల కోట్లు)దాటేసింది. ప్రపంచంలో అత్యధిక మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఉన్న కంపెనీ ఇదే. 1.19 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్‌ క్యాప్‌తో యాపిల్‌ కంపెనీ రెండో స్థానంలో ఉంది. స్టాక్‌ మార్కెట్లో లిస్టైన తొలి రోజు 1.8 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్‌ క్యాప్‌ సాధించిన సౌదీ ఆరామ్‌కో కంపెనీ రెండో రోజే 2 లక్షల కోట్ల మార్కెట​క్యాప్‌ను దాటేయడం విశేషం. దీంతో ఈ కంపెనీ విలువ 2 లక్షల కోట్ల డాలర్లు ఉండాలన్న సౌదీ రాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ స్వప్పం సాకారమైంది. ఈ కంపెనీ షేర్‌ గురువారం దుబాయ్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌లో ఆరంభంలోనే 38.60 రియాళ్లు(10.29 డాలర్లు)కు పెరిగింది.  చివరకు 37.3 రియాళ్ల వద్ద ముగిసింది. ఇటీవలే ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌)లో భాగంగా 1.5 శాతం వాటా విక్రయించి 2,560 కోట్ల డాలర్లు సమీకరించింది. అతి పెద్ద ఐపీఓ రికార్డ్‌ను కూడా సాధించింది. ‍కాగా ముడి చమురు ధరలు తక్కువగా ఉండటం, వాతావారణ కాలుష్యం పెరుగుతున్నందువల్ల పర్యావరణ హిత ఇంధనాలకు డిమాండ్‌ పెరుగుతుండటం, భౌగోళిక రాజకీయ రిస్క్‌లు తదితర అంశాలను దృష్టిల్లో పెట్టుకుంటే, ఈ షేర్‌ ధర అధికంగా ఉందని నిపుణులంటున్నారు. 



You may be interested

ఎఫ్‌పీఐలు.. షార్ట్‌ సెల్లింగ్‌ ఆపండి!

Friday 13th December 2019

సెబి ఆదేశాలు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లలో(ఎఫ్‌పీఐ) కొందరు షేర్ల షార్ట్‌ సెల్లింగ్‌ చేస్తున్నారని, దీన్ని తక్షణమే నివారించాలని ఆయా కస్టోడియన్లను సెబి ఆదేశించింది. పోర్టుఫోలియోలో పొజిషన్‌ లేకున్నా విక్రయించడాన్ని షార్ట్‌ సెల్లింగ్‌ అంటారు. కొన్ని ఎఫ్‌పీఐలు ఇలాంటి ట్రేడ్లకు పాల్పడుతున్నాయని తమ దృష్టికి వచ్చినట్లు సెబి తెలిపింది. విదేశీ ఫండ్స్‌కు, దేశీయ మార్కెట్‌కు మధ్య కస్టోడియన్లు అనుసంధానకర్తలుగా వ్యవహరిస్తారు. ఎఫ్‌పీఐల షార్ట్‌ సెల్లింగ్‌ నిర్వాకం గురించి వీరిని సెబి హెచ్చరించింది. దేశీయ

లాభాల్లో టాటా స్టీల్‌, టాటా మోటర్స్‌ షేర్లు

Friday 13th December 2019

6శాతం ర్యాలీ చేసిన టాటామోటర్స్‌  4శాతం పెరిగిన టాటాస్టీల్‌ షేరు ట్రేడింగ్‌ ప్రారంభంలోనే టాటా స్టీల్‌, టాటా మోటర్స్‌ షేర్ల హావా కొనసాగుతుంది. టాటామోటర్స్‌ షేరు 6శాతం, టాటాస్టీల్‌ షేరు 4శాతం పెరిగాయి. బ్రిటన్‌లో గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీకే మరోసారి ఓటర్లు పట్టం కట్టారని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఈ షేర్ల ర్యాలీకి కారణమవుతున్నాయి. కన్జర్వేటివ్ పార్టీ యూరోపియన్‌ యూనియన్‌ నుంచి వైదొలిగేందకు (బ్రెగ్జిట్‌)కు అనుకూలం. టాటా స్టీల్‌,

Most from this category