News


సౌదీ ఆరామ్‌కో ఐపీఓ డిసెంబర్‌లో !

Wednesday 30th October 2019
news_main1572405992.png-29220

  • డిసెంబర్‌ 11న సౌదీ స్టాక్‌ మార్కెట్లో లిస్టింగ్‌ 

దుబాయ్‌: ఇంధన దిగ్గజం సౌదీ ఆరామ్‌కో కంపెనీ ఈ ఏడాది డిసెంబర్‌ 11న రియాద్‌ స్టాక్‌ మార్కెట్లో ఆరంగేట్రం చేయనున్నది. సౌదీ తాదవుల్‌ ఎక్స్చేంజ్‌లో సౌదీ ఆరామ్‌కో కంపెనీ షేర్లు ఆ రోజున లిస్టవుతాయని సౌదీ అరేబియాకు చెందిన అల్‌ అరేబియా టీవీ చానెల్‌ వెల్లడించింది. సౌదీ ఆరామ్‌కో ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌)కు సంబంధించిన టైమ్‌ టైబుల్‌ను వచ్చే నెల 3న సౌదీ ఎక్స్చేంజ్‌ ప్రకటిస్తుందని ఈ చానెల్‌ పేర్కొంది. వచ్చే నెల 17న ఈ కంపెనీ ఐపీఓకు సంబంధించిన ప్రైస్‌బ్యాండ్‌ వెల్లడవుతుందని తెలిపింది. డిసెంబర్‌ 4 నుంచి సౌదీ ఆరామ్‌కో ఐపీఓ ఆరంభమవుతుందని పేర్కొంది. 
10,000 కోట్ల డాలర్లు సమీకరణ ! 
సౌదీ అరామ్‌కో కంపెనీ విలువ కనీసం 2 లక్షల కోట్ల డాలర్లుగా(రూ.140 లక్షల కోట్లు. మన దగ్గర అత్యంత మార్కెట్‌ క్యాప్‌ గల కంపెనీ  రిలయన్స్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.9 లక్షల కోట్లు మాత్రమే) ఉండాలని సౌదీ అరేబియా ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ విలువ చాలా అధికమని అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లు అంటున్నారు. కాగా ఈ ఐపీఓలో భాగంగా సౌదీ అరామ్‌కో కంపెనీలో 5 శాతం వరకూ వాటాను విక్రయించాలని సౌదీ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ వాటా విక్రయం ద్వారా 10,000 కోట్ల డాలర్లు (సుమారుగా రూ.7 లక్షల కోట్లు) సమీకరించవచ్చని భావిస్తోంది. అయితే ఈ వాటా విక్రయం ద్వారా వచ్చే నిధులు ఈ స్థాయిలో ఉండకపోవచ్చని సమాచారం. కాగా దేశీయ స్టాక్‌ మార్కెట్లో లిస్టైన తర్వాత మరో ఐదు శాతం వాటాను విదేశీ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ల్లో లిస్టవడం ద్వారా విక్రయించాలని సౌదీ ఆరామ్‌కో భావిస్తోందని వార్తలు వస్తున్నాయి. 



You may be interested

టెలికామ్‌కు బెయిలవుట్‌?

Wednesday 30th October 2019

సాధ్యాసాధ్యాలపై సెక్రటరీల కమిటీ ఏర్పాటు న్యూఢిల్లీ:  టెల్కోల నుంచి భారీగా రూ. 92,000 కోట్లు రాబట్టుకోవడానికి సుప్రీంకోర్డు డాట్‌ (టెలకమ్యూనిషన్ల శాఖ)కు అనుమతించిన నేపథ్యంలో- ఆయా కంపెనీల ఆర్థిక స్థితిగతులపై సమీక్షించి, తగిన సలహాలు ఇవ్వడానికి కేంద్రం మంగళవారం ఒక సెక్రటరీల కమిటీ (సీఓఎస్‌)ని ఏర్పాటు చేసింది. సుప్రీం రూలింగ్‌ నేపథ్యంలో- టెలికం రంగం తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి జారే అవకాశం ఉందన్న ఆందోళనల నేపథ్యంలో కేంద్రం ఈ కమిటీని ఏర్పాటు

మా దగ్గర ఇన్వెస్ట్ చేయండి..

Wednesday 30th October 2019

ఇంధన, మౌలిక రంగాల్లో అపార అవకాశాలు సౌదీ కంపెనీలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు ప్రపంచ ఎకానమీకి భారత్‌ కీలకమని వెల్లడి  రియాద్‌: వచ్చే ఐదేళ్లలో 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదగాలని నిర్దేశించుకున్న భారత్‌లో పెట్టుబడులకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. దేశ ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టాలంటూ సౌదీ అరేబియా కంపెనీలను ఆహ్వానించారు. ఈ రంగంలో 100 బిలియన్‌ డాలర్ల పైగా ఇన్వెస్ట్‌మెంట్‌ అవకాశాలు ఉన్నాయని

Most from this category