News


సత్యం కేసులో సెబీకి ‘సుప్రీం’ ఊరట

Tuesday 19th November 2019
news_main1574133539.png-29685

- సత్యం కేసులో సెబీకి ‘సుప్రీం’ ఊరట
న్యూఢిల్లీ: ఆడిటర్లను నిషేధించే అధికారం మార్కెట్స్‌ నియంత్రణ సంస్థ సెబీకి లేదంటూ సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (శాట్‌) ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది.  సత్యం కంప్యూటర్‌ సర్వీసెస్‌ కేసు విషయంలో  సెప్టెంబర్‌ 9న శాట్‌ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సెబీ దాఖలు చేసిన అప్పీల్‌పై జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ ఇందిరా బెనర్జీలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ తాజా ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. 

వివరాలు ఇవీ...
- రూ.7,800 కోట్ల సత్యం కుంభకోణానికి సంబంధించిన పాత్రపై ప్రైస్‌ వాటర్‌హౌస్‌కూపర్స్‌ ఇండియా విభాగం  ప్రైస్‌ వాటర్‌హౌస్‌(పీడబ్ల్యూసీ)పై సెబీ  2018 జనవరి 10వ తేదీన రెండు సంవత్సరాల నిషేధం విధించింది. సంబంధింత రెండేళ్ల సమయంలో లిస్టెడ్‌ కంపెనీల ఆడిటింగ్‌ నిర్వహించరాదని స్పష్టం చేసింది. 
- ఈ ఉత్తర్యులను శాట్‌లో పీడబ్ల్యూసీ సవాలు చేసింది. 
- కేసును విచారించిన ట్రిబ్యునల్‌, ఆడిట్‌ సంస్థ- ప్రైస్‌వాటర్‌హౌస్‌పై సెబీ నిషేధం విధించడం సరికాదని తన ఉత్తర్వ్యుల్లో పేర్కొంది. అయితే తప్పు చేసిన ఆడిటర్ల నుంచి రూ.13 కోట్ల ఫీజు వాపసు నిర్ణయాన్ని మాత్రం పాక్షికంగా అనుమతించింది.  
- ఆడిటర్లపై చర్య తీసుకునే అధికారం కేవలం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ)కి మాత్రమే ఉందని కూడా శాట్‌ తన ఉత్తర్వ్యుల్లో స్పష్టం చేసింది. ఆడిటింగ్‌లో నిర్లక్ష్యం ప్రాతిపదికనే మోసాలను నిరూపించజాలమని పేర్కొంది.  ఆడిట్‌, ఆడిటింగ్‌ సేవల నాణ్యత విషయాల్లో జోక్యం చేసుకునే అధికారం సెబీకి లేదని శాట్‌ తన ఉత్తర్వ్యుల్లో తెలిపింది. 
- ‘‘తప్పు జరక్కుండా ముందస్తు చర్యలు, లేదా తదుపరి చర్యలను మాత్రమే సెబీ తీసుకోగదు. అయితే ఇక్కడ అటువంటి దాఖలాలు కనిపించడం లేదు. ఇక్కడ శిక్ష విధించిన దాఖలాలే కనిపిస్తున్నాయి. ఈ అధికారం సెబీకి లేదు’’ అని శాట్‌ తన ఉత్తర్వ్యుల్లో పేర్కొంది. 

సత్యం కేసు ఇదీ...
ఒకప్పటి సత్యం కంప్యూటర్‌ సర్వీసెస్‌లో కోట్లాది రూపాయల మోసం జరిగిన విషయం 2009 జనవరి 8వ తేదీన వెలుగుచూసింది. అప్పటికి కొన్ని సంవత్సరాలుగా రూ.5,004 కోట్ల మేర ఖాతాల్లో అవకతవకలకు పాల్పడినట్లు కంపెనీ వ్యవస్థాపకుడు రామలింగరాజు బహిరంగంగా అంగీకరించడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ మోసపూరిత ఆర్థిక కుంభకోణం విలువ దాదాపు రూ.7,800 కోట్లని సెబీ విచారణలో తేలింది. 



You may be interested

ఫార్మా వృద్ధిపై యూఎస్‌ఎఫ్‌డీఏ ప్రభావం

Tuesday 19th November 2019

తనిఖీల వల్లే ప్రస్తుత పరిస్థితి డాక్టర్‌ రెడ్డీస్‌ కో-చైర్మన్‌ ప్రసాద్‌ హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- దేశీయ ఫార్మా కంపెనీల ప్లాంట్లలో యూఎస్‌ఎఫ్‌డీఏ తరచూ తనిఖీలు చేయడం, లోపాలను లేవనెత్తడంతో ఔషధ ఎగుమతుల వృద్ధి తగ్గుతోందని సీఐఐ ఫార్మాస్యూటికల్స్‌ నేషనల్‌ కమిటీ చైర్మన్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ కో-చైర్మన్‌ జి.వి.ప్రసాద్‌ అన్నారు. సీఐఐ-ఐఎంటీహెచ్‌ సంయుక్తంగా సోమవారం నిర్వహించిన హెల్త్‌, ఫార్మా సదస్సులో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ‘వార్నింగ్‌ లెటర్ల కారణంగా చాలా కంపెనీల అనుమతులు

ఐఎండీ ర్యాంకింగ్‌లో 6 మెట్లు తగ్గిన భారత్‌

Tuesday 19th November 2019

59వ స్థానంతోనే సరి న్యూఢిల్లీ: స్విట్జర్లాండ్‌కి చెందిన ప్రముఖ బిజినెస్‌ స్కూల్‌ ‘ఐఎండీ’ తాజాగా ప్రకటించిన వరల్డ్‌ టాలెంట్‌ ర్యాంకింగ్‌లో భారత్‌ వెనకపడింది. మొత్తం 63 దేశాలతో కూడిన ఈ జాబితాలో భారత్‌ 6 మెట్లు తగ్గి 59వ స్థానానికి పడిపోయింది. పెట్టుబడి, అభివృద్ధి, సంసిద్ధత ఆధారంగా ఈ ర్యాంకింగ్‌ను విడుదలచేయగా.. చైనా (42), రష్యా (47), దక్షిణ ఆఫ్రికా (50)వ స్థానాల్లో నిలిచి, బ్రిక్స్‌ దేశాల జాబితాలో భారత్‌ను వెనక్కునెట్టాయి.

Most from this category