News


ఎన్‌డీటీవీ ప్రమోటర్ల నిషేధంపై శాట్‌ స్టే

Wednesday 19th June 2019
news_main1560927457.png-26413

సెప్టెంబర్‌ 16న తదుపరి విచారణ  న్యూఢిల్లీ: ఎన్‌డీటీవీ ప్రమోటర్లు క్యాపిటల్‌ మార్కెట్‌ లావాదేవీల్లో పాల్గొనకుండా నిషేధిస్తూ సెబీ ఇచ్చిన ఆదేశాలను శాట్‌ నిలిపేసింది. ఎన్‌డీటీవీ ప్రమోటర్లు- ప్రణయ్‌ రాయ్‌, రాధికా రాయ్‌, హోల్డింగ్‌ సంస్థ ఆర్‌ఆర్‌ఆర్‌ఆర్‌ హోల్డింగ్‌​‍ప్రైవేట్‌ లిమిటెడ్‌లు క్యాపిటల్‌ మార్కెట్‌ లావాదేవీల్లో రెండేళ్ల పాటు పాల్గొనకూడదంటూ సెబీ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీన్ని సవాలు చేస్తూ ఎన్‌డీటీవీ ప్రమోటర్లు సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ను (శాట్‌) ఆశ్రయించారు. ఈ నిషేధంపై శాట్‌ స్టే ఇచ్చిందని ఎన్‌డీటీవీ తెలిపింది. ఈ విషయమై తదుపరి విచారణ సెప్టెంబర్‌ 16న జరుగుతుందని పేర్కొంది. 



You may be interested

బజాజ్‌ హోల్డింగ్స్‌ అనుబంధ సంస్థగా ఎంఎస్‌ఎల్‌

Wednesday 19th June 2019

- డబ్ల్యూఎండీసీ వాటాల బదిలీ ముంబై: ఒకప్పటి ప్రియా బ్రాండ్ స్కూటర్స్‌ తయారీ సంస్థ మహారాష్ట్ర స్కూటర్స్ లిమిటెడ్ (ఎంఎస్‌ఎల్‌)... తాజాగా బజాజ్ హోల్డింగ్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్‌ (బీహెచ్‌ఐఎల్‌) అనుబంధ సంస్థగా మారింది. సుదీర్ఘ న్యాయపోరాటం అనంతరం వెస్టర్న్‌ మహారాష్ట్ర డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (డబ్ల్యూఎండీసీ) సంస్థ ఎంఎస్‌ఎల్‌లో తనకున్న 27 శాతం వాటాను బీహెచ్‌ఐఎల్‌కు బదలాయించడంతో ఇది సాధ్యపడింది. దీంతో ఎ౾ంఎస్‌ఎల్‌లో బీహెచ్‌ఐఎల్‌ వాటాలు 51 శాతానికి చేరాయి. 2003లోనే

పెరిగిన దేశీ విమాన ప్రయాణికుల రద్దీ

Wednesday 19th June 2019

మేలో 2.96 శాతం వృద్ధి ముంబై: దేశీ విమాన ప్రయాణికుల సంఖ్య ఏడాది ప్రాతిపదికన మే నెలలో 2.96 శాతం పెరిగింది. విమానయాన సంస్థలు సంయుక్తంగా 1.22 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి. గతేడాది ఇదే నెలలో విమాన ప్రయాణికుల సం‍ఖ్య 1.85 కోట్లుగా ఉంది. డీజీసీఏ తాజా గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 49 శాతం మార్కెట్‌ వాటాతో ఇండిగో ప్రథమ స్థానంలో ఉండగా.. స్పైస్‌జెట్‌ వాటా 13.1

Most from this category