News


కో-లొకేషన్‌ కేసులో మీ సమాధానం ఏమిటి?

Thursday 19th September 2019
Markets_main1568865420.png-28424

  • ఎన్‌ఎస్‌ఈ అధికారులకు శాట్‌ ఆదేశాలు

ముంబై: కో-లొకేషన్‌ కేసు విషయంలో తమ వాదనలను సమగ్రంగా (రీజాయిండర్స్‌) నాలుగువారాల్లో తెలియజేయాలని   స్టాక్‌ ఎక్స్చేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) అధికారులకు సెక్యూరిటీస్‌ అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ (శాట్‌) ఆదేశాలు జారీ చేసింది. అటు తర్వాత ఈ సమయాన్ని పెంచేదిలేదని స్పష్టం చేసింది. కేసు పరిష్కార తేదీన నవంబర్‌ 27గా ట్రిబ్యునల్‌ నిర్ణయించింది. ఎన్‌ఎస్‌ఈ సీఈఓగా పనిచేసిన చిత్రా రామకృష్ణన్‌ కూడా ఈ ఆదేశాలు అందుకున్న వారిలో ఉన్నారు.  

ఏమిటి ఈ కో-లొకేషన్‌...
ఇది 2015ల్లో దాఖలైన ఒక ఫిర్యాదుకు సంబంధించిన అంశం. అప్పట్లో మార్కెట్‌ రెగ్యులేటర్‌  సెక్యూరిటీస్‌ ఎక్సే‍్చంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా  (సెబీ)కు ఒక విజిల్‌బ్లోయర్‌ (వేగు)  ఫిర్యాదుచేస్తూ, కొందరు బడా ట్రేడర్లు, బ్రోకర్లకు నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) తన సర్వర్ల ప్రిఫరెన్షియల్‌ యాక్సెస్‌ (ముందస్తు అందుబాటు)కు అనుమతించిందని ఆరోపించారు. దీనివల్ల  వారు తమ సర్వర్లను ఎన్‌ఎస్‌ఈలోనే ఏర్పాటుచేసుకునేందుకు వీలుకలుగుతుంది. వారికి మార్కెట్‌ డేటా కొంత ముందుగానే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. కొందరి ఇన్వెస్టర్ల నష్టాలకు మరికొందరి లాభాలకు ఇది దారితీస్తుంది. సమగ్ర విచారణ అనంతరం ఈ ఆరోపణలను నిర్ధారిస్తూ, ఏప్రిల్‌ 30న సెబీ 400 పేజీలతో కూడిన ఐదు వేర్వేరు ఉత్తర్వ్యులను జారీచేసింది.  ట్రేడింగ్‌ అవకతవకల విధానానికి గాను 12 శాతం వడ్డీసహా దాదాపు  రూ.1,000 కోట్లు ఇన్వెస్టర్‌ ప్రొటక‌్షన్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ ఫండ్‌కు పునఃచెల్లింపులు జరపాలని ఆదేశించింది.   మార్కెట్ల కార్యకలాపాల నుంచి కూడా ఆరు నెలల పాటు నిషేధించడంతో ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ ప్రణాళికలనూ ఇది దెబ్బతీసింది. 2010 జూన్‌ నుంచి 2014 మార్చి వరకూ పొందిన తమ వేతనాల నుంచి 25 శాతం తిరిగి చెల్లించాలని కూడా  చిత్రా రామకృష్ణన్‌తోపాటు మాజీ సీఈఓ రవి నారాయణ్‌, మరో ఇరువురు అధికారులను సెబీ ఆదేశించింది.  అయితే ఈ ఉత్తర్వులను సవాలుచేస్తూ,  ఎన్‌ఎస్‌ఈ అలాగే సంబంధిత అధికారులు మే 20న శాట్‌ను ఆశ్రయించారు. ప్రిఫరెన్షియల్‌ యాక్సిస్‌ వల్ల ఏ ట్రేడింగ్‌ సభ్యుడూ అయాచిన ప్రయోజనం పొందలేదని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించి తగిన అన్ని పత్రాలూ నాలుగువారాల్లో సమర్పించాన్నది తాజా శాట్‌ ఆదేశం. సంబంధిత రీజాయిండర్స్‌ అన్నింటినీ ఎన్‌ఎస్‌ఈ ఇప్పటికీ సమర్పించింది. You may be interested

71.35 వద్ద ప్రారంభమైన రూపీ

Thursday 19th September 2019

దేశీయ కరెన్సీ రూపీ డాలర్‌ మారకంలో గురువారం 11 పైసలు కోల్పోయి 71.35 వద్ద ప్రారంభమైంది. కాగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గడంతో గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 54 పైసలు బలపడి 71.24 వద్ద ముగిసింది. దీంతో రూపీ  వరుస రెండు రోజుల నష్టాలకు బ్రేక్‌ వేసినట్టయ్యింది.

ఆర్థిక మందగమనం లేదు

Thursday 19th September 2019

పన్నులు తగ్గించేందుకు కంపెనీల ఎత్తుగడలే బీహార్‌ డిప్యూటీ సీఎం సుశీల్‌మోదీ పాట్నా: దేశం ఆర్థిక మందగమనాన్ని ఏమీ ఎదుర్కోవడం లేదన్నారు బీహార్‌ ఉపముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్‌ నేత సుశీల్‌కుమార్‌ మోదీ. తయారీ పడిపోతుందని చూపిస్తూ పన్నులు తగ్గించాలంటూ ప్రభుత్వంపై కంపెనీలు ఒత్తిడి తీసుకొచ్చేందుకు అనసరిస్తున్న ఎత్తుగడలుగా దీన్ని అభివర్ణించారు. తన వాదనకు మద్దతుగా బీహార్‌లో పార్లే జీ బిస్కట్ల డిమాండ్‌ పెరగడాన్ని ఆయన ప్రస్తావించారు. బిహార్‌ ఆర్థిక మంత్రిత్వ బాధ్యతలను సుశీల్‌మోదీయే చూస్తున్నారు.

Most from this category