ఎస్ఏపీకి సీఈవో మెక్‌డెర్మాట్ గుడ్‌బై
By Sakshi

- నూతన సీఈవోగా జెన్నిఫర్మోర్గాన్
బెర్లిన్: జర్మనీకి చెందిన వ్యాపార సాఫ్ట్వేర్ దిగ్గజం ‘ఎస్ఏపీ’కి దశాబ్ద కాలం పాటు సీఈవోగా పనిచేసిన అమెరిన్ వ్యాపారవేత్త బిల్ మెక్ డెర్మాట్ శుక్రవారం తన పదవి నుంచి తప్పుకున్నారు. తన పదవీ కాలాన్ని పొడిగించుకోకూడదని మెక్‌డెర్మాట్ నిర్ణయించుకున్నారని, తన బాధ్యతల నుంచి తప్పుకున్నారని ఎస్ఏపీ ప్రకటించింది. బోర్డు సభ్యురాలు జెన్నిఫర్ మోర్గాన్‌ను సీఈవోగా, మరో సభ్యుడు క్రిస్టియన్ క్లీన్ను సహ సీఈవోగా నియమిస్తున్నట్టు ఎస్ఏపీ తెలిపింది. 2002లో ఎస్ఏపీలో మెక్‌డెర్మాట్ చేరారు. 2008లో కంపెనీ బోర్డులో చోటు సంపాదించిన ఆయన 2010 నుంచి సీఈవోగా పనిచేశారు. ఉన్నట్టుండి ఆయన తప్పుకోవడానికి కారణాన్ని కంపెనీ వెల్లడించలేదు. వాస్తవానికి డెర్మాట్ కాంట్రాక్టు 2021 వరకు ఉంది. నూతన నాయకత్వానికి బాధ్యతల బదిలీ సాఫీగా జరిగేందుకు గాను ఈ ఏడాది చివరి వరకు డెర్మాట్ సలహాదారుగా వ్యవహరిస్తారని ఎస్ఏపీ పేర్కొంది. ‘‘ఎంతో బలమైన కంపెనీని తదుపరి దశకు తీసుకెళ్లాలని ప్రతీ సీఈవోకు కల ఉంటుంది. ఇప్పుడు తదుపరి చాప్టర్‌ను ఆరంభించాం’’ అని మెక్‌డెర్మాట్ ట్వీట్ చేశారు.
You may be interested
‘అప్పు’డే వద్దు..!
Saturday 12th October 2019- రుణాలు తీసుకోవడానికి వెనుకంజ... - సెప్టెంబర్‌లో రుణ వృద్ధి 8.79 శాతమే... - సింగిల్ డిజిట్లోకి రావడం ఈ ఏడాది ఇదే తొలిసారి ముంబై: బ్యాంకులు ఒకపక్క వడ్డీరేట్లు తగ్గిస్తున్నప్పటికీ.. రుణాలు తీసుకోవడానికి మాత్రం పెద్దగా ఎవరూ ఆసక్తి చూపడంలేదు. వినియోగ డిమాండ్ బలహీనంగా ఉందనడానికి, అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ తీవ్ర మందగమనానికి బలమైన నిదర్శనంగా బ్యాంకింగ్ రుణ వృద్ధి ఘోరంగా పడిపోతోంది. సెప్టెంబర్ 27తో ముగిసిన పక్షానికి(15 రోజుల వ్యవధి) రుణ
పరిశ్రమలు.. కకావికలం!
Saturday 12th October 2019- ఆగస్టులో ఉత్పాదకత 1.1 శాతం క్షీణత - ఏడేళ్లలో అత్యంత ఘోరమైన పనితీరు - క్యాపిటల్ గూడ్స్, కన్జూమర్ డ్యూరబుల్స్ భారీ పతనం - తయారీ, విద్యుత్, మైనింగ్ అన్నీ పేలవమే... న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి ఆగస్టులో దారుణ పతనాన్ని నమోదుచేసుకుంది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో అసలు వృద్ధిలేకపోగా -1.1 శాతం క్షీణత నమోదయ్యింది. ఉత్పత్తి క్షీణతలోకి జారడం రెండేళ్ల తరువాత ఇదేకాగా, అదీ ఇంత స్థాయిలో క్షీణత నమోదుకావడం ఏడేళ్ల తరువాత