News


చైనాలో తయారీకి శాంసంగ్ గుడ్‌బై

Thursday 3rd October 2019
news_main1570075206.png-28687

  • భారత్‌, వియత్నాంలో మొబైల్స్ ప్లాంట్ల విస్తరణ
  • చైనాలో తీవ్రమైన పోటీ, వ్యయాలే కారణం

సియోల్‌: పెరుగుతున్న వ్యయాలు, ఆర్థిక మందగమనం, తీవ్రమైన పోటీ తదితర అంశాల కారణంగా చైనా నుంచి దిగ్గజ కంపెనీలు ఒక్కొక్కటిగా వైదొలుగుతున్నాయి. తాజాగా శాంసంగ్ ఎలక్ట్రానిక్స్‌ కూడా చైనాలో తమ మొబైల్ ఫోన్స్ తయారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దేశీయంగా పోటీ తీవ్రంగా పెరిగిపోతుండటమే ఇందుకు కారణంగా పేర్కొంది. గతేడాదే ఒక ఫ్యాక్టరీలో కార్యకలాపాలు నిలిపివేసిన శాంసంగ్‌ ఇటీవల జూన్‌లో మరో ప్లాంటులో ఉత్పత్తి ఆపివేసింది. ప్రస్తుతం హువైజూలోని చివరి ప్లాంటును కూడా మూసివేస్తున్నట్లు వెల్లడించింది. ఇటీవలే బీజింగ్‌లోని స్మార్ట్‌ఫోన్స్‌ ప్లాంటును మూసివేసిన మరో పోటీ సంస్థ సోనీ.. థాయ్‌ల్యాండ్‌లో మాత్రమే తయారీ కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో శాంసంగ్‌ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. అటు చైనాలో తయారీ నిలిపివేస్తున్న శాంసంగ్.. ఇటు భారత్‌, వియత్నాం దేశాల్లో తమ ప్లాంట్ల సామర్ధ్యాన్ని మరింతగా పెంచుకోవడంపై దృష్టి పెడుతోంది. దీంతో ఈ దేశాల మార్కెట్లు శాంసంగ్‌కు మరింత కీలకంగా మారుతున్నాయి. 

1 శాతానికి పడిపోయిన వాటా...
చైనాలో దేశీ కంపెనీలైన హువావే టెక్నాలజీస్‌, షావోమీ సంస్థల నుంచి శాంసంగ్‌కు గట్టి పోటీ ఎదురవుతోంది. చౌక ఫోన్లు కావాలనుకునే చైనీయులు.. దేశీ స్మార్ట్‌ఫోన్లను, కాస్త ఖరీదైనవి కోరుకునే వారు యాపిల్ లేదా హువావే వంటి సంస్థల మొబైల్స్ కొనుగోలు చేస్తున్నారు. దీంతో 2013లో చైనాలో దాదాపు 15 శాతంగా నమోదైన శాంసంగ్ మార్కెట్ వాటా ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 1 శాతానికి పడిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇక చైనా మార్కెట్లో శాంసంగ్ పుంజుకునే అవకాశాలు కూడా కనిపించడం లేదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, చైనాలో తయారీ నిలిపివేసినప్పటికీ.. మొబైల్స్ అమ్మకాలు యధాప్రకారం కొనసాగుతాయని శాంసంగ్ పేర్కొంది. ఉత్పత్తికి సంబంధించిన యంత్రాలు, పరికరాలను అంతర్జాతీయంగా ఇతర సైట్లకు తరలిస్తున్నట్లు వివరించింది. కంపెనీ అధికారికంగా వెల్లడించనప్పటికీ, 2017 నాటి గణాంకాల ప్రకారం.. చైనాలో శాంసంగ్‌ ఉద్యోగులు సుమారు 6,000 మంది ఉండగా, 6.3 కోట్ల యూనిట్లు ఉత్పత్తి చేసింది. ఆ ఏడాది అంతర్జాతీయంగా శాంసంగ్ 39.4 కోట్ల హ్యాండ్‌సెట్స్‌ను తయారు చేసింది. 



You may be interested

సైబర్‌ మోసాలపై టెకీల పోరు

Thursday 3rd October 2019

ఎంఎంటీ, స్విగీ, జొమాటో, పేటీఎం జట్టు ఆర్‌బీఐతో భేటీ మోసాల నివారణ చర్యలపై సమీక్ష టెల్కోలు, గూగుల్‌తో కూడా చర్చలు బెంగళూరు: సైబర్‌ మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు టెక్నాలజీ సంస్థలు రంగంలోకి దిగుతున్నాయి. ట్రావెల్‌ సేవల సంస్థలు మేక్‌మైట్రిప్‌ గ్రూప్, ఓయో హోటల్స్‌ అండ్‌ హోమ్స్‌.. మొబైల్‌ చెల్లింపుల సంస్థ పేటీఎం, ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ యాప్స్‌ స్విగీ, జొమాటోలతో పాటు ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్‌ మొదలైనవి ఇందుకోసం జట్టు

యస్ బ్యాంకుపై పూర్తి నమ్మకం ఉంది

Thursday 3rd October 2019

ప్రమోటరు అశోక్ కపూర్ కుటుంబం స్పష్టీకరణ ముంబై: మొండిబాకీలు, ఇతర వివాదాలతో షేరు జీవితకాల కనిష్ట స్థాయికి పడిపోయినప్పటికీ యస్‌ ‍బ్యాంకును గట్టెక్కించే అంశంలో మేనేజ్‌మెంట్‌పై తమకు పూర్తి నమ్మకం ఉందని సహ ప్రమోటరు అశోక్ కపూర్ కుటుంబం స్పష్టం చేసింది. "యస్‌ బ్యాంకుకు మా పూర్తి మద్దతు ఉంది. బ్యాంకు మేనేజ్‌మెంటుపై పూర్తి నమ్మకం ఉంది" అని అశోక్ కపూర్ కుమార్తె షగున్ గోగియా తెలిపారు. మరో ప్రమోటరు రాణా

Most from this category