News


శాంసంగ్‌లో నియామకాలు

Thursday 28th November 2019
news_main1574912346.png-29912

  • 1200 మందికి ఉద్యోగాలు

న్యూఢిల్లీ: ప్రస్తుత ఏడాదిలో 1200 మంది ఇంజినీరింగ్ పట్టబద్రులను ఉద్యోగాల్లోకి తీసుకోనున్నట్లు ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజ సంస్థ శాంసంగ్‌ బుధవారం ప్రకటించింది. పరిశోధన, అభివృద్ధి కేంద్రాల్లో పనిచేయడం కోసం వీరిని ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఎస్‌సీల నుంచి ఎంపికచేయనున్నట్లు వెల్లడించింది. బెంగళూరు, నోయిడా, ఢిల్లీ కేంద్రాల్లో నియామకాలు ఉంటాయని వివరించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఇమేజ్ ప్రాసెసింగ్, క్లౌడ్, ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్, రికగ్నిషన్ సిస్టమ్స్, డేటా అనాలిసిస్, ఆన్‌డెవైస్ ఏఐ, మొబైల్ కమ్యూనికేషన్స్, నెట్‌వర్క్స్‌, యూజర్ ఇంటర్‌ఫేస్ వంటి విభాగాల్లో వీరు పనిచేయాల్సి ఉంటుందని పేర్కొంది. 



You may be interested

బెంగళూరులో ష్నైడర్ ఎలక్ట్రిక్ ఫ్యాక్టరీ

Thursday 28th November 2019

గ్లోబల్ ఎనర్జీ మేనేజ్‌మెంట్ అండ్ ఆటోమేషన్ కంపెనీ ష్నైడర్ ఎలక్ట్రిక్.. తాజాగా బెంగళూరులో స్మార్ట్‌ ఫ్యాక్టరీని ప్రారంభించింది. పరిశ్రమలకు అవసరమైన యూపీఎస్ సిస్టమ్స్‌, విద్యుత్ మోటారు భ్రమణ వేగాన్ని నియంత్రించే వేరియబుల్‌ స్పీడ్‌ వంటి వాటిని ఇక్కడ ఉత్పత్తి చేయనుంది. నూతన ఫ్లాంట్‌ కోసం 700 మందిని నియమించుకున్నట్లు బుధవారం ప్రకటించింది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలోనే హైదరాబాద్‌లో ఈ సంస్థ ఫ్యాక్టరీని ప్రారంభించింది. 2020 చివరినాటికి ప్రపంచవ్యాప్తంగా 100

భారత్‌లో మాంద్యం లేదు

Thursday 28th November 2019

ఆర్థికమంత్రి సీతారామన్‌ స్పష్టీకరణ బడ్జెట్‌ చర్యలు సత్ఫలితాలు  ఇస్తున్నట్లు వెల్లడి న్యూఢిల్లీ: భారత్‌ ఆర్థిక వ్యవస్థలో మాంద్యం లేదని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతరామన్‌ బుధవారం స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థ నెమ్మదించి వుండవచ్చుకానీ మాంద్యంలోకి మాత్రం జారిపోదని ఆమె స్పష్టం చేశారు. రాజ్యసభలో ఆర్థిక వ్యవస్థపై జరిగిన చర్చకు ఆమె ఈ సమాధానం ఇచ్చారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి తన మొదటి బడ్జెట్‌లో పలు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఆయా అంశాలు

Most from this category