News


మార్కెట్లోకి సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్‌20 సీరిస్‌ ఫోన్లు!

Wednesday 12th February 2020
news_main1581498573.png-31728

దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్‌ దిగ్గజ కంపెనీ సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్‌20 సిరీస్‌ ఫోన్లను బుధవారం అంతర్జాతీయంగా విడుదల చేసింది. గెలాక్సీ ఎస్‌ సిరీస్‌లో గెలాక్సీ ఎస్‌20, ఎస్‌20 ప్లస్‌, ఎస్‌20 అల్ట్రాతో పాటు మరో నూతన ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ గెలాక్సీ జడ్‌ ఫ్లిప్‌ను తాజాగా విడుదల చేసింది. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి 12:30 గంటలకు శాన్‌ ఫ్రాన్సిస్కోలో నిర్వహించిన గెలాక్సీ అన్‌ప్యాక్డ్‌-2020 ఈవెంట్‌లో ఈ ఫోన్లను విడుదల చేసింది. కాగా  గెలాక్సీ సిరీస్‌లో వచ్చిన ‘ఎస్‌10’కు  ఎస్‌ 20 అప్‌డేటెడ్‌ ఫోన్‌ అని చెప్పొచ్చు. దీన్ని మొదట్లో ‘గెలాక్సీ ఎస్‌11’గా విడుదల చేయాలనుకున్నారు. కానీ ‘‘ఎస్‌ 20’ సిరీస్‌లో గెలాక్సీ ఎస్‌20, ఎస్‌ 20 ప్లస్‌, ఎస్‌ 20 అల్ట్రా’’ పేరుతో మూడు మోడల్‌లు తీసుకొస్తుండడంతో ఎస్‌10కు బదులు ఎస్‌ 20గా విడుదల చేసింది. 

అప్‌డేటెడ్‌ ఫీచర్లెన్నో
ప్రస్తుత స్మార్ట్‌ఫోన్ల మార్కెట్లో పోటీ తీవ్రత ఎక్కువగా ఉండడంతో యాపిల్‌, వన్‌ప్లస్‌ వంటి ఫోన్లకు దీటుగా ఎదుర్కొనేందుకు ఎస్‌20 సిరీస్‌లో అనేక ఫీచర్లను అందిస్తోంది.

  • గెలాక్సీ ఎస్‌20 ఫోన్‌లో 6.2 ఇంచుల క్వాడ్‌ హెచ్‌డీ ప్లస్‌ డైనమిక్‌ అమొలైడ్‌ 2 ఎక్స్‌ ఇన్ఫినిటీ-ఓ డిస్‌ప్లేను ఏర్పాటు చేయగా, ఎస్‌20 ప్లస్‌లో 6.7 ఇంచుల సైజ్‌ ఉన్న అదే తరహా డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 
  • రెండు ఫోన్ల డిస్‌ప్లేలు 120హెడ్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌ను కలిగి ఉన్నాయి. ఈ ఫోన్లలో ఆయా దేశాల మార్కెట్లకు అనుగుణంగా స్నాప్‌డ్రాగన్‌ 865 లేదా ఎగ్జినోస్‌ 990 ప్రాసెసర్‌లు లభిస్తాయి. వీటిలో 5జీ ఫీచర్‌ను ఆప్షనల్‌గా అందిస్తున్నారు. 
  • డిస్‌ప్లే కింది భాగంలో అల్ట్రాసోనిక్‌ ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ను ఏర్పాటు చేశారు. దీని వల్ల డివైస్‌లను వేగంగా అన్‌లాక్‌ చేసుకోవచ్చు. ఇంకా ఈ ఫోన్లలో ఆండ్రాయిడ్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పాటు సాంసంగ్‌ బిక్స్‌బీ, సాంసంగ్‌ హెల్త్‌, సాంసంగ్‌ పే యాప్‌లు కూడా ఉన్నాయి.

64 మెగాపిక్సల్‌ టెలిఫొటో లెన్స్‌
సెల్పీ ప్రియులకు సాంసంగ్‌ ప్రత్యేకమైన ఫీచర్లను అందిస్తోంది. గెలాక్సీ ఎస్‌20 ఫోన్‌వెనుక భాగంలో 3 కెమెరాలను ఏర్పాటు చేశారు. 12 మెగా పిక్సల్‌ ప్రైమరీ సెన్సర్‌తోపాటు మరో 12 మెగాపిక్సల్‌ అల్ట్రా వైడ్‌ లెన్స్‌, 64 మెగాపిక్సల్‌ టెలిఫొటో లెన్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలకు ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌(ఓఐఎస్‌) ఫీచర్‌ను అందిస్తున్నందున ఫోన్‌ కదులుతున్నప్పటికీ ఫొటోలు షేక్‌ అవ్వకుండా వస్తాయి. గెలాక్సీ ఎస్‌20 ఫ్లస్‌లో ఈ కెమెరాలతోపాటు అదనంగా డెప్త్‌ సెన్సర్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్లకు ముందు భాగంలో 10 మెగాపిక్సల్‌ కెమెరాలను అమర్చడం వల్ల 8 కే వీడియోలను తీసుకోవచ్చు. ఇంకా ఈ ఫోన్లలో ఐపీ 68 వాటర్‌, డస్ట్‌ రెసిస్టెన్స్‌, 4000 బ్యాటరీ, 25 వాట్ల ఫాస్ట్‌ చార్జింగ్‌, ఫాస్ట్‌ వైర్‌లెస్‌ చార్జింగ్‌, వైర్‌లెస్‌​ పవర్‌షేర్‌ తదితర ఇతర ఫీచర్లు ఉన్నాయి.

ఫీచర్లకు తగ్గట్టుగానే ధరలు
గెలాక్సీ ఎస్‌20 4జీ వేరియెంట్ ధ‌ర 981 డాల‌ర్లు (దాదాపుగా రూ.69,980) ఉండ‌గా, 5జీ వేరియెంట్ ధ‌ర 999 డాల‌ర్లు (దాదాపుగా రూ.71,325)గా ఉంది. ఇక గెలాక్సీ ఎస్‌20 ప్లస్‌ 5జీ వేరియెంట్ 128జీబీ స్టోరేజ్ మోడ‌ల్‌ ధ‌ర 1199 డాల‌ర్లు (దాదాపుగా రూ.85,590) ఉండ‌గా, 512 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర 1299 డాల‌ర్లు (దాదాపుగా రూ.92,720)గా ఉంది. గెలాక్సీ ఎస్‌20 అల్ట్రా 5జి 12జీబీ + 128జీబీ మోడ‌ల్ ధ‌ర‌ 1399 డాల‌ర్లు (దాదాపుగా రూ.99,840) ఉండ‌గా, 16జీబీ + 512జీబీ వేరియెంట్ ధ‌ర 1499 డాల‌ర్లు (దాదాపుగా రూ.1,06,975)గా ఉంది. ఈ నెల 21వ తేదీ నుంచి  ప్రీ బుకింగ్స్‌ను ప్రారంభించి, మార్చి 6వ తేదీ నుంచి మార్కెట్‌లో విక్రయించనున్నారు.You may be interested

క్యూ3 ఓకే కానీ అప్‌ట్రెండ్‌కు చాన్స్‌ తక్కువే!!

Wednesday 12th February 2020

ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 18 పీఈలో ట్రేడవుతోంది కార్పొరేట్‌ ట్యాక్స్‌ కోతతో ఫలితాలు గుడ్‌ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌) ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే వెలువడ్డాయి. అయితే ఇప్పటికే ర్యాలీ చేసిన దేశీ స్టాక్‌ మార్కెట్లకు మరింత పుష్‌నిచ్చే అంశాలు కొరవడ్డాయంటున్నారు సిద్ధార్థ ఖేమ్కా. మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రిటైల్‌ రీసెర్చ్‌ హెడ్‌ సిద్ధార్థ. కార్పొరేట్‌ పన్ను తగ్గింపు కార్పొరేట్ల లాభదాకయతను పెంచినట్లు పేర్కొన్నారు. మార్కెట్లతోపాటు.. మెటల్స్‌, ఎన్‌బీఎఫ్‌సీ తదితర రంగాలపై ఒక

ఫలితాల షాక్‌..52 వారాల కనిష్టానికి భెల్‌

Wednesday 12th February 2020

ప్రభుత్వ రంగ ఇంజినీరింగ్‌ కంపెనీ భెల్‌ కంపెనీకి మూడో త్రైమాసిక ఫలితాలు షాక్‌నిచ్చాయి. క్యూ3 ఫలితాలు మార్కెట్‌ను నిరుత్సాహరపచడంతో షేరు బుధవారం ట్రేడింగ్‌లో ఏడాది కనిష్టానికి దిగివచ్చింది.  మంగళవారం మార్కెట్‌ ముగిసిన తరువాత కంపెనీ ఫలితాలను విడుదల చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ క్వార్టర్లో  నికరలాభం 17 శాతం తగ్గింది. గత క్యూ3లో రూ.196 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.162 కోట్లకు తగ్గింది. మొత్తం

Most from this category