News


భారత్‌ మార్కెట్లోకి గెలాక్సీ నోట్‌ ఎస్‌10 లైట్‌

Thursday 23rd January 2020
news_main1579765669.png-31135


దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ మొబైల్స్‌ తయారీ సంస్థ శామ్‌సంగ్‌ గతేడాది విడుదల చేసిన గెలాక్సీ నోట్‌ 10 కు అప్‌డేటెడ్‌ వెర్షన్‌ నోట్‌ 10 లైట్‌ను గురువారం వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఈరోజు మద్యహ్నాం 2 గంటలనుంచి అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ప్రారంభంకానున్నాయి. 6 జీబీ, 8జీబీ ర్యామ్‌లతో రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చిన ఈ ఫోన్‌ ఫిబ్రవరి 2 నుంచి అన్ని ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ స్టోర్లో  వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని శామ్‌సంగ్‌ ప్రకటించింది. 

ఎస్‌10 లైట్‌లో ఉన్న ఫీచర్లు
దీనిలో 6.7 అంగుళాల పుల్‌ హెచ్‌డీ ఇన్‌ఫినిటీ సూపర్‌ అమోల్డ్‌ ప్లస్‌డిస్‌ప్లే (1,080 x 2,400) రిజల్యుషన్‌ స్ర్కీన్‌ ఉంది. 6 జీబీ/8జీబీ ర్యామ్‌ 128 జీబీ ఇంటర్నల్‌ మెమరీ సామర్థ్యంతో రెండు వేరియంట్లలో మొబైల్‌ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ మొబైల్‌ 2.7 గిగాహెట్జ్‌ ఎక్సినోస్‌ 9810 ఎస్‌ఓసీ ప్రొసెసర్‌పై పనిచేస్తుంది. ఇక దీనిలో 12 మెగా పిక్సల్‌ క్వాలిటీతో డ్యూయల్‌ పిక్సల్‌ ఆటోఫోకస్‌, వైడ్‌ యాంగిల్‌,టెలిఫొటోటెక్నాలజీతో మూడు కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీ కోసం ప్రత్యేకంగా 32 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా అమర్చారు. 4500 ఎంఏహెచ్‌ సామర్థ్యంతో యూఎస్‌బీ టైప్‌-సీ సపోర్ట్‌ చేసే సూపర్‌ఫాస్ట్‌ చార్జింగ్‌ బ్యాటరీతో పాటు బ్లూటూత్‌తో అనుసంధానమయ్యే ప్రత్యేకమైన ఇన్‌బిల్ట్‌ ఎస్‌ పెన్‌ను కూడా దీనిలో ఉంది. ఆండ్రాయిడ్‌ ఫోన్లలో ఉన్నట్లుగానే ఫోన్‌ను ఫింగర్‌ప్రింట్‌ స్కానర్‌,ఫేస్‌ అన్‌లాక్‌ ద్వారా ఫోన్‌ను ఓపెన్‌ చేయవచ్చు. ఇన్ని ఫీచర్లు ఉన్న ఎస్‌ 10 లైట్‌ తెలుపు,నలుపు, నీలం రంగులలో లభ్యంకానుంది. కాగా గెలాక్సీ ఎస్‌10 లైట్‌ ధర ఇండియాలో రూ.40 -45 వేల మధ్య ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.You may be interested

ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ 7 శాతం అప్‌.!

Thursday 23rd January 2020

ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ (ఐబీహెచ్‌ఎఫ్‌ఎల్‌) షేరు గురువారం మిడ్‌సెషన్‌ కల్లా 7శాతం లాభపడింది. నేడు ఈ షేరు బీస్‌ఈలో రూ.297.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఉదయం ట్రేడింగ్‌ నుంచి ఆర్థిక సర్వీసు షేర్ల ర్యాలీలో భాగంగా నేడు ఈ షేరుకు కూడా కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా ఒకదశలో 7.15శాతం లాభపడి రూ.317.45 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. మధ్యాహ్నం గం.1:15ని.లకు షేరు మునుపటి ముగింపు(రూ.296.25)తో పోలిస్తే రూ.296.25తో పోలిస్తే

ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ హైజంప్‌

Thursday 23rd January 2020

మూడు రోజుల వరుస నష్టాలకు చెక్‌ పెడుతూ సానుకూలంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు తదుపరి మరింత బలపడ్డాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో మధ్యాహ్నం 12.40 ప్రాంతంలో లాభాలతో కదులుతున్నాయి. సెన్సెక్స్‌ డబుల్‌ సెంచరీ చేసింది. 208 పాయింట్లు పెరిగి 41,324కు చేరింది. నిఫ్టీ సైతం 63 పాయింట్లు పుంజుకుని 12,169 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో ప్రోత్సాహకర ఫలితాల కారణంగా ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ కౌంటర్‌

Most from this category