News


సామ్‌సంగ్‌ ‘ఫోల్డ్‌’ వస్తోంది!

Wednesday 25th September 2019
news_main1569385131.png-28530

-అక్టోబరు 1న భారత మార్కెట్‌కు
-ధర సుమారు రూ.1.50 లక్షలు

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ప్రపంచంలో తొలిసారిగా ఫోల్డబుల్‌ మొబైల్‌ డివైస్‌ను ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం సామ్‌సంగ్‌ అభివృద్ధి చేసింది. గెలాక్సీ ఫోల్డ్‌ పేరుతో స్మార్ట్‌ఫోన్‌గానూ, ట్యాబ్లెట్‌ పీసీగానూ వినియోగించుకునే వీలుగా ఈ ఉపకరణాన్ని తయారు చేసింది. మొత్తం ఆరు కెమెరాలు పొందుపరిచారు. 7.3 అంగుళాల ఇన్ఫినిటీ ఫ్లెక్స్‌ డిస్‌ప్లేతో రూపొందింది. ముందువైపు 10 మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరా, 8 ఎంపీ ఆర్‌జీబీ డెప్త్‌ కెమెరా, వెనుకవైపు 16 ఎంపీ అల్ట్రా వైడ్‌, 12 ఎంపీ వైడ్‌ యాంగిల్‌, 12 ఎంపీ టెలిఫోటో కెమెరాలు ఏర్పాటు చేశారు. కవర్‌ వైపు 4.6 అంగుళాల తెర ఉంది. 10 ఎంపీ సెల్ఫీ కెమెరా పొందుపరిచారు. ఉపకరణం తెరిచినప్పుడు 7.3 అంగుళాల తెరతో ట్యాబ్లెట్‌ పీసీ మాదిరిగా, మూసినప్పుడు 4.6 అంగుళాల తెరతో స్మార్ట్‌ఫోన్‌ వలె ఉపయోగించొచ్చు. 5జీ టెక్నాలజీతో 12 జీబీ ర్యామ్‌, 512 జీబీ ఇంటర్నల్‌ మెమరీ, 7 నానోమీటర్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 855 ఆక్టాకోర్‌ చిప్‌ వంటి ఫీచర్లున్నాయి. 4,380 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది.
వారం రోజుల్లో భారత్‌కు..
సామ్‌సంగ్‌ ఈ నూతన ఉపకరణాన్ని దక్షిణ కొరియాలో ఇటీవలే ఆవిష్కరించింది. యూఎస్‌లో ఈ నెల 27న అడుగుపెడుతోంది. భారత మార్కెట్లో అక్టోబరు 1న విడుదలకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఇక్కడ గెలాక్సీ ఫోల్డ్‌ ధర సుమారు రూ.1.50 లక్షలు ఉండే అవకాశం ఉంది. గ్యాడ్జెట్‌ కావాల్సినవారు ముందుగా బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎంపిక చేసిన ఔట్‌లెట్లలో కూడా లభిస్తుంది. ఫోల్డ్‌ వినియోగదార్లకు ప్రత్యేక కస్టమర్‌ కేర్‌ సర్వీసులు ఉంటాయి. సామ్‌సంగ్‌ నిపుణులతో సంప్రదించవచ్చు. స్పేస్‌ సిల్వర్‌, కాస్మోస్‌ బ్లాక్‌ రంగుల్లో రూపొందించారు.

 You may be interested

సీనియర్‌ సిటిజన్‌ స్కీమ్‌కు పన్ను మినహాయింపు..

Wednesday 25th September 2019

-ఇవ్వాలని ప్రభుత్వానికి ఎస్‌బీఐ ఎకోరాప్‌ సూచన -ద్రవ్యలోటుపై ప్రభావం పరిమితమేనని అభిప్రాయం న్యూఢిల్లీ: పెద్దల పొదుపు పథకం (సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌) కింద ఆర్జించే వడ్డీ రాబడిపై ఆదాయపన్ను మినహాయింపు ఇవ్వడాన్ని ప్రభుత్వం పరిశీలించాలని ఎస్‌బీఐ ఎకోరాప్‌ నివేదిక సూచించింది. దీనివల్ల ద్రవ్యలోటుపై ప్రభావం పరిమితమేనని పేర్కొంది. సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఎస్‌సీఎస్‌ఎస్‌) కింద ఒకరు రూ.15 లక్షలను గరిష్టంగా డిపాజిట్‌ చేసుకోవచ్చు. కాకపోతే 60 ఏళ్లు, ఆ పైన

పీఎంసీ బ్యాంకుపై ఆర్‌బీఐ ఆంక్షలు

Wednesday 25th September 2019

-పెద్ద ఎత్తున ఎన్‌పీఏల దాచివేత  -ఎన్నో నిబంధనల ఉల్లంఘన -వెలుగు చూడడంతో ఆరు నెలలపాటు ఆంక్షలు -ఒక్కో ఖాతా నుంచి రూ.1,000 మాత్రమే ఉపసంహరణ ముంబై: ముంబై కేంద్రంగా, పలు రాష్ట్రాల్లోని పట్టణాల్లో కార్యకలాపాలు నిర్వహించే.. పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కోపరేటివ్‌ (పీఎంసీ) బ్యాంకుపై ఆరు నెలల పాటు ఆంక్షలు విధిస్తూ ఆర్‌బీఐ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వసూలు కాని మొండి బకాయిలను (ఎన్‌పీఏలు) తక్కువగా చూపించడంతోపాటు పీఎంసీలో ఎన్నో నిబంధనల ఉల్లంఘనను ఆర్‌బీఐ

Most from this category