News


తగ్గిన ప్యాసింజర్‌ వాహన విక్రయాలు

Tuesday 2nd July 2019
news_main1562052453.png-26735

  • మారుతీ మినీ సెగ్మెంట్‌ 36.2 % క్షీణత
  • 27 % తగ్గిన టాటా మోటార్స్‌ అమ్మకాలు

న్యూఢిల్లీ: దేశీ వాహన రంగం ప్రతికూల వాతావరణంలో ప్రయాణిస్తోంది. వరుసగా గతనెల్లోనూ ప్యాసింజర్‌ వాహనాల (పీవీ) విక్రయాలు క్షీణతను నమోదుచేశాయి. ఈ విభాగంలోనే మార్కెట్ లీడరైన మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్‌ఐ) జూన్‌ దేశీ అమ్మకాలు ఏకంగా 15.3 శాతం తగ్గిపోయాయి. కంపెనీ మినీ సెగ్మెంట్‌ 36.2 శాతం క్షీణించింది. వినియోగదారుల సెంటిమెంట్‌ బలహీనపడిన నేపథ్యంలో దేశీ ఆటో పరిశ్రమ అమ్మకాల్లో తగ్గుదల నమోదవుతూనే ఉందని టయోటా కిర్లోస్కర్ మోటార్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ రాజా అన్నారు. ఆర్థిక వ్యవస్థ నెమ్మదించడం, రుతుపవనాలపై అనిశ్చితి, అధిక వడ్డీ, ద్రవ్య లభ్యత సమస్య, బీఎస్‌-సిక్స్‌ అమలు వంటి ప్రతికూల అంశాలు సెంటిమెంట్‌ను బలహీపర్చాయన్నారు. మొత్తం ఆటో ఇండస్ట్రీ కంటే పీవీ అమ్మకాల పరంగా సెంటిమెంట్‌ మరింత బలహీనంగా ఉందని ఎం అండ్‌ ఎం ప్రెసిడెంట్‌ (ఆటోమోటివ్‌ సెక్టార్‌) రాజన్‌ వాధేరా అన్నారు. పరిశ్రమ ఇప్పటికీ ఒత్తిడిలోనే కొనసాగుతుండగా.. మార్కెట్ మాత్రం త్వరలోనే తిరిగి కోలుకుంటుందని భావిస్తున్నట్లు చెప్పారు. 



You may be interested

ఎల్‌ఐసీ రికార్డు స్థాయి ఫలితాలు

Tuesday 2nd July 2019

2018-19లో నూతన ప్రీమియం ఆదాయం రూ.1.42 లక్షల కోట్లు అంతక్రితం సంవత్సరంతో పోలిస్తే 6 శాతం వృద్ధి ముంబై: బీమా రంగ దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) గత ఆర్థిక సంవత్సరంలో అన్ని విభాగాల్లో మంచి పనితీరు ప్రదర్శించింది. ముఖ్యంగా తొలి ప్రీమియం ఆదాయం (కొత్త పాలసీల రూపంలో వచ్చేది) 5.68 శాతం వృద్ధితో రూ.1,42,191.69 కోట్లుగా నమోదైంది. కంపెనీ చరిత్రలో ఒక ఆర్థిక సంవత్సరంలో తొలి ఏడాది ప్రీమియం ఆదాయం

జీవీకే ఎయిర్‌పోర్ట్స్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురు

Tuesday 2nd July 2019

వాటా విక్రయానికి బిడ్‌వెస్ట్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఈ వాటా కొనుగోలు రేసులో అదానీ హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ముంబై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో వాటాను 74 శాతానికి పెంచుకోవాలనుకున్న జీవీకే ఎయిర్‌పోర్ట్స్‌ హోల్డింగ్స్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. కోర్టు తీర్పుతో దక్షిణాఫ్రికాకు చెందిన బిడ్‌వెస్ట్‌ గ్రూప్‌నకు ఊరట లభించింది. ముంబై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో (ఎంఐఏఎల్‌) ఈ గ్రూప్‌ కంపెనీ అయిన బిడ్‌ సర్వీసెస్‌ డివిజన్‌కు (మారిషస్‌) ఉన్న 13.5 శాతం వాటాను థర్డ్‌ పార్టీకి విక్రయించుకోవచ్చని

Most from this category