News


పెట్టుబడుల ఉపసంహరణకు ముందే ఆస్తుల విక్రయం

Thursday 6th February 2020
news_main1580962552.png-31548

న్యూఢిల్లీ: పెట్టుబడుల ఉపసంహరణకు ముందే కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకు సంబంధించి మిగులు భూములు ఏవైనా ఉంటే మార్కెట్‌ రేటుకు ఆయా రాష్ట్రాలు లేదా ప్రయివేటు పార్టీలకు విక్రయించనున్నట్టు కేంద్రం బుధవారం స్పష్టం చేసింది. పెట్టుబడుల ఉపసంహరణ విధానాన్ని పారదర్శకంగా నిర్వహిస్తామని రాజ్యసభలో ఓ సభ్యుని ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు. హెచ్‌పీసీఎల్‌, ఆర్‌ఈసీ సహా 28 కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం గతంలో సూత్రప్రాయ ఆమోదం తెలిపినట్టు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకు రాష్ట్రాలు పెద్ద ఎత్తున భూములను ఇచ్చినట్టయితే, ఒకవేళ ఆయా కంపెనీల్లో వాటాలు ఉపసంహరించుకునే సమయంలో భూమూలును తిరిగి వెనక్కి ఇచ్చేస్తారా? అన్న ప్రశ్న ఎదురుకాగా.. ప్రభుత్వరంగ సంస్థలకు భూములను విరాళంగా ఏమీ ఇవ్వలేదని మంత్రి బదులిచ్చారు. ఒక డీల్‌లో భాగంగా రాష్ట్రాలు భూములను ఇచ్చాయని, అందుకు సంబంధించి పరిహారం కూడా చెల్లించడం జరిగిందన్నారు. 



You may be interested

మార్చి చివరికి పీఎస్‌యూ బీమా కంపెనీల విలీనం

Thursday 6th February 2020

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని సాధారణ బీమా సంస్థలు.. నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ, యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీ, ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీల విలీనాన్ని మార్చి చివరికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నట్టు కేంద్ర ఆర్థిక శాఖా కార్యదర్శి రాజీవ్‌కుమార్‌ వెల్లడించారు. ఈ మూడు కంపెనీల బోర్డులు విలీనానికి ఇప్పటికే సూత్రప్రాయ ఆమోదం తెలియజేసినట్టు తెలిపారు. ‘‘విలీనం పురోగతి దశలో ఉంది. త్వరలోనే ఇది సాకారం కావడాన్ని చూస్తాం. ఇప్పటికే ఇది కేబినెట్‌

ఆర్‌బీఐ ఏం చేస్తుందో!?

Thursday 6th February 2020

నేడు సమీక్షా సమావేశ ఫలితాలు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ద్వైమాసిక సమీక్షా సమావేశం గురువారం ముగియనుంది. ఈ దఫా ఆర్‌బీఐ ఎంపీసీ మీటింగ్‌లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని నిపుణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత మీటింగ్‌లో మార్కెట్లు రేట్‌ కట్‌ ఆశల్లో ఉండగా, కమిటీ సభ్యులంతా రేట్లు యథాతధంగా ఉంచేందుకు ఓట్‌ చేశారు. ద్రవ్యోల్బణ గణాంకాలను నిశితంగా పరిశీలించాలని, తదుపరి రేట్‌కట్స్‌ను ధరల ఆధారంగా పరిశీలించాలని ఆర్‌బీఐ అప్పుడు భావించింది. అప్పటి

Most from this category