News


కోకాపేటలో ఐదెకరాలు కొన్న సాలార్‌పురియా

Wednesday 29th January 2020
news_main1580277385.png-31297

  • ఒమాక్సె నుంచి రూ.650 కోట్లకు కొనుగోలు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: బెంగళూరుకు చెందిన ప్రముఖ నిర్మాణ రంగం సంస్థ సాలార్‌పురియా సత్వా కోకాపేటలో 25 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. న్యూఢిల్లీకి చెందిన రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ కంపెనీ ఒమాక్సె గ్రూప్‌ నుంచి రూ.650 కోట్ల వ్యయంతో ఈ స్థలాన్ని కొనుగోలు చేసినట్లు తెలిసింది. సాలార్‌పురియా ప్రస్తుతం హైదరాబాద్‌లో 1.3 కోట్ల చ.అ.ల్లో కమర్షియల్‌ స్పేస్‌ను అభివృద్ధి చేస్తోంది. వచ్చే రెండేళ్లలో హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో 2.4 కోట్ల చ.అ. కమర్షియల్‌ స్పేస్‌కు చేరుకోవాలని లక్ష్యించింది. దీనికి తాజా కొనుగోలు ఉపకరించనుంది. 



You may be interested

కరోనా ఎఫెక్ట్‌- కెమికల్‌ కంపెనీలకు బెనిఫిట్‌?!

Wednesday 29th January 2020

ఏడాది గరిష్టాలకు స్పెషాలిటీ కెమికల్‌ షేర్లు 6 శాతం జంప్‌చేసిన ఫైన్‌ ఆర్గానిక్‌ 3 శాతం లాభపడిన నవీన్‌ ఫ్లోరిన్‌ కొద్ది రోజులుగా ప్రపంచ దేశాలను వణికిస్తున్న చైనీస్‌ కరోనా వైరస్‌ దేశీ కంపెనీలకు లబ్ది చేకూర్చనుందా.. అంటే అవుననే అంటున్నారు మార్కెట్‌ విశ్లేషకులు. చైనీస్ హుబే ప్రొవిన్స్‌లో పుట్టిన కరోనా వైరస్‌ కారణంగా దేశీయంగా స్పెషాలిటీ కెమికల్స్‌ కంపెనీలకు ఆర్డర్లు పెరిగే వీలున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. గత కొంతకాలంగా పటిష్ట పనితీరును

నేటి వార్తల్లోని షేర్లు

Wednesday 29th January 2020

  వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం స్టాక్‌మార్కెట్‌లో ప్రభావితమయ్యే షేర్లు డీహెచ్‌ఎఫ్‌ఎల్‌: దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ కు చెందిన వివిధ రకాల ఆస్తుల విక్రయానికి ఆర్బీఐ నియమించిన కమిటీ బిడ్స్‌ను ఆహ్వానించింది.  మహీంద్ర అండ్‌ మహీంద్ర ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌: డిసెంబర్‌ 31న ముగిసిన క్యూ3లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 16 శాతం పెరిగి రూ.475 కోట్లకు చేరిందని మహీంద్ర అండ్‌ మహీంద్ర ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ వెల్లడించింది. యస్‌ బ్యాంక్‌, రిలయన్స్‌ పవర్‌: రిలయన్స్‌ పవర్‌కు

Most from this category