News


సెయిల్‌ నష్టాలు రూ.344 కోట్లు

Saturday 15th February 2020
news_main1581739344.png-31816

  • తగ్గిన ఉక్కు ధరల ప్రభావం 
  • పెరిగిన అమ్మకాలు 
  • క్యూ4 ఫలితాలపై కంపెనీ ఆశాభావం


న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఉక్కు కంపెనీ, సెయిల్‌కు ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) డిసెంబర్‌ క్వార్టర్లో రూ.344 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. వ్యయాలు పెరగడం, ఉక్కు ఉత్పత్తుల ధరలు తగ్గడంతో ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయని సెయిల్‌ చైర్మన్‌ అనిల్‌ కుమార్‌ చౌధురి చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం (2019-18) ఇదే క్వార్టర్‌లో రూ.638 కోట్ల నికర లాభం వచ్చిందని తెలిపారు. మొత్తం ఆదాయం రూ.15,910 కోట్ల నుంచి రూ.16,715 కోట్లకు పెరిగిందన్నారు. ధరలు తగ్గినప్పటికీ, ఆదాయం పెరిగిందని తెలిపారు. మొత్తం వ్యయాలు రూ.14,937 కోట్ల నుంచి రూ.17,313 కోట్లకు పెరిగాయని వివరించారు.  


26 శాతం ఎగసిన అమ్మకాలు...
ఉత్పత్తి 3 శాతం వృద్ధితో 3.9 మిలియన్‌ టన్నులకు, అమ్మకాలు 26 శాతం ఎగసి 4.1 మిలియన్‌ టన్నులకు పెరిగాయని అనిల్‌ కుమార్‌ వెల్లడించారు. ఉక్కు పరిశ్రమ మొత్తానికి ఇది చాలా సమస్యాత్మక క్వార్టర్‌ అని పేర్కొన్నారు. అన్ని ప్రధాన కంపెనీల ఆర్థిక పనితీరు దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉక్కు ధరలు తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ, పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ, అమ్మకాల్లో చెప్పుకోదగ్గ వృద్ధి సాధించామని చెప్పారు. పటిష్టమైన వ్యయ నియంత్రణ పద్ధతులు పాటిస్తున్నామని, మార్కెట్‌ పరిస్థితులు మెరుగుపడ్డాయని, ఫలితంగా ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్‌లో మంచి పనితీరు సాధించగలమన్న ఆశాభావాన్ని  ఆయన వ్యక్తం చేశారు.  



You may be interested

ఎస్‌అండ్‌పీ రికార్డ్‌- ఏడీఆర్‌లు వీక్‌

Saturday 15th February 2020

అటూఇటుగా ముగిసిన ఇండెక్సులు ఎస్‌అండ్‌పీ క్లోజింగ్‌ రికార్డ్‌ ఇండియన్‌ ఏడీఆర్‌ల నేలచూపు వేదాంతా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ డౌన్‌ ఓవైపు కరోనా వైరస్‌ ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ గత వారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు దూకుడు ప్రదర్శించాయి. సోమవారం(10న) మార్కెట్లకు సెలవుకాగా.. గత నాలుగు రోజుల ట్రేడింగ్‌లో ఎస్‌అండ్‌పీ మూడుసార్లు సరికొత్త రికార్డులను అందుకుంది. కార్పొరేట్‌ ఫలితాలు, ఆర్థిక గణాంకాలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా కరోనా కోరలు చాస్తుండటం, ఈ వ్యాధి కారణంగా మృతుల

వృద్ధి కోసం అవసరమైతే మరిన్ని చర్యలు

Saturday 15th February 2020

కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్‌ న్యూఢిల్లీ: బడ్జెట్‌లో చేసిన ప్రకటనలకు అదనంగా... వృద్ధి కోసం అవసరమనుకుంటే మరిన్ని చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. ‘బడ్జెట్‌, దానికి వెలుపల’ అనే అంశంపై శుక్రవారం ఢిల్లీలో అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌, వెల్త్‌ అడ్వైజరీ, పన్ను నిపుణులతో జరిగిన చర్చా కార్యక్రమంలో భాగంగా మంత్రి మాట్లాడారు. ‘‘బడ్జెట్‌ 2020కు వెలుపల మరింత చేయాల్సి ఉంటే చేసేందుకు

Most from this category