News


హైదరాబాద్‌లో ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రెండో సెంటర్‌

Friday 12th July 2019
news_main1562915753.png-27013

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: అనలిటిక్స్‌, డేటా సర్వీసుల రంగంలో ఉన్న ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ హైదరాబాద్‌లో కొత్త ‘ఓరియన్‌’ కార్యాలయాన్ని ప్రారంభించింది. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొన్న ఈ కేంద్రానికి రూ.70 కోట్లు ఖర్చు చేశామని కంపెనీ ఇండియా ఎండీ అభిషేక్‌ తోమర్‌ గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. 700 మంది సపోర్ట్‌ సిబ్బంది ఓరియన్‌లో ఉన్నారని చెప్పారు. ఇప్పటికే ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌కు హైదరాబాద్‌లో 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైటెక్‌ సిటీ వద్ద కార్యాలయం ఉంది. 3,500 మంది ఇక్కడ పనిచేస్తున్నారు. ఇంతే స్థాయిలో అత్యాధునిక వసతులతో నూతన కార్యాలయం ఏర్పాటు చేస్తామని అభిషేక్‌ వెల్లడించారు. హైటెక్‌ సిటీ కార్యాలయం నుంచి ఈ సెంటర్‌కు కార్యకలాపాలను బదిలీ చేస్తామన్నారు. ఓరియన్‌ సెంటర్‌ కొనసాగుతుందని వివరించారు. అహ్మదాబాద్‌, గురుగ్రామ్‌తోసహా భారత్‌లో కంపెనీ ఉద్యోగుల సంఖ్య సుమారు 8,000.



You may be interested

మొబైల్‌ రీసైకిల్‌ చేస్తున్నది 12 శాతమే

Friday 12th July 2019

 హైదరాబాద్‌ వినియోగదార్లపై 91మొబైల్స్‌ సర్వే ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలను పట్టించుకోని కస్టమర్లు ఇళ్లలో పేరుకుపోతున్న పాత మొబైల్‌ ఫోన్లు హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్న హైదరాబాద్‌ కస్టమర్లలో 12 శాతం మంది మాత్రమే స్వచ్చందంగా తమ డివైస్‌ను రీసైక్లింగ్‌కు ఇస్తున్నారు. కొత్త మోడల్‌ కొంటున్న సమయంలో 9 శాతం మంది పాత ఫోన్‌ను విక్రేతకు ఇస్తున్నారని గ్యాడ్జెట్‌ డిస్కవరీ సైట్‌ 91మొబైల్స్‌.కామ్‌ సర్వేలో తేలింది. ఈ-వేస్ట్‌ కంపెనీ సెరెబ్రా గ్రీన్‌, మాన్యుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌

124 షేర్లు .. ఏడాది కనిష్ఠానికి

Friday 12th July 2019

ఎన్‌ఎస్‌ఈలో సుమారుగా 124 స్టాకులు శుక్రవారం ట్రేడింగ్‌లో తమ ఏడాది కనిష్ఠానికి పడిపోయాయి. ఇందులో యాక్సెల్య సొల్యుషన్స్‌ ఇండియా, ఆసియన్‌ హొటల్స్‌(ఈస్ట్‌), అసహి ఇండియా గ్లాస్‌, ఆటోమోటివ్‌ అక్సెల్స్‌, బ్లూ డార్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, కేర్‌ రేటింగ్స్‌, కాక్స్‌ అండ్‌ కింగ్స్‌, ఈ క్లరక్స్‌ సర్వీసెస్‌ షేర్లున్నాయి. వీటితో పాటు ఈమామి పేపర్ మిల్స్‌, ఎరిస్‌ లైఫ్‌ సైన్సెస్‌, ఎక్సల్‌ క్రాప్‌ కేర్‌, పోసెకో ఇండియా, గ్రాపైట్‌ ఇండియా, హెచ్‌ఈజీ, కేడీడీఎల్‌,

Most from this category