STOCKS

News


బీపీసీఎల్‌పై రష్యా రాస్‌నెఫ్ట్ ఆసక్తి

Thursday 6th February 2020
news_main1580961385.png-31543

  • కేంద్ర చమురు శాఖ మంత్రితో కంపెనీ సీఈవో భేటీ

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్‌) కొనుగోలుపై రష్యాకు చెందిన చమురు దిగ్గజం రాస్‌నెఫ్ట్ కూడా ఆసక్తిగా ఉంది. బుధవారం కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేం‍ద్ర ప్రధాన్‌తో సమావేశంలోనూ, ఆ తర్వాత ఇతర ఉన్నతాధికారులతో భేటీలోను రాస్‌నెఫ్ట్ సీఈవో ఇగోర్‌ సెషిన్‌ ఈ డీల్‌పై ఆసక్తి వ్యక్తం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీర్ఘకాలిక ప్రాతిపదికన ముడిచమురు సరఫరాకు సంబంధించి ఇండియన్ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ)తో ఒప్పందం కుదుర్చుకున్న సందర్భంగా.. భారత్‌లో మరింతగా ఇన్వెస్ట్ చేయాలని భావిస్తున్నట్లు సెషిన్ చెప్పారని వివరించాయి. ఈ బిడ్డింగ్‌లో పాల్గొనేలా .. సౌదీ అరేబియాకు చెందిన ఆరామ్‌కో, యునైటెడ్ అరబ్‌ ఎమిరేట్స్‌కు చెందిన ఏడీఎన్‌వోసీ తదితర మధ్య ప్రాచ్య సంస్థలతో కూడా ప్రభుత్వం సంప్రతింపులు జరిపినట్లు పేర్కొన్నాయి. డిజిన్వెస్ట్‌మెంట్ ప్రణాళికల్లో భాగంగా బీపీసీఎల్‌లో పూర్తి వాటాలు విక్రయించాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బీపీసీఎల్‌లో కేంద్ర వాటాల విలువ సుమారు రూ. 53,000 కోట్లుగా ఉంటుందని అంచనా. కంపెనీని కొనుగోలు చేసే సంస్థ.. ఇతర షేర్‌హోల్డర్ల నుంచి అదనంగా 26 శాతం వాటాలను కొనేందుకు ఓపెన్ ఆఫర్ ప్రకటించాల్సి ఉంటుంది. 

ఇంధన రిటైలింగ్‌లో విస్తరణకు ఊతం...
ప్రస్తుతం ప్రభుత్వ రంగ సంస్థలదే గుత్తాధిపత్యంగా ఉంటున్న దేశీ ఇంధన మార్కెటింగ్ విభాగంలో పోటీ పెంచే దిశగా సౌదీ ఆరామ్‌కో, టోటల్ ఎస్‌ఏ (ఫ్రాన్స్‌) వంటి అంతర్జాతీయ సంస్థలను కూడా తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా నిబంధనలను కూడా సడలిస్తూ వస్తోంది. రాస్‌నెఫ్ట్‌కు ప్రస్తుతం భారత్‌లో నయారా ఎనర్జీ (గతంలో ఎస్సార్ ఆయిల్) 49.13 శాతం వాటాలు ఉన్నాయి. నయారాకు గుజరాత్‌లో ఒక రిఫైనరీ, దేశవ్యాప్తంగా 5,628 పెట్రోల్ బంకులు ఉన్నాయి. ఇంధన రిటైలింగ్‌లో కార్యకలాపాలు మరింతగా విస్తరించాలని రాస్‌నెఫ్ట్ భావిస్తోంది. బీపీసీఎల్‌ను గానీ కొనుగోలు చేసిన పక్షంలో కంపెనీకి సత్వర ప్రయోజనాలు లభించగలవని పరిశీలకులు భావిస్తున్నారు. బీపీసీఎల్‌కు నాలుగు చోట్ల రిఫైనరీలతో పాటు 15,177 పెట్రోల్ బంకులు, 6,011 ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్ ఏజెన్సీలు, 51 ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పీజీ) బాట్లింగ్ ప్లాంట్లు ఉన్నాయి. దేశీయంగా వినియోగించే పెట్రోలియం ఉత్పత్తుల్లో 21 శాతం ఉత్పత్తులను బీపీసీఎల్‌ సరఫరా చేస్తోంది. బీపీసీఎల్‌ను గానీ దక్కించుకోగలిగితే కార్యకలాపాలను మరింత వేగంగా విస్తరించేందుకు రాస్‌నెఫ్ట్‌కు ఇవన్నీ కలిసిరాగలవని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.



You may be interested

సెన్సెక్స్‌.. సెంచరీతో షురూ

Thursday 6th February 2020

సెన్సెక్స్‌ 132 పాయింట్లు ప్లస్‌ 42 పాయింట్లు ఎగసిన నిఫ్టీ మెటల్‌, ఫార్మా, ఐటీ ప్లస్‌లో ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన ప్రోత్సాహంతో వరుసగా నాలుగో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ లాభాల సెంచరీ చేసింది. 132 పాయింట్లు బలపడి 41,275కు చేరింది. నిఫ్టీ సైతం 42 పాయింట్లు పుంజుకుని 12,131 వద్ద ట్రేడవుతోంది. బుధవారం అమెరికా ఇండెక్సులు వరుసగా రెండో రోజు సరికొత్త గరిష్ట రికార్డులను సాధించగా.. దేశీయంగానూ

సహకార బ్యాంకులు మరింత బలోపేతం

Thursday 6th February 2020

బ్యాంకింగ్‌ చట్టాల సవరణకు క్యాబినెట్ ఆమోదం న్యూఢిల్లీ: పీఎంసీ బ్యాంక్ తరహా సంక్షోభం మరోసారి తలెత్తకుండా డిపాజిట్‌దారుల ప్రయోజనాల పరిరక్షణ, సహకార బ్యాంకులను మరింత పటిష్టం చేసే దిశగా బ్యాంకింగ్ నియంత్రణ చట్టానికి సవరణను కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదించింది. దీని ప్రకారం సీఈవోల నియామకం వంటి పలు కీలక అంశాల్లో కమర్షియల్ బ్యాంకుల తరహాలోనే సహకార బ్యాంకులు కూడా రిజర్వ్ బ్యాంక్ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. సీఈవో అభ్యర్థుల అర్హత

Most from this category