News


డాలర్‌ అప్‌- రూపాయి కుదేల్‌

Thursday 20th February 2020
Markets_main1582173387.png-31951

ప్రారంభంలోనే నేలచూపు
వరుసగా రెండో రోజు డీలా

ఇటీవల బలహీనంగా కదులుతున్న దేశీ కరెన్సీ మరోసారి నేలచూపులతో ప్రారంభమైంది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో డాలరుతో మారకంలో ప్రారంభంలోనే రూపాయి 23 పైసలు నీరసించింది. 71.79 వద్ద మొదలైంది. 9.40 ప్రాంతంలో 22 పైసలు(0.33 శాతం) క్షీణించి 71.78 వద్ద ట్రేడవుతోంది. ఇది ఏడు వారాల కనిష్టంకాగా.. ఇంతక్రితం జనవరి 8న రూపాయి ఈ స్థాయిలో ట్రేడైనట్లు ఫారెక్స్‌ వర్గాలు తెలియజేశాయి. చత్రపతి శివాజీ జయంతి సందర్బంగా బుధవారం ఫారెక్స్‌ మార్కెట్లకు సెలవుకాగా.. మంగళవారం సైతం రూపాయి 24 పైసలు నీరసించిన విషయం విదితమే. వెరసి డాలరుతో మారకంలో మంగళవారం రూపాయి 71.56 వద్ద ముగిసింది.  

చమురు ఎఫెక్ట్‌
బుధవారం ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్‌ మూడేళ్ల గరిష్టానికి చేరింది. 99.70ను తాకింది. ఇక డాలరుతో మారకంలో యూరో మూడేళ్ల కనిష్టం 1.07కు చేరగా.. జపనీస్‌ కరెన్సీ యెన్‌ 9 నెలల కనిష్టానికి చేరింది. 111.37 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు విదేశీ మార్కెట్లో చమురు ధరలు వరుసగా ఏడో రోజు బలపడ్డాయి. మూడు వారాల గరిష్టాలకు చేరాయి. ఈ ప్రభావం దేశీయంగా రూపాయిపై కనిపిస్తున్నట్లు ఫారెక్స్‌ వర్గాలు పేర్కొన్నాయి. టెలికం కంపెనీల ఏజీఆర్‌ బకాయిల చెల్లింపులపై నెలకొన్న అనిశ్చితి, అంతర్జాతీయ స్థాయిలో కరోనా వైరస్‌ ప్రభావం వంటి అంశాలు సైతం​సెంటిమెంటును దెబ్బతీస్తున్నట్లు తెలియజేశాయి.



You may be interested

వాటా విక్రయ వార్తలతో మాక్స్‌ ఫైనాన్స్‌ సర్వీసెస్‌ 15శాతం జంస్‌ ..!

Thursday 20th February 2020

యాక్సిస్‌ బ్యాంక్‌ ఇన్సూరెన్స్‌ రంగానికి చెందిన మాక్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌లో 20శాతం వాటాకు మించి కొనుగోలు సిద్ధమైనట్లు వార్తలు వెలువడటంతో హోల్డింగ్‌ కంపెనీ మాక్స్‌ మాక్స్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెన్‌ షేరు గురువారం ఉదయం ట్రేడింగ్‌లో 15శాతం లాభపడింది. తాజా ఈక్విటీ షేర్ల జారీ ఇష్యూ ద్వారా ఈ కొనుగోలు ప్రక్రియ జరగనున్నట్లు తెలుస్తోంది. యాక్సిస్‌ బ్యాంక్‌ ప్రస్తుతం మ్యాక్స్‌ లైఫ్‌లో కేవలం 2శాతం వాటాను కలిగి ఉంది. ఇప్పుడు రూ.2వేల

పసిడి మరో కొత్త రికార్డు

Thursday 20th February 2020

కోవిడ్‌-19 ప్రభావంతో గత నాలుగు వారాలుగా పెరుగుతూ వస్తున్న పసిడి అంతర్జాతీయ మార్కెట్‌లో  గురువారం ఏడేళ్ల గరిష్టానికి చేరింది. దేశీయ మల్టీకమోడిటీ ఎక్సెంజ్‌లో పసిడి రూ.41,700 పైకి చేరింది. గురువారం ఉదయం 10 గంటల ప్రాంతంలో నిన్నటి ముగింపుతో పోలిస్తే రూ.200 పెరిగి 10 గ్రాముల పసిడి రూ. 41,722.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో  నిన్నటి ముగింపుతో పోలిస్తే 2 డాలర్లు పెరిగి ఔన్స్‌ బంగారం ధర

Most from this category