News


17 నెలల కనిష్టానికి రూపాయి

Thursday 12th March 2020
news_main1583991991.png-32427

60పైసలు పడిపోయిన దేశీ కరెన్సీ

కరోనా వైరస్‌ను ప్రపంచ మహమ్మారి వ్యాధిగా గుర్తిస్తున్నట్లు తొలిసారి అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు ఊపందుకున్నాయి. దీనికితోడు యూరోపియన్‌ దేశాల నుంచి ప్రయాణికులను అనుమతించబోమంటూ అమెరికా ప్రెసిడెంట్‌ ప్రకటించడంతో ప్రపంచ ఆర్థిక వృద్ధికి విఘాతం కలగనున్న అంచనాలు పెరిగినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాసహా ఆసియా వరకూ స్టాక్‌ మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఈ ప్రభావం దేశీ కరెన్సీపైనా పడింది. వెరసి ఇటీవల డాలరుతో మారకంలో ఇటీవల నేలచూపులకే పరిమితమవుతూ వస్తున్న దేశీ కరెన్సీ గురువారం మరింత నీరసించింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో ప్రారంభంలోనే రూపాయి 61 పైసలు పతనమైంది. 74.25 వద్ద ప్రారంభమైంది. తదుపరి 74.34 వరకూ తిరోగమించింది. ప్రస్తుతం 51 పైసల(0.8 శాతం) నష్టంతో 74.13 వద్ద కదులుతోంది. ఇది 17 నెలల కనిష్టంకాగా.. ఇంతక్రితం 2018 అక్టోబర్‌లో మాత్రమే రూపాయి ఈ స్థాయిలో ట్రేడయ్యింది. కాగా.. బుధవారం రూపాయి ఏకంగా 53 పైసలు జంప్‌చేసింది. 73.64 వద్ద ముగిసింది. విదేశీ మార్కెట్లో యెన్‌ తదితర కరెన్సీలతో మారకంలో డాలరు బలహీనపడటం, దేశీయంగా ఈక్విటీ మార్కెట్లు జోరందుకోవడం, రిజర్వ్‌ బ్యాంక్‌ డాలర్ల కొనుగోళ్లు వంటి అంశాలు రూపాయికి బలాన్నిచ్చినట్లు ఫారెక్స్‌ వర్గాలు పేర్కొన్నాయి.

ఎఫ్‌పీఐల ఎఫెక్ట్‌
కొద్ది రోజులుగా దేశీ స్టాక్‌ మార్కెట్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) నికర అమ్మకందారులుగా నిలుస్తున్నారు. నగదు విభాగంలో ఈ నెలలో ఇప్పటివరకూ ఎఫ్‌పీఐలు రూ. 27,000 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించడం గమనార్హం! 

 You may be interested

చమురు ధరల పతనం భారత్‌కు వరం

Thursday 12th March 2020

క్యాడ్‌, ద్రవ్యోల్బణం దిగొస్తాయి జీడీపీ పెరగుతుంది కోటక్‌, బ్యాంకు ఆఫ్‌ అమెరికా అంచనాలు న్యూఢిల్లీ: చమురు ధరల పతనం భారత ఆర్థిక వ్యవస్థకు ఎన్నో విధాలుగా కలిసొస్తుందని కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌, బ్యాంకు ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌ అభిప్రాయం వ్యక్తం చేశాయి. దేశ చమురు అవసరాల్లో 84 శాతం మేర దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో.. చమురు దిగుమతుల బిల్లు తగ్గడంతో కరెంటు ఖాతా లోటు (క్యాడ్‌), ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు తగ్గుముఖం పడతాయని, దీంతో అధిక

నేటివార్తల్లోని షేర్లు

Thursday 12th March 2020

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం స్టాక్‌ మార్కెట్‌లో ప్రభావితమయ్యే షేర్లు భారతీ ఎయిర్‌టెల్‌: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు..భారతీ ఎయిర్‌టెల్‌ స్వీయ గణాంకాల విశ్లేషణ ప్రకారం మొత్తం ఏజీఆర్‌ బకాయిలు కింద రూ.13,000 కోట్లు  చెల్లించామని ఈ కంపెనీ చైర్మన్‌ సునీల్‌ మిట్టల్‌ వెల్లడించారు.  బయోకాన్‌:  సనోఫీ ఫార్మా కంపెనీ ఇన్సులిన్‌ పరికరం పేటెంట్‌ను అమెరికా కోర్టు రద్దుచేసింది. దీంతో మైలాన్‌ కంపెనీతో కలిసి బయోకాన్‌ తయారు చేసిన సెమగ్లీ అనే ఇన్సులిన్‌ పరికరాన్ని

Most from this category