News


రూపాయ్‌@ 74- 17 నెలల కనిష్టం

Saturday 7th March 2020
Markets_main1583571507.png-32351

గత వారం 4 రోజులపాటు పతనమే
వారాంతాన సైతం 54 పైసలు మైనస్‌
74 చేరువలో ముగింపు
ఇం‍ట్రాడేలో 74.08కు రూపాయి

డాలరుతో మారకంలో ఇటీవల నేలచూపులకే పరిమితమవుతూ వస్తున్న దేశీ కరెన్సీ శుక్రవారం మరింత నీరసించింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి 54 పైసలు పతనమైంది. 73.87 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో కనిష్టంగా 74.08ను తాకింది. గురువారం ఒక్క రోజు మినహాయిస్తే గత వారమంతా దేశీ కరెన్సీ క్షీణ పథంలోనే సాగింది. వెరసి శుక్రవారం(6)తో ముగిసిన గత వారం రూపాయి నికరంగా 163 పైసలు అంటే 2.25 శాతం విలువను కోల్పోయింది. ఇది 17 నెలల కనిష్టంకావడం గమనార్హం! ఇంతక్రితం 2018 అక్టోబర్‌లో మాత్రమే రూపాయి ఈ స్థాయిలో ట్రేడయ్యింది.

గురువారం ప్లస్‌లో
ఐదు రోజుల పతనానికి చెక్‌ పెడుతూ గురువారం రూపాయి స్వల్పంగా బలపడింది. 6 పైసలు పుంజుకుని 73.33 వద్ద ముగిసింది. అయితే ఇంట్రాడేలో సాంకేతికంగా కీలకమైన 74 మార్క్‌ దిగువకు పతనంకావడం గమనార్హం! రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ చేపట్టిన చర్యలు కొంతమేర సహకరించినట్లు ఫారెక్స్‌ వర్గాలు పేర్కొన్నాయి.​ కాగా.. కరోనా ప్రభావంతో ఆర్థిక వృద్ధి మందగించవచ్చన్న అంచనాలు, దేశీయంగా స్టాక్‌ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు వంటి అంశాలు కొద్ది రోజులుగా రూపాయిని దెబ్బతీస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దీనికితోడు యస్‌ బ్యాంక్‌ బోర్డును రద్దు చేస్తూ ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేయడం, దేశీయంగానూ కరోనా ఆందోళనలు చెలరేగడం వంటి అంశాలు సైతం సెంటిమెంటును బలహీనపరచినట్లు నిపుణలు తెలియజేశారు.


 



You may be interested

ఎస్‌బీఐలో యస్‌బ్యాంక్‌ విలీనం ప్రసక్తే లేదు: ఎస్‌బీఐ ఛైర్మన్‌ రజనీష్‌

Saturday 7th March 2020

ఎస్‌బీఐలో యస్‌బ్యాంక్‌ విలీనం ప్రసక్తే లేదని, కేవలం వాటాను మాత్రమే కొనుగోలు చేస్తున్నట్లు  ఎస్‌బీఐ ఛైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ స్పష్టతనిచ్చారు. యస్‌బ్యాంక్‌ లో నియంత్రణ వాటాను ఎస్‌బీఐ కొనుగోలు చేసే అంశంపై రజనీష్‌ శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఆర్‌బీఐ ప్రతిపాదించిన డ్రాఫ్ట్‌ స్కీంపై స్పందించేందుకు తమకు సోమవారం వరకు గడువు ఉందని రజనీష్‌ తెలిపారు. మెండిబకాయిలతో ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన యస్‌బ్యాంక్‌ను గట్టెక్కించేందుకు ఆర్‌బీఐ ప్రతిపాదించిన డ్రాప్ట్‌ స్కీంపై

ఎస్‌బీఐ చేతిలో యస్‌బ్యాంక్‌ సురక్షితం: రాణా కపూర్‌

Saturday 7th March 2020

యస్‌బ్యాంక్‌లో ఎస్‌బీఐ వ్యూహాత్మక వాటా కొనుగోలును యస్‌బ్యాంక్‌ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ స్వాగతించారు. యస్‌ బ్యాంకు ఎస్‌బీఐ చేతుల్లోకి వెళ్లడంతో సరైన ప్రాంతంలో సురక్షితంగా ల్యాండ్‌ అయిందని, వాటా కొనుగోలుకు ప్రక్రియ విధానం, అందుకు తీసుకున్న కాలవ్యవధి సరైన పద్ధతిలోనే ఉన్నట్లు రాణాకపూర్‌ చెపుతున్నారు. ఒక ఆంగ్లఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను ఆయన పంచుకున్నారు. వివరాలు... యస్‌బ్యాంక్‌ ఇటీవల చేపట్టిన భారీ నిధుల సమీకరణ ఇష్యూ (లేదా) క్యూఐపీ కంటే

Most from this category