News


‘రక్షణ’కు రూ. 3.18 లక్షల కోట్లు

Saturday 6th July 2019
news_main1562395076.png-26848

- మధ్యంతర బడ్జెట్‌ కేటాయింపులే కొనసాగింపు
- రక్షణ పరికరాల దిగుమతికి కస్టమ్స్‌ డ్యూటీ మినహాయింపు 
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌లో 2019- 20 ఆర్థిక సంవత్సరానికి గాను రక్షణ శాఖకు రూ. 3.18 లక్షల కోట్లు కేటాయించారు. గతేడాది రక్షణ శాఖకు రూ. 2.98 లక్షల కోట్లు కేటాయించగా, ఈ ఏడాది స్వల్పంగా నిధులు పెంచారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో చేసిన రక్షణ శాఖకు కేటాయింపులనే ఈ బడ్జెట్‌లోనూ కొనసాగించారు. 1962 చైనా యుద్ధం తర్వాత అతి తక్కువగా దేశ జీడీపీలో దాదాపు 1.6 శాతం మేర రక్షణ శాఖకు కేటాయింపులు చేశారని నిపుణులు చెబుతున్నారు. మొత్తం కేటాయింపుల్లో పెట్టుబడి మూలధన వ్యయం కోసం రూ. 1,08,248 కోట్లు కేటాయించారు. వీటి ద్వారా కొత్త ఆయుధాలు, యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు, ఇతర మిలటరీ పరికరాలు, కొనుగోలు చేయనున్నారు. అలాగే రెవెన్యూ వ్యయాన్ని రూ. 2,10,682 కోట్లుగా ఖరారు చేశారు. ఈ నిధులను వేతనాలు, సైనిక వ్యవస్థల నిర్వహణ నిమిత్తం వినియోగిస్తారు. అలాగే ఈసారి రూ. 2.95 లక్షల కోట్లు బడ్జెట్‌ అంచనాలను చూపించగా.. 7.93 శాతం వృద్ధితో రూ. 3,18,931 కోట్లు కేటాయించినట్లు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ కార్యాలయం తెలిపింది. అలాగే మన దేశంలో తయారు కాని రక్షణ పరికరాలను దిగుమతి చేసుకునేందుకు కస్టమ్స్‌ డ్యూటీని మినహాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. ఇది ‘దేశ ప్రాధాన్య’అంశమని పేర్కొన్నారు. 
‘పెన్షన్‌’తో కలిపితే రూ. 4.31 లక్షల కోట్లు...
రక్షణ శాఖకు చెందిన మాజీ సైనికులు, ఇతర సిబ్బందికి చెల్లించే పెన్షన్‌ నిధులను ఆ శాఖ బడ్జెట్‌లో చూపించలేదు. రూ. 1,12,079 కోట్ల పెన్షన్‌ నిధులను విడిగా కేటాయించారు. ఈ పెన్షన్‌ నిధులను, మొత్తం శాఖ బడ్జెట్‌ను కలిపి చూస్తే రక్షణ శాఖ బడ్జెట్‌ రూ. 4.31 లక్షల కోట్లు అవుతుంది. అంటే, 2019- 20 మొత్తం బడ్జెట్‌ వ్యయంలో రక్షణ శాఖ వాటానే 15.47 శాతం ఉంటుంది.



You may be interested

ఈ ఏడాదే 3 లక్షల కోట్ల డాలర్లకు ఆర్థిక వ్యవస్థ

Saturday 6th July 2019

5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరుకోగల సామర్థ్యం ఉంది అందుకు నిర్మాణాత్మక సంస్కరణలు తప్పనిసరి చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లోకి భారీ పెట్టుబడులు అవసరం ఆర్థిక వృద్ధికి రవాణా సౌకర్యాలే కీలకం బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపిన నిర్మలా సీతారామన్‌ న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే భారత ఆర్థిక వ్యవస్థ 3 లక్షల కోట్ల డాలర్ల (దాదాపు రెండు కోట్ల కోట్ల రూపాయలు) స్థాయికి చేరుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపారు.

ఎఫ్‌డీఐ ఇక రయ్‌రయ్‌!

Saturday 6th July 2019

మీడియా, ఏవియేషన్‌, బీమా, సింగిల్‌ బ్రాండ్ రిటైల్‌లో వెసులుబాటు విదేశీ పెట్టుబడుల ఆకర్షణకు ప్రతిపాదనలు న్యూఢిల్లీ: బీమా, మీడియా, ఏవియేషన్‌, సింగిల్‌ బ్రాండ్ రిటైల్‌ రంగంలో మరిన్ని విదేశీ పెట్టుబడులు ఆకర్షించే దిశగా కేంద్రం బడ్జెట్‌లో చర్యలు ప్రతిపాదించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను సడలించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 2018-19లో ఎఫ్‌డీఐలు 6 శాతం వృద్ధితో 64.37 బిలియన్ డాలర్లకు పెరిగినట్లు ఆమె వివరించారు. "భారత్‌ను

Most from this category