News


మహిళలకు రూ. 17వేల కోట్ల రుణాలు

Wednesday 4th March 2020
news_main1583296188.png-32261

  • స్టాండప్ ఇండియా స్కీమ్ కింద మంజూరు

న్యూఢిల్లీ: 'స్టాండప్ ఇండియా' పథకం కింద రుణాలు పొందిన వారిలో దాదాపు 81 శాతం మంది మహిళలు ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. నాలుగేళ్ల వ్యవధిలో వారు రూ. 16,712 కోట్ల రుణాలు పొందినట్లు వివరించింది. "2020 ఫిబ‍్రవరి 17 నాటికి స్టాండప్ ఇండియా స్కీమ్‌ కింద ఖాతాదారుల్లో 81 శాతం మంది మహిళలు ఉన్నారు. 73,155 ఖాతాలు మహిళల పేరిట ఉన్నాయి. మహిళలు సాధికారతతో మరింత మెరుగైన జీవితాన్ని సాగించేందుకు, వ్యాపారవేత్తలుగా తమ ఆకాంక్షలను సాకారం చేసుకునేందుకు ఈ పథకాలు తోడ్పడ్డాయి" అని ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రతి బ్యాంకు శాఖ పరిధిలో మహిళలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు కొత్తగా సంస్థను ప్రారంభించేందుకు.. కనీసం ఒక్కరికైనా రూ. 10 లక్షల నుంచి రూ. 1 కోటి దాకా రుణాలిచ్చే ఉద్దేశంతో 2016 ఏప్రిల్ 5న స్టాండప్ ఇండియా స్కీమ్‌ను కేంద్రం ప్రారంభించింది. ఆర్థిక శాఖ ప్రకటన ప్రకారం...

- ప్రధానమంత్రి ముద్రా యోజన (పీఎంఎ౾ంవై) కింద రుణాలు పొందిన వారిలో 70 శాతం మంది మహిళలు ఉన్నారు. 2015 ఏప్రిల్ 8న ఈ స్కీమ్ ప్రారంభమైనప్పట్నుంచీ.. 2020 జనవరి 31 దాకా 22.53 కోట్ల రుణాలను మంజూరయ్యాయి. ఇందులో 15.75 కోట్ల రుణాలు.. మహిళలకు మంజూరయ్యాయి.
- 2014 ఆగస్టు 28న ప్రారంభించిన ప్రధానమంత్రి జన ధన యోజన కింద (పీఎంజేడీవై) కింద 2020 ఫిబ్రవరి 19 దాకా 38.13 కోట్ల మంది రుణాలు పొందారు. వీరిలో 20.33 కోట్ల మంది మహిళలు (53 శాతం) ఉన్నారు.
- 2015 మే 9న ప్రారంభమైన అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) కింద 2.15 కోట్ల మంది చందాదారులు ఉన్నారు. వీరిలో 43 శాతం మంది (సుమారు 93 లక్షల మంది) మహిళలు ఉన్నారు. 



You may be interested

ఐటీ ఎగుమతులకు డిజిటల్‌ దన్ను

Wednesday 4th March 2020

సాఫ్ట్‌వేర్‌ ఎగుమతుల్లో 9 శాతం వృద్ధి అంచనా హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశానికి డిజిటల్‌ వెన్నెముకగా మారిందని, ప్రధానంగా ఐటీ ఎగుమతుల వృద్ధికి బ్లాక్‌ చెయిన్, ఆర్టిఫిషల్‌ ఇంటలిజెన్స్‌ (ఏఐ), క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వంటి డిజిటల్‌ టెక్నాలజీ దన్నుగా నిలుస్తుందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి అరుణ్‌ గోయెల్‌ తెలిపారు. గత దశాబ్ద కాలంగా దేశంలో బలమైన ఐటీ మౌలిక వసతులను ఏర్పాటైందని, దీంతో గ్రామీణ ప్రాంతాల్లోనూ బ్యాంక్‌

రూ.43,000 పైకి బంగారం!

Wednesday 4th March 2020

బుధవారం ఒక్కసారిగా బంగారం రూ.1000కిపైగా పెరిగింది. కోవిడ్‌-19 చైనాతోపాటు వివిధ దేశాలను వణికిస్తుండడంతో మార్కెట్లు పతనమవుతున్న సంగతి తెలిసిందే. అయితే కోవిడ్‌-19 ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపకుండా ఉండేందుకు అమెరికా ఫెడ్‌ రేటును తగ్గించడంతో ఒక్కసారిగా అమెరికా మార్కెట్లు పడిపోయాయి. దీంతో మరోసారి బంగారం ధర భారీగా పెరిగింది. ఇండియాలో కూడా కరోనా కేసులు నమోదవుతుండడం, రూపాయి బలహీనపడడంతో బుధవారం దేశీయ మల్టీకమోడిటీ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే ఒక్కరోజే రూ.1,100

Most from this category