News


రాయల్‌ జెల్లీ హనీ రూ.1.5 లక్షలు

Wednesday 7th August 2019
news_main1565154634.png-27592

  • ప్రపంచంలో అత్యంత ఖరీదైన తేనె రకం ఇదే
  • అందుబాటులో 100కుపైగా రకాల వెరైటీలు
  • రూ.1,560 కోట్లకు భారత హనీ మార్కెట్‌

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- తేనె అంటే ఇష్టపడని వారుండరు. సహజసిద్ధమైంది కావడం, ఔషధ గుణాలు బోలెడు ఉడడం, అలాగే రుచిలో మేటి కారణంగా దీని స్థానం ఎప్పుడూ ప్రత్యేకమే. మినరల్స్‌, విటమిన్స్‌, యాంటీఆక్సిడెంట్స్‌ నిండుగా ఉండడంతో ఫుడ్‌ సప్లిమెంట్స్‌, సౌందర్య సాధనాలతోపాటు ఔషధాల తయారీలో కూడా తేనెను విరివిగా వాడుతున్నారు. ఒక్క భారత్‌ మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ ఉత్పాదనకు డిమాండ్‌ 365 రోజులూ ఉంటుంది. భారత్‌లో తేనె వ్యాపారం విలువ 2018లో సుమారు రూ.1,560 కోట్లు నమోదైంది. ఏటా 10.2 శాతం వృద్ధితో 2024 నాటికి ఇది రూ.2,806 కోట్లకు చేరుకోనుందని మార్కెట్‌ వర్గాల సమాచారం. 
వందకుపైగా రకాలు...
తేనెటీగలు 300-350 రకాల పూల నుంచి హనీని సేకరిస్తాయి. ఫ్లవర్స్‌ నాణ్యతనుబట్టి రంగు, రుచి, వాసన, టెక్స్‌చర్‌ మారుతుంది. తెలుపు, పసుపు, నలుపు, గోధుమ తదితర వర్ణాల్లో తేనె లభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 100కుపైగా రకాల హనీ తయారవుతోంది. ‘మూడు నుంచి ఆరు వారాల జీవిత కాలం ఉండే తేనెటీగ సుమారు 10 గ్రాముల తేనెను ఉత్పత్తి చేస్తుంది. 40 లక్షల పూల నుంచి సేకరించిన మకరందంతో 4 కిలోల తేనెతెట్టె సిద్ధమవుతుంది. దీని నుంచి 1 కిలో తేనె వస్తుంది’ అని జీనోమ్‌ల్యాబ్స్‌ బయో ఈడీ అశోక్‌ కుమార్‌ సాక్షి బిజినెస్‌ బ్యూరోకు తెలిపారు. తేనెను వేరు చేయగా వచ్చే నీరు, పుప్పొడిని ఫుడ్‌ సప్లిమెంట్స్‌, బ్యూటీ ప్రొడక్ట్స్, మెడిసిన్స్‌లో వాడుతున్నారు. ‘అరుదైన తేనెతో విభిన్న ఉత్పత్తులను అభివృద్ధి చేస్తున్నాం. ఫ్లోనీ బ్రాండ్‌లో ప్రీమియం వెరైటీలను ఇప్పటికే ప్రవేశపెట్టాం’ అని తెలిపారు.
వినియోగం, తయారీలోనూ...
వినియోగం పరంగా యూఎస్‌, యూరప్‌, చైనా, భారత్‌, ఆస్ట్రేలియా ప్రధాన మార్కెట్లుగా ఉన్నాయి. ప్రీమియం హనీ ఉత్పత్తికి యూరప్‌లోని హంగేరీ పెట్టింది పేరు. యూఎస్‌, న్యూజీలాండ్‌, కెనడా, చైనా, భారత్‌లో తేనె పెద్ద ఎత్తున ఉత్పత్తి అవుతోంది. వినియోగం, తయారీ పరంగా భారత్‌ ప్రధాన దేశాల్లో ఒకటిగా నిలిచింది. రూ.1,560 కోట్ల భారత హనీ విపణిలో వ్యవస్థీకృత రంగం వాటా రూ.1,200 కోట్లుంది. డాబర్‌, పతంజలి, జంఢు, ఏపిస్‌, రస్న తదితర బ్రాండ్లు పోటీపడుతున్నాయి. ఇవేగాక ఆర్గానిక్‌ విభాగంలో 24 లెటర్‌ మంత్ర, ప్రో నేచుర్‌, ఆర్గానిక్‌ తత్వ, నేచుర్‌ ల్యాండ్‌ వంటి బ్రాండ్లు ఉన్నాయి. 
పేరుకు తగ్గట్టే రాయల్‌...
మనుక, అకేషియా, లిండేన్‌, మిల్క్‌వీడ్‌, బ్లాక్‌బెర్రీ, బ్లూబెర్రీ, క్లోవర్‌ వంటి పూలు చాలా ఖరీదైనవి. పలు దేశాల్లో ఈ పూల మొక్కలతో ప్రత్యేక తేనె ఉత్పత్తి  కేంద్రాలు ఉన్నాయి. రసాయనాలు వాడకుండా పూర్తిగా సేంద్రియ పద్ధతిలో ఈ మొక్కలను పెంచుతున్నారు. వీటి తేనె ఖరీదు కిలోకు రూ.1 లక్షకుపైగా ఉంటోంది. హనీ రకాల్లో అత్యంత ఖరీదైంది రాయల్‌ జెల్లీ. ఇతర వెరైటీలతో పోలిస్తే ఇది పూర్తిగా భిన్నంగా పేస్ట్‌ మాదిరిగా ఉంటుంది. క్వీన్‌ బీ నుంచి సేకరించిన 30 ప్లస్‌ గ్రేడ్‌ వెరైటీ కిలో ధర రూ.1.5 లక్షల పైమాటే. ఇది వాడడం వల్ల హెల్త్‌ బెనిఫిట్స్‌ ఉన్నాయి కాబట్టే ఈ స్థాయి ఖరీదు ఉంది.You may be interested

నిర్మాణ రంగంలోనూ ద్వైపాక్షికం

Wednesday 7th August 2019

భారత్‌తో వాణిజ్య బంధం ఇంకా పెరగాలి ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు ఆకాంక్ష హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఇండియా – ఇజ్రాయిల్‌ దేశాల మధ్య ఇన్నాళ్లుగా రక్షణ, వ్యవసాయ రంగాల్లో మాత్రమే ద్వైపాక్షి వాణిజ్యం జరిగిందని, ఇక నుంచి సాంకేతికత, మౌలిక, నిర్మాణ రంగాల్లో బలపడాల్సిన అవసరముందని ఇజ్రాయిల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు ఆకాంక్షించారు. అన్ని రంగాల్లో మాదిరిగా మౌలిక, నిర్మాణ రంగంలోనూ సాంకేతికత, ఆర్టిఫిషల్‌ ఇంటెలిజెన్సీ (ఏఐ), రోబోటిక్స్‌ వంటి ఆధునిక టెక్నాలజీ

వ్యయ నియంత్రణ చర్యలపై బీఎస్‌ఎన్‌ఎల్ దృష్టి

Wednesday 7th August 2019

అవుట్‌సోర్సింగ్‌ కార్యకలాపాల క్రమబద్ధీకరణపై కసరత్తు ఏటా రూ. 200 కోట్ల దాకా ఆదాకు అవకాశం న్యూఢిల్లీ: నిధుల కొరతతో అల్లాడుతున్న ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్‌ వ్యయ నియంత్రణ చర్యలపై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో బాగంగా అవుట్‌సోర్సింగ్‌కి ఇచ్చిన కార్యకలాపాలను క్రమబద్ధీకరించే ప్రయత్నాల్లో ఉంది. తద్వారా ఏటా రూ. 200 కోట్ల దాకా మిగుల్చుకోవచ్చని అంచనా వేస్తోంది. అలాగే టెలిఫోన్‌ ఎక్స్చేంజీల్లో విద్యుత్ బిల్లుల భారాన్ని కూడా తగ్గించుకోవడం ద్వారా

Most from this category