News


ఉద్దీపనకు వీల్లేదు కానీ... రేటు కోతకు అవకాశం

Friday 20th September 2019
news_main1568956530.png-28449

  • ఆర్‌బీఐ గవర్నర్‌ అభిప్రాయం
  •  ద్రవ్యోల్బణం అదుపువల్ల 
  • రెపో తగ్గించవచ్చని సూచన

ముంబై: ధరల స్పీడ్‌ (ద్రవ్యోల్బణం) అదుపులో ఉండడం వల్ల బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు- రెపో (ప్రస్తుతం 5.4 శాతం) మరింత తగ్గింపునకు అవకాశం ఉందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం ప్లస్‌ 2 లేదా మైనస్‌ 2తో 2 శాతంగా ఉండాలని ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశిస్తోంది. అంటే ఎగువున నాలుగుశాతం, దిగువన -0.1 శాతం కిందకు ద్రవ్యోల్బణం తగ్గకూడదన్నమాట. ఇదే శ్రేణలో ద్రవ్యోల్బణం గత కొన్ని నెలలుగా ఉంటోంది.  ఈ నేపథ్యంలో వృద్ధే లక్ష్యంగా గడచిన నాలుగు త్రైమాసికాల్లో రెపో రేటును ఆర్‌బీఐ 1.1 శాతం తగ్గించిన సంగతి తెలిసిందే. వృద్ధి మందగమనం, స్పీడ్‌ పెంపునకు కేంద్రం పన్ను రేట్లు తగ్గించాలని, ఆర్‌బీఐ రెపో రేటు మరింత తగ్గించి, కస్టమర్లకు ఈ ప్రయోజనం అందేలా బ్యాంకులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని పారిశ్రామిక వర్గాల నుంచి గట్టి డిమాండ్‌ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ బ్లూమ్‌బర్గ్‌ ఇండియా ఎకనమిక్‌ సదస్సులో కీలక ప్రసంగం చేశారు. ఇందులో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...

- మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి ఉద్దీపన చర్యలు ప్రకటించే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. ఇందుకు ద్రవ్యపరమైన అడ్డంకులు ఉన్నాయి. రెపో రేటు తగ్గింపు ద్వారా వృద్ధికి కొంత ప్రోత్సాహం అందించే వెసులుబాటు ఉంది. 
- ధరలు స్థిరంగా ఉన్నాయి. ద్రవ్యో‍ల్బణం నిర్దేశిత 4 శాతం దిగువన కొనసాగుతోంది. వచ్చే 12 నెలలూ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలూ కనిపిస్తున్నాయి. అందువల్ల వృద్ధే లక్ష్యంగా రెపో రేటు తగ్గింపునకు అవకాశం ఉంది. 
- పన్నులు మరింత తగ్గించాలని, తద్వారా ఉద్దీపనలు కొన్నింటిని ప్రకటించాలని పారిశ్రామిక వర్గాల నుంచి డిమాండ్‌ వస్తోంది. అయితే ఇందుకు తక్కువ అవకాశాలే ఉన్నాయి. ద్రవ్యపరమైన అంశాలు ఇందుకు సహకరించవు. 
ક્- సౌదీ అరేబియా చమురు కేంద్రాలపై ఇటీవల డ్రోన్‌ దాడుల నేపథ్యంలో ఏర్పడిన తీవ్ర పరిస్థితి దేశీయ ద్రవ్యో‍ల్బణం, ద్రవ్యలోటు వంటి అంశాలపై స్వల్ప ప్రభావం మాత్రమే చూపుతుందని భావిస్తున్నాం. ఈ ప్రభావం కొంతకాలం మాత్రం ఆర్థిక వ్యవస్థపై ప్రతికూలత చూపుతుంది. 
- కొన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ, రూపాయి అలాగే ద్రవ్యలోటు ఒక నిర్దిష్ట శ్రేణిలోనే ఉన్నాయి. 
- నిర్వహణ సరిగాలేని నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీ)లకు రుణాలను ఇచ్చిన బ్యాంకులు వాటిలో కొంత వదులుకోవాల్సిన పరిస్థితి ఉంది. మొండిబకాయిల (ఎన్‌పీఏ) భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగా ఈ దిశలో నడవక తప్పని పరిస్థితి ఉంది. 
-  10 ప్రభుత్వ రంగ బ్యాంకులను 4 బ్యాంకులకు కుదిస్తూ విలీన నిర్ణయాన్ని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికే పలు బ్యాంకులు ఈ దిశలో చర్యలు తీసుకుంటున్నాయి. అంతర్గత కార్యాచరణ గ్రూప్‌లను ఏర్పాటు చేసుకుంటున్నాయి. 


అంతటా నిరాశే..!
కాగా వ్యవస్థ మందగమనానికి కొన్ని సైక్లికల్‌ అంశాలు కారణమయితే, వ్యవస్థాగత సవాళ్లూ కారణమవుతున్నాయి. ద్రవ్య విభాగానికి సంబంధించి పలు ప్రతికూల వార్తలు వెలువడుతున్నాయి. అడ్వాన్స్‌ పన్ను వసూళ్లు లక్ష్యాన్ని చేరడం లేదు. ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో (ఏప్రిల్‌-సెప్టెంబర్‌) మొత్తం అడ్వాన్స్‌ పన్ను వసూళ్లు రూ.5.5 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చిచూస్తే, (5.25 లక్షల కోట్లు) వృద్ధి కేవలం 4.7 శాతంగా ఉంది.  ప్రభుత్వ ఆదాయ-వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం- ద్రవ్యలోటు జూలై నాటికి రూ.5,47,605 లక్షల కోట్లకు చేరింది. 2019-20 మొత్తం బడ్జెట్‌ లక్ష్యంలో 77.8 శాతానికి చేరింది.  2019-2020 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 7.03 లక్షల కోట్లుగా ఉండాలని బడ్జెట్‌ నిర్దేశించింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో చూస్తే ఈ పరిమాణం 3.3 శాతం. అయితే ఈ లక్ష్యాలు సాధించడంపైనా తాజాగా అనుమానాలు నెలకొన్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఆర్థికవృద్ధి రేటు ఆరు సంవత‍్సరాల కనిష్టస్థాయి 5 శాతానికి పడిపోయింది. ఆటో కానీయండి లేదా ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జూమర్‌ గూడ్స్‌ విభాగం కానీయండి ఆయా రంగాల వృద్ధి క్షీణతలోకి జారింది. కన్జూమర్‌ డిమాండ్‌ పడిపోవడం దీనికి కారణం. You may be interested

కార్పోరేట్‌ టాక్స్‌ తగ్గింపుతో సెన్సెక్స్‌ 1200 పాయింట్లు హైజంప్‌

Friday 20th September 2019

కార్పోరేట్ పన్ను తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి అనూహ్య ప్రకటనతో గురువారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో సూచీలు పరుగులు పెడుతున్నాయి. దేశీయ ఆర్థిక మందగమనాన్ని ఉత్తేజపరిచేందుకు కార్పోరేట్ పన్ను రేటును దేశీయ కంపెనీలకు 30 శాతం నుంచి 25.2 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా అన్ని రంగ షేర్లలో విపరీతమైన కొనుగోళ్ల సునామి మొదలైంది. అత్యధికంగా బ్యాంకింగ​రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. ఉదయం గం.11:20నిల.కు

​‍ట్రావెల్‌ బిజినెస్‌లో రూ.250 కోట్లు

Friday 20th September 2019

ఇన్వెస్ట్‌  చేస్తున్న పేటీఎమ్‌  ఈ ఆర్థిక సంవత్సరంలో వంద శాతం వృద్ది  న్యూఢిల్లీ: డిజిటల్‌ చెల్లింపుల కంపెనీ పేటీఎమ్‌ తన ట్రావెల్‌ బిజినెస్‌లో రూ.250 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్నది. రానున్న ఆరు నెలల్లో ఈ పెట్టుబడులు పెడతామని పేటీఎమ్‌ తెలిపింది. పర్యాటక వ్యాపార విస్తృతిని పెంచుకోవడానికి, టెక్నాలజీని మరింత పటిష్టం చేసుకోవడానికి ఈ పెట్టుబడులను వినియోగిస్తామని పేటీఎమ్‌ ట్రావెల్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అభిషేక్‌ రాజన్‌ చెప్పారు. అంతే కాకుండా మార్కెట్‌ వాటా

Most from this category