News


ఎయిరిండియా విక్రయానికి రోడ్‌షోలు

Wednesday 17th July 2019
news_main1563343090.png-27119

  • వచ్చే నెలాఖరులోగా నిర్వహణ

న్యూఢిల్లీ: నష్టాలు, రుణభారంతో కుంగుతున్న ప్రభుత్వ రంగ ఎయిరిండియాలో వాటాల విక్రయానికి సంబంధించి ఇన్వెస్టర్లను ఆకర్షించే దిశగా వచ్చే నెలాఖరులోగా రోడ్‌షోలు నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. రోడ్‌షోల సందర్భంగా ఆసక్తిగల కొనుగోలుదారులతో అధికారులు సమావేశం కానున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ప్రక్రియలో భాగంగా కొన్ని అంశాలు మినహా ఎయిరిండియా ఖాతాలను బిడ్డర్లు పరిశీలించుకోవచ్చని, షేర్ల కొనుగోలు ఒప్పందాన్ని కూడా చూసుకోవచ్చని వివరించాయి. ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలు దాఖలు చేసే క్రమంలో ఒకవేళ విక్రయ ఒప్పంద నిబంధనల్లో మార్పులు, చేర్పులు అవసరమనుకుంటే సూచనలు కూడా చేయొచ్చని పేర్కొన్నాయి. దాదాపు రూ. 58,000 కోట్ల రుణభారం, భారీ నష్టాలు మూటగట్టుకున్న ఎయిరిండియా ప్రస్తుతం ప్రభుత్వ ఆర్థిక తోడ్పాటుతో నడుస్తోంది. ఇందులో వాటాలు విక్రయించేందుకు కేంద్రం గతేడాది ప్రయత్నించినా.. బిడ్డర్స్ నుంచి స్పందన రాకపోవడంతో విక్రయ ప్రక్రియను వాయిదా వేసింది. 



You may be interested

'స్మార్ట్' వాహనాలపై మహీంద్రా దృష్టి

Wednesday 17th July 2019

కేయూవీ, ఎక్స్‌యూవీల్లో ఎలక్ట్రిక్ వెర్షన్ల తయారీ న్యూఢిల్లీ: వాహనాల వ్యాపార విభాగంలో శరవేగంగా మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఇకపై కనెక్టెడ్ వాహనాలు, పెట్రోల్ ఇంజిన్లు, ఎలక్ట్రిక్ వాహనాలపై (ఈవీ) మరింతగా దృష్టి పెట్టాలని మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) నిర్ణయించింది. మహారాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన ఈవీ విధానం కింద తమ ఎలక్ట్రిక్ వాహనాల ప్రాజెక్టుపై రూ.500 కోట్లు వెచ్చించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఎస్‌యూవీలైన కేయూవీ 100, ఎక్స్‌యూవీ300

టాప్ బ్రాండ్‌గా టాటా..

Wednesday 17th July 2019

- తర్వాత స్థానాల్లో ఎల్‌ఐసీ, ఇన్ఫీ - బ్రాండ్‌ ఫైనాన్స్ నివేదిక ముంబై: దేశీయంగా టాప్ బ్రాండ్స్‌ జాబితాలో టాటా గ్రూప్ వరుసగా రెండో ఏడాది అగ్రస్థానం దక్కించుకుంది. బ్రిటన్‌కు చెందిన కన్సల్టెన్సీ సంస్థ బ్రాండ్‌ ఫైనాన్స్ విడుదల చేసిన టాప్‌ 100 సంస్థల లిస్టులో ప్రభుత్వ రంగ ఎల్‌ఐసీ, ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిల్చాయి. "భారత్‌లో టాటా గ్రూప్‌ అత్యంత విలువైన బ్రాండ్ కావడంతో పాటు

Most from this category