News


బడ్జెట్‌కు ముందు మంత్రిగారి పూజ

Sunday 2nd February 2020
news_main1580620136.png-31432

బడ్జెట్‌ సమర్పించడానికి కొన్ని గంటల ముందు కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ శనివారం తన నివాస గృహంలో పూజలు చేశారు. నేలపై దుప్పటి పరుచుకుని దైవ విగ్రహం ఎదుట స్వయంగా ఆయనే పూజలో కూర్చున్నారు. ‘ప్రజలందరికీ మంచి జరిగేలా బడ్జెట్‌ను రూపొందించేందుకు ప్రభుత్వం శ్రమించింది. అందరికీ మంచి జరగాలని దైవాన్ని కూడా ప్రార్థించాను. ‘అందరితో కలిసి, అందరి అభివృద్ధికి’ అనే మోదీ ప్రభుత్వ విధానానికి అనుగుణంగా బడ్జెట్‌ రూపకల్పన జరిగింది’’ అని ఠాకూర్‌ అన్నారు. 


బడ్జెట్‌ ప్రసంగానికి భర్త, కూతురు
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ చదివే బడ్జెట్‌ ప్రసంగాన్ని వినేందుకు ఆమె భర్త పరకాల ప్రభాకర్, కూతురు వాంజ్ఞయి  పార్లమెంటుకు వచ్చారు. మోదీ మంత్రివర్గంలో తన భార్య ఆర్థికమంత్రిగా ఉన్నప్పటికీ గత ఏడాది అక్టోబర్‌లో ప్రభాకర్‌ మోదీ ఆర్థిక విధానాలను విమర్శించారు. దేశ ఆర్థిక స్థితి మందగొడిగా ఉండటానికి బీజేపీ ప్రభుత్వం కొత్త విధానాలేమీ ప్రవేశ పెట్టకపోవడమే కారణమని అంటూ, పీవీ నరసింహారావు అవలంబించిన ఆర్థిక విధానాలను అనుసరించాలని మోదీకి అప్పట్లో ఆయన సూచించారు. ఈ నేపథ్యంలోప్రభాకర్‌ తన కుమార్తెతో కలిసి పార్లమెంటుకు రావడం విశేషం అయింది. 

తండ్రి చనిపోయినా.. బడ్జెట్‌ విధుల్లోనే!
ఏటా బడ్జెట్‌ సమర్పణకు జరిగే కసరత్తులో అతి ప్రధానమైనది బడ్జెట్‌ పత్రాల ముద్రణ. ఆర్థిక మంత్రిత్వ శాఖ నేతృత్వంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య కొన్ని రోజులపాటు ముద్రణ జరుగుతుంది. అన్నీ రోజులూ చిన్న కాగితం ముక్క కాదు కదా.. లోపల ఉన్న ఉన్నత అధికారులు కానీ, ముద్రణ సిబ్బంది కానీ బయటికి వెళ్లేందుకు లేదు. అలాంటి సమయంలో జనవరి 26న ముద్రణాలయం లోపల విధి నిర్వహణలో ఉన్న కులదీప్‌ కుమార్‌ శర్మ అనే అధికారికి ఆయన తండ్రి చనిపోయినట్లుగా కబురందింది. ఆ బాధను గుండెను మెలిపెడుతున్నా.. ముద్రణంతా పూర్తయ్యే వరకు కనీసం ఒక్క నిముషమైనా ఆయన విధి నిర్వహణ నుంచి పక్కకు తప్పుకోలేదు. ఈ సంగతిని ముద్రణంతా పూర్తయి అంతా బయటికి వచ్చాక మాత్రమే ఆర్థిక శాఖ బహిర్గతం చేసింది. 

రెస్టారెంట్‌ కష్టమే
బడ్జెట్‌కు ముందు రోజు ‘ఆర్థిక సర్వే’ వస్తుంది. బడ్జెట్‌ ఎలా ఉండబోతోందో ఊహించడానికి ఒక అంచనాకు ఆ సర్వే పనికొస్తుంది. కొన్ని ఆసక్తికరమైన సంగతులు కూడా తెలుస్తాయి. అలాంటిదే ఈ సంగతి కూడా. చైనా, సింగపూర్‌ వంటి దేశాలలో ఒక రెస్టారెంట్‌ పెట్టాలంటే నాలుగు అనుమతి పత్రాలు ఉంటే చాలు. అదే ఇండియాలో కనీసం 26 పత్రాలు కావాలి. ఢిల్లీలో అయితే వీటితో పాటు అదనంగా ‘పోలీస్‌ ఈటింగ్‌ హౌస్‌ లైసెన్స్‌’ ఉండాలి. ఈ లైసెన్స్‌ పొందడానికి మళ్లీ 45 చోట్లకు తిరిగి సంతకాలు చేయించుకోవాలి. దీనికన్నా తుపాకీ లైసెన్స్‌ సంపాదించడం తేలిక. ఓ 19 పత్రాలు పూర్తి చేసి ఇస్తే చేతికి గన్‌ వచ్చేస్తుంది. ఆర్థిక సర్వే చేసిన ఆ వ్యాఖ్యానంలో.. ‘ఎవరైనా రెస్టారెంట్‌ పెట్టాలని ఉత్సాహపడుతుంటే వాళ్ల ప్రయత్నాలను మీ పత్రాలతో అడ్డుకోకండి’ అని చెప్పడం అసలు ఉద్దేశం కావచ్చు. 

ఊదా రంగులో ఎందుకుంది?
బడ్జెట్‌ సమర్పించడానికి నిర్మలా సీతారామన్‌ శనివారం మోసుకొచ్చిన బడ్జెట్‌ బ్యాగు ఈ ఏడాది కూడా ఎర్రటి కుంకుమ రంగులో ఉంటే.. ముందు రోజు ఆర్థిక మంత్రిత్వ శాఖ సమర్పించిన ‘ఆర్థిక సర్వే’ పుస్తకం కవరు ఊదారంగులో ఉంది! ఎరుపు భారతీయ సంస్కృతికి ఒక చిహ్నం అనుకున్నా.. ఈ ఊదా రంగు దేనికి చిహ్నం? ఆర్థిక సర్వే అన్నది పూర్వపు ఏడాది ఆర్థిక స్థితిగతులతో భవిష్యత్తును, సమకాలీన, ప్రాచీన ఆలోచనా విధానాలను సమన్వయం చేసుకుంటూ తయారయ్యే అవలోకన సారాంశం. ఈ ఏడాది ఆర్థిక సర్వే ఇతివృత్తం ‘సంపద సృష్టి’. ఈ రెండు విషయాలను చెబుతూ కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్‌.. మోదీ ప్రభుత్వం తెచ్చిన కొత్త వంద నోటు రంగునే ఆర్థిక సర్వే పుస్తకం కవరు పేజీకి వేసినట్లు తెలిపారు. సంపద వృద్ధికి సంకేతంగా.

ముక్కోణ బడ్జెట్‌
ఆశలు పొదగాలి.. అందరూ ఎదగాలి.. కనురెప్పలం అవాలి అనే మూడు ప్రాముఖ్య అంశాలతో సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగం సాగింది. ప్రజల్లో జీవన నైపుణ్యాలు పెరగాలి, సమాజంలో విద్య విస్తృతం కావాలి.. వ్యవసాయానికి పునరుజ్జీవనం లభించాలని అనే మూడు ధ్యేయాలతో పని చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ఆమె తన బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపారు. 


అప్పుడే పెళ్లా!
ఆడపిల్లల వివాహ వయసు ప్రస్తావన కూడా బడ్జెట్‌లో వచ్చింది. ప్రస్తుతం వారి కనీసం వివాహ వయసు 18. దీనిని ఇరవైకో, ఇంకో ఏడాది పైగానో జరిపేందుకు గల అవకాశాలనన పరిశీలించడం కోసం ఒక టాస్క్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉన్నట్లు సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపారు. అమ్మాయిల కనీస వివాహ వయసు మొదట 15 సంవత్సరాలుగా ఉండేది. 1978లో భారత ప్రభుత్వం దానిని 18 ఏళ్లకు పెంచింది. You may be interested

ఈ-కామర్స్‌ లావాదేవీలపై 1% టీడీఎస్‌

Sunday 2nd February 2020

న్యూఢిల్లీ: ఈ-కామర్స్ లావాదేవీలపై కొత్తగా 1 శాతం టీడీఎస్ (ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్) విధిస్తూ కేంద్రం బడ్జెట్‌లో ప్రతిపాదన చేసింది. దీని ప్రకారం డిజిటల్ ప్లాట్‌ఫాంను నిర్వహించే ఈ-కామర్స్ ఆపరేటరు.. విక్రేతల స్థూల అమ్మకాలకు సంబంధించి 1 శాతం టీడీఎస్‌ మినహాయించాల్సి ఉంటుంది. అయితే, ఈ-కామర్స్ ప్లాట్‌ఫాంపై అంతక్రితం ఏడాది సదరు విక్రేత అమ్మకాలు రూ. 5 లక్షలకన్నా తక్కువ ఉండటంతో పాటు పాన్ ఆధార్ నంబరు ధృవీకరణ

కొత్త విధానంలో పన్నుభారం ఇలా పెరుగుతుంది

Sunday 2nd February 2020

దీర్ఘకాలిక పొదుపు అలవాటుపై ప్రతికూల ప్రభావం ఆర్థికమంత్రి చర్యలను తప్పుపడుతున్న ట్యాక్స్‌ నిపుణులు సాక్షి, అమరావతి: కొత్త పన్నుల విధానంలో పన్ను రేట్లు తగ్గించడం వల్ల పన్ను భారం భారీగా తగ్గుతుందని, దీనివల్ల కేంద్ర ప్రభుత్వం రూ.40,000 కోట్ల ఆదాయం కోల్పోంతుందన్న మాటల్లో వాస్తవం లేదని ట్యాక్సేషన్‌ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కీలకమైన పన్ను మినహాయింపులను ఎత్తివేయడం వల్ల ప్రజల్లో పొదుపు అలవాటుపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు. పన్ను భారం తగ్గించుకోవడానికి చాలామంది

Most from this category