News


విశాఖ స్టీల్‌ప్లాంట్‌ నికర లాభం రూ. 96.71 కోట్లు

Saturday 14th September 2019
news_main1568436711.png-28371

ఉక్కునగరం (గాజువాక) : ప్రభుత్వ రంగ సంస‍్థ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ 2018–19లో రూ. 96.71 కోట్ల నికర లాభం ఆర్జించింది.  శుక్రవారం జరిగిన సంస‍్థ 37వ ఏజీఎంలో కంపెనీ  సీఎండి పి.కె.రథ్‌  ఈ వివరాలను ప్రకటించారు. ఈ ఏడాది రూ. 20,844 కోట్ల టర్నోవర్‌ సాధించి మార్కెట్‌లో 8.80 శాతం వాటాతో అంతకు ముందు ఏడాది కంటే 25 శాతం వృద్ధి నమోదు చేసిందన్నారు. ఆ ఏడాది వడ్డీలు, పన్నులు, తరుగు, రుణ విమోచనలు చెల్లించక ముందు   (ఈబీఐటీడీఏ) రూ. 1802.91 కోట్లు అర్జన సాధించిందన్నారు (అంతకు ముందు ఏడాది ఈబీఐటీడీఏ రూ. 346.19 కోట్లు) .  ఆ ఏడాది హాట్‌ మెటల్, లిక్విడ్‌ స్టీల్, సేలబుల్‌ స్టీల్‌ వంటి  ఉత్పత్తి గణాంకాల్లో కూడా 11 నుంచి 12 శాతం వృద్ధి సాధించిందన్నారు.    2017–18లో రూ. 1369.01 కోట్ల నికర నష్టాలు సాధించగా ఆ తర్వాత సంవత్సరం లాభాలు అర్జించడం విశేషం. ఈ సందర్భంగా సంస‍్థ అభివృద్ధికి సహకరించిన అందరికీ సీఎండి  అభినందనలు తెలిపారు. సమావేశానికి రాష్ట్రపతి ప్రతినిధిగా కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ డైరెక్టర్‌ నీరజ్‌ అగర్వాల్‌ హాజరయ్యారు. సమావేశంలో స్టీల్‌ప్లాంట్‌ డైరెక్టర్లు కె.సి.దాస్, వి.వి.వేణుగోపాలరావు, డి.కె.మొహంతి, కె.కె.ఘోష్, స్వతంత్ర డైరెక్టర్లు ఎస్‌.కె. మిశ్రా, సునీల్‌ గుప్తా, అశ్వినీ మెహ్ర తదితరులు పాల్గొన్నారు. 



You may be interested

ఆస్తుల విక్రయంతో రుణ భారం తగ్గింపు

Saturday 14th September 2019

లిక్విడిటీ మెరుగునకు కాఫీడే చర్యలు న్యూఢిల్లీ: ఆస్తులను విక్రయించి రుణాలను తీర్చడం (డీలివరేజింగ్‌) ద్వారా లిక్విడిటీ మెరుగునకు కాఫీ డే ఎంటర్‌ ప్రైజెస్‌ చర్యలు చేపట్టింది. ఇటీవలే కాఫీ డే ఎంటర్‌ ప్రైజెస్‌ లిమిటెడ్‌ (సీడీఈఎల్‌) దీర్ఘకాలిక రేటింగ్‌ను ‘డి’ (ప్రతికూల దృక్పథానికి) ఇక్రా సంస్థ డౌన్‌ గ్రేడ్‌ చేసింది. అంతకుముందు వరకు బీబీ ప్లస్‌ నెగెటివ్‌ రేటింగ్‌ ఉండేది. రూ.315 కోట్ల దీర్ఘకాలిక రుణాలకు సంబంధించి ఈ రేటింగ్‌ను ఇచ్చింది.

రిటర్నుల ఈ-అసెస్‌మెంట్‌ను నోటిఫై చేసిన కేంద్రం

Saturday 14th September 2019

న్యూఢిల్లీ: దసరా (అక్టోబర్‌ 8) నుంచి ఎలక్ట్రానిక్‌ రూపంలోనే రిటర్నుల పరిశీలన (ఈ-అసెస్‌మెంట్‌)ను ప్రారంభించేందుకు వీలుగా కేంద్ర ఆర్థిక శాఖా శుక్రవారం గజిట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీంతో జాతీయ స్థాయింలో అ-అసెస్‌మెంట్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు వీలు పడుతుంది. ఈ అసెస్‌మెంట్‌కు సంబంధించి వ్యక్తులు వ్యక్తిగతంగా లేదా అధికార ప్రతినిధి ద్వారా ఆదాయపన్ను శాఖా అధికారుల ముందు హాజరవ్వాల్సిన అవసరం లేదని నోటిఫికేషన్‌ స్పష్టం చేసింది. వ్యక్తిగతంగా హాజరై

Most from this category