News


నిలిచిపోయిన ఆర్‌ఐఎల్‌, అరామ్‌కో డీల్‌..!

Wednesday 24th July 2019
news_main1563952063.png-27278

న్యూఢిల్లీ: ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన రిఫైనింగ్, పెట్రోకెమికల్స్‌ వ్యాపారంలో 25 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు సౌదీకి చెందిన అరామ్‌కో ఆసక్తి చూపుతుందన్న విషయం తెలిసిందే కాగా, ఈ డీల్‌ నిలిచిపోయినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పాదక కంపెనీల్లో ఒకటైన సౌదీ అరామ్‌కో లెక్కించిన విలువకు.. ఆర్‌ఐఎల్‌ వాల్యుయేషన్‌కు అంతరం అధికంగా ఉన్న కారణంగానే ఈ డీల్‌ నిలిచిపోయినట్లు చెబుతున్నాయి. ఈ అంశంపై స్పందించిన ఆర్‌ఐఎల్‌ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘కంపెనీ పాలసీ ప్రకారం ఊహాగానాలు, పుకార్లపై మాట్లాడలేం. ఇక నూతన అవకాశాల కోసం నిరంతరం అన్వేషణ కొనసాగుతూనే ఉంటుంది. ఇలాంటివి ఏమైనా ఉంటే సెబీ మార్గదర్శకాల ప్రకారం కచ్చితంగా తెలియజేస్తాం’ అని అన్నారు.



You may be interested

ప్రస్తుతం వేచి చూసే ధోరణే మంచిది: ఎంజెల్‌ బ్రోకింగ్‌

Wednesday 24th July 2019

మిడ్‌క్యాప్‌లో ఫెడరల్‌ బ్యాంక్‌ను పరిశీలించవచ్చు: మయూరేష్ జోషి ప్రస్తుత అనిశ్చితి పరిస్థితుల్లో మీడియా, ఎన్‌బీఎఫ్‌సీ, ఆటో రంగంలోని షేర్లపై వేచి చూసే ధోరణిని అనుసరించడం మంచిదని ఎంజెల్‌ బ్రోకింగ్‌ ఫండ్‌ మేనేజర్‌ మయూరేష్ జోషి ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... వీటి కోసం వేచి చూడడం మంచిది.. మీడియా రంగంలో జీ ఒప్పందం మార్కెట్లకు ఉత్ప్రేరకంగా పనిచేయగలదు. కొత్త టారిఫ్‌ ఆర్డర్‌ కారణంగా ఆదాయాల వృద్ధి

డీహెచ్‌ఎఫ్‌ల్ ఖాతాల్లో అవకతవకలు

Wednesday 24th July 2019

ఆడిటర్ల వెల్లడి న్యూఢిల్లీ: హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ఖాతాల్లో లొసుగులు ఉన్నాయంటూ ఆడిటింగ్ సంస్థలు వెల్లడించాయి. అలాగే కొన్ని రుణాల మంజూరులోనూ అవకతవకలు జరిగాయని పేర్కొన్నాయి. 2019 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం ఆర్థిక ఫలితాలను ఆడిట్ చేసిన డెలాయిట్ హాస్కిన్ అండ్ సెల్స్‌, చతుర్వేది అండ్ షా సంస్థలు ఈ మేరకు నివేదికలను స్టాక్ ఎక్స్చేంజీలకు సమర్పించాయి. "ఆర్థిక ఫలితాలపై అభిప్రాయాలు తెలపడానికి ఆడిట్‌పరంగా తగిన ఆధారాలేమీ లభించలేదు"

Most from this category